Russia – Ukraine War: రష్యా సంచలన ప్రకటన.. ఆ ప్రాంతంలో యుద్ధం ముగిసిందంటూ..
రష్యా - ఉక్రెయిన్(Russia - Ukraine) ల మధ్య భీకర స్థాయిలో యుద్ధం కొనసాగుతోంది. ఉక్రెయిన్ లోని కీలక భాగాలను ఆక్రమించుకునేందుకు రష్యా పాలులు కదుపుతుండగా.. తమ దేశాన్ని చేజార్చుకోవద్దన్న లక్ష్యంతో ఉక్రెయిన్ సేనలు....
రష్యా – ఉక్రెయిన్(Russia – Ukraine) ల మధ్య భీకర స్థాయిలో యుద్ధం కొనసాగుతోంది. ఉక్రెయిన్ లోని కీలక భాగాలను ఆక్రమించుకునేందుకు రష్యా పాలులు కదుపుతుండగా.. తమ దేశాన్ని చేజార్చుకోవద్దన్న లక్ష్యంతో ఉక్రెయిన్ సేనలు కదన రంగంలో పాల్గొంటున్నారు. ఈ క్రమంలో భారీగా ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరుగుతోంది. ఇదిలా ఉంటే.. ఉక్రెయిన్‌లోని మరియుపోల్ విషయంలో రష్యా కీలక ప్రకటన చేసింది. మరియుపోల్(Mariupol) లో కొన్ని నెలల పాటు సాగిన యుద్ధం ముగిసినట్లు రష్యా ప్రకటించింది. అజోవ్ ప్లాంట్‌కు రక్షణగా ఉన్న ఉక్రెయిన్ సైనికులు పూర్తిగా లొంగిపోయినట్లు రష్యా రక్షణశాఖ కార్యాలయం ప్రకటించింది. ప్లాంట్‌లో పూర్తి ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తెచ్చినట్లు రష్యా దళాలు తెలిపాయి. అంతకు ముందు 2400 మంది ఉక్రెయిన్ పౌరులు, సైనికులను రష్యా సైన్యం తమ అదుపులోకి తీసుకుంది. మరోవైపు.. ఉక్రెయిన్‌పై రష్యా దాడుల నేపథ్యంలో ఆంక్షల పర్వం కొనసాగుతూనే ఉంది. ఉక్రెయిన్‌పై దాడుల్లో రష్యాకు సహకారం అందించిన కారణంగా బెలారస్‌పై సెర్బియా ఆంక్షలు విధించింది. అంతకుముందు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, రష్యాకు చెందిన ప్రముఖులపై కెనడా బ్యాన్ విధించింది.
తమ పైన కూడా రష్యా దురాక్రమణకు దిగవచ్చనే ఉద్దేశంతో ఫిన్లాండ్, స్వీడన్ లు నాటోలో చేరాలని నిర్ణయించుకున్నాయి. ఇందుకు సంబంధించిన దరఖాస్తులను బ్రసెల్స్‌లోని కూటమి ప్రధాన కార్యాలయానికి పంపించాయి. నాటో సభ్యదేశాల్లో ఒకటైన టర్కీ- వీటి చేరికపై అభ్యంతరం చెబుతున్నప్పటికీ..అమెరికా సహా నాటోలోని చాలా దేశాలు ఫిన్లాండ్, స్వీడన్‌ను స్వాగతిస్తున్నాయి. భవిష్యత్తులో స్వీడన్ తన సైనిక బలగాన్ని ఎలా వినియోగిస్తుందనే దానిపై తమ స్పందన ఆధారపడి ఉంటుందని రష్యా తెలిపింది.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Read