ఇండోనేషియాను కుదిపేస్తున్న కొత్త చట్టం… ఇంతకీ అదేంటంటే..?
పెళ్లికి ముందు శృంగారం వద్దు అని ఇండోనేషియా ప్రభుత్వం కొత్త చట్టాన్ని తీసుకురానున్నది. దీనిపై అక్కడ ప్రజల్లో తీవ్ర ఆగ్రాహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ నిరసనకారులు ఆ దేశ పార్లమెంట్‌ను చుట్టుముట్టారు. వారిని చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీ చార్ట్ చేయడమే కాకుండా.. టియర్ గ్యాస్ ప్రయోగించారు. ఇండోనేషియా రాజధాని జకర్తాతో పాటు ఇతర నగరాల్లోనూ ప్రదర్శనలు మిన్నంటాయి. ఈ బిల్లును ఆమోదిస్తే, దేశంలో అబార్షన్లు తగ్గుతాయని ప్రభుత్వం వాదిస్తుంది. వివాదాస్పదంగా మారిడంతో ప్రభుత్వం ప్రస్తుతానికి ఈ […]
పెళ్లికి ముందు శృంగారం వద్దు అని ఇండోనేషియా ప్రభుత్వం కొత్త చట్టాన్ని తీసుకురానున్నది. దీనిపై అక్కడ ప్రజల్లో తీవ్ర ఆగ్రాహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ నిరసనకారులు ఆ దేశ పార్లమెంట్‌ను చుట్టుముట్టారు. వారిని చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీ చార్ట్ చేయడమే కాకుండా.. టియర్ గ్యాస్ ప్రయోగించారు. ఇండోనేషియా రాజధాని జకర్తాతో పాటు ఇతర నగరాల్లోనూ ప్రదర్శనలు మిన్నంటాయి. ఈ బిల్లును ఆమోదిస్తే, దేశంలో అబార్షన్లు తగ్గుతాయని ప్రభుత్వం వాదిస్తుంది.
వివాదాస్పదంగా మారిడంతో ప్రభుత్వం ప్రస్తుతానికి ఈ బిల్లు ప్రస్తుతం పక్కన పెట్టింది. అయినప్పటికి ఆందోళనకారులు మాత్రం దానిపై తమ నిరసనలను తెల్పుతూనే ఉన్నారు. పెళ్లికి ముందు సెక్స్‌లో పాల్గొంటే.. వారికి ఏడాది కాలం పాటు జైలు శిక్ష విధించనున్నట్లు కొత్త చట్టం చెబుతోంది. ఒకవేళ వివాహేతర సంబంధం పెట్టుకున్నా.. వారికి ఆర్నెళ్ల జైలు శిక్ష ఉంటుంది. అబార్షన్ చేసుకున్న మహిళలకు నాలుగేళ్ల శిక్షను విధించనున్నారు. వీటితో పాటు దేశాధ్యక్షుడిని, ఉపాధ్యక్షుడిని, మతాన్ని, ప్రభుత్వ సంస్థలను, జాతీయ గీతాన్ని అవమానించినా.. వారికి భారీ శిక్షను అమలు చేయనున్నారు. వాస్తవానికి ఈ బిల్లులపై మంగళవారం ఓటింగ్ జరగాల్సి ఉంది, కానీ నిరసనల దృష్ట్యా వాయిదా వేశారు.