Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Indonesia Semeru Volcano: దట్టమైన బూడిద మేఘం.. 13 మందిని పొట్టనబెట్టుకుంది.. వీడియో చూస్తే హడలిపోతారు..

Indonesia Semeru Volcano: మీరెప్పుడైనా బూడిద మేఘాన్ని చూశారా.. అదేంటి, బూడిద మేఘం ఏంటీ అనుకుంటున్నారా.. అయితే, ఈ షాకింగ్ స్టోరీ చదవాల్సిందే.

Indonesia Semeru Volcano: దట్టమైన బూడిద మేఘం.. 13 మందిని పొట్టనబెట్టుకుంది.. వీడియో చూస్తే హడలిపోతారు..
Volcano
Follow us
Shiva Prajapati

|

Updated on: Dec 06, 2021 | 9:13 AM

Indonesia Semeru Volcano: మీరెప్పుడైనా బూడిద మేఘాన్ని చూశారా.. అదేంటి, బూడిద మేఘం ఏంటీ అనుకుంటున్నారా.. అయితే, ఈ షాకింగ్ స్టోరీ చదవాల్సిందే. దట్టమైన మేఘాలు కమ్మేశాయి, మంచు దట్టంగా కురుస్తోంది, దట్టమైన పొగ కమ్మేసింది.. అనే పదా ఇప్పటి వరకు విన్నారు కదా.. తాజాగా ఆ జాబితాలో బూడిద మేఘాలు కూడా చేరింది. ఎందుకంటే.. ఈ బూడిద మేఘంం ఏకంగా 13 మందిని పొట్టనబెట్టుకుంది. దాదాపు 40 మందిని ఆస్పత్రిపాలు చేసింది. వివరాల్లోకెళితే.. ఇండోనేసియాలోని జావా ద్వీపంలో సెమేరు అగ్నిపర్వతం అగ్నిపర్వతం బద్దలైంది. ఈ అగ్నిపర్వతం నుంచి వెలువడిన బూడిద భారీ మేఘంలా కమ్ముకొచ్చింది. దీన్ని చూసి అక్కడి ప్రజలు పరుగులు తీశారు. స్థానికులు కొందరు వీడియో తీసి ఆన్‌లైన్‌లో షేర్ చేయగా.. ఈ భయానక ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో అగ్నిపర్వత ధూళి చుట్టుపక్కల గ్రామాలను కమ్మేయడం స్పష్టంగా కనిపిస్తుంది. దట్టమైన పొగ కారణంగా సూర్యరశ్మి లేక అంధకారం అలముకొంది. అయితే, ఈ బూడిద కారణంగా 13 మంది మృతి చెందగా.. 41 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

కాగా, అగ్నిపర్వతం బద్ధలవడం కారణంగా సుమారు 50 వేల అడుగులు ఎత్తు వరకు బూడిద మేఘం ఆవరిస్తుందని విమానయాన సంస్థలకు హెచ్చరికలు జారీ చేశారు ఇండోనేషియా అధికారులు. దీంతో సెమేరు చుట్టూ 5 కిలోమీటర్ల పరిధిలో ఆంక్షలు విధించింది ఇండోనేషియా ప్రభుత్వం. పెద్దఎత్తున లావా పరిసర గ్రామాలకు విస్తరించడంతో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే పనిలో పడ్డారు అధికారులు. నిర్వాసితుల కోసం లుమాజాంగ్‌లో తాత్కాలిక షెల్టర్లు నిర్మించారు అధికారులు. 2020 డిసెంబరులోనూ ఈ అగ్ని పర్వతం ఒకసారి బద్ధలైంది. ఇండోనేసియాలో తరచూ అగ్నిపర్వతాలు బద్ధలవుతాయన్నాయి. ఈ ఇండోనేసియా దేశంలో దాదాపు 130 క్రియాశీల అగ్నిపర్వతాలు ఉన్నాయి. 2018లో జావా, సుమత్రా దీవుల మధ్య సముద్రంలోని ఓ అగ్నిపర్వతం విస్ఫోటనం చెంది, సునామీ సంభవించి. అప్పుడు 400 మందికి పైగా మృతి చెందారు.

Also read:

Venkatesh: మరో రీమేక్‌లో వెంకీమామ.. త్వరలోనే లైసెన్స్‌ తీసుకునే ఛాన్స్..

Bear Viral Video: అర్ధరాత్రి ఇంట్లోకి ప్రవేశించిన ఎలుగుబంటి మహిళ చేసిన పనికి నెటిజన్లు షాక్‌.. వైరల్ అవుతున్న వీడియో

Skin Care Tips: పుదీనాతో చర్మ సమస్యలను ఇలా తగ్గించుకోవచ్చు.. ఫేస్ ప్యాక్, స్క్రబ్ ఎలా తయారుచేయాలంటే..