AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Canadian MP: మాతృభూమిపై ప్రేమను చాటుకున్న ఇండియన్.. కెనడ పార్లమెంట్‌లో కనడ ప్రసంగం..!

Canadian MP: ఏ దేశమేగినా.. ఎందు కాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని.. విదేశీ గడ్డ మీద రాజకీయాలు చేస్తున్నా మూలాలను మరచిపోలేదు..

Canadian MP: మాతృభూమిపై ప్రేమను చాటుకున్న ఇండియన్.. కెనడ పార్లమెంట్‌లో కనడ ప్రసంగం..!
Chandra Arya Kannada
Shiva Prajapati
|

Updated on: May 21, 2022 | 2:09 PM

Share

Canadian MP: ఏ దేశమేగినా.. ఎందు కాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని.. విదేశీ గడ్డ మీద రాజకీయాలు చేస్తున్నా మూలాలను మరచిపోలేదు ఆ నాయకుడు. కెనడా ఎంపీ చంద్ర ఆర్య తమ పార్లమెంటులో కన్నడలో మాట్లాడి మాతృభాష మీద తన మమకారాన్ని చాటుకున్నారు. కర్ణాటకకు, భారత దేశానికి వెలుపల మరో దేశంలోని చట్టసభలో కన్నడ గొంతు వినిపించడం ఇదే తొలిసారి.

ఎక్కడ ఉన్నా, ఎలా ఉన్నా, నేను ఎల్లప్పుడూ కన్నడిగనే అంటూ సగర్వంగా చాటుకున్నారు చంద్ర ఆర్య. కెనడాలోని నేపియన్‌ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న చంద్ర ఆర్య.. స్పీకర్‌ నుంచి ప్రత్యేక అనుమతి తీసుకొని తన మాతృభాష కన్నడలో ప్రసంగించారు. కన్నడలో మాట్లాడటం తనకు ఎంతో గర్వంగా ఉందని, ఇది ఐదు కోట్ల మంది కన్నడిగులకు ఇది గర్వకారణం అన్నారు చంద్ర ఆర్య. తన ప్రసంగంలో కన్నడ కవి కువెంపు గీతాన్ని వినిపించారు.. చంద్ర ఆర్యను ప్రసంగాన్ని కరతాళ ధ్వనులతో అభినందించారు తోటి ఎంపీలంతా.

కర్ణాటక తుంకూరు జిల్లా సిరా తాలుకాలో పుట్టారు చంద్ర ఆర్య.. బెంగళూరు యూనివర్శిటీ నుంచి ఇంజినీరింగ్‌, కర్ణాటక యూనివర్సిటీలో ఎంబీఏ చేశారు. చంద్ర ఆర్య DRDO, కర్ణాటక స్టేట్‌ ఫైనాన్షియల్‌ కార్పొరేషన్‌లో పనిచేశారు. ఉద్యోగ రీత్యా ఖతార్‌కు, అక్కడి నుంచి కెనడాకు వెళ్లి స్థిరపడ్డారు. చంద్ర ఆర్య తొలిసారి 2015లో కెనడా పార్లమెంటుకు ఎన్నికయ్యారు. 2019లో రెండవసారి విజయం సాధించారు.

బంగ్లాదేశ్‌లో ఇద్దరు హిందువుల హత్య.. భారత్‌ మాస్ వార్నింగ్‌!
బంగ్లాదేశ్‌లో ఇద్దరు హిందువుల హత్య.. భారత్‌ మాస్ వార్నింగ్‌!
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
ఎందుకు విక్రమ్ ఇలా చేశావ్.. బెట్టింగ్‌కు అలవాటు పడి..
ఎందుకు విక్రమ్ ఇలా చేశావ్.. బెట్టింగ్‌కు అలవాటు పడి..
ప్రపంచంలో న్యూ ఇయర్ వేడుకలు ఫస్ట్ ఎక్కడ జరుగుతాయో తెలుసా..?
ప్రపంచంలో న్యూ ఇయర్ వేడుకలు ఫస్ట్ ఎక్కడ జరుగుతాయో తెలుసా..?
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో
5 ఏళ్లలో 1027 శాతం.. రూ. 1 లక్షకు లాభమెంతో తెలిస్తే మైండ్ బ్లాంకే
5 ఏళ్లలో 1027 శాతం.. రూ. 1 లక్షకు లాభమెంతో తెలిస్తే మైండ్ బ్లాంకే
పెళ్లి సింపుల్‌గా..రిసెప్షన్‌ ఘనంగా..ఏకంగా వెయ్యిమంది వంటవాళ్లతో
పెళ్లి సింపుల్‌గా..రిసెప్షన్‌ ఘనంగా..ఏకంగా వెయ్యిమంది వంటవాళ్లతో
JEE Main 2026 అడ్మిక్‌ కార్డుల విడుదల తేదీ ఇదే.. డైరెక్ట్‌ లింక్‌
JEE Main 2026 అడ్మిక్‌ కార్డుల విడుదల తేదీ ఇదే.. డైరెక్ట్‌ లింక్‌