AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వరల్డ్ టూరిజం డే: తుర్‌తుక్.. కశ్మీర్ లోయలోని భూతల స్వర్గం!

దేశవిదేశాల నుంచి పర్యాటకులను ఆకర్షించడానికి కేంద్ర ప్రభుత్వం పర్యాటక శాఖను ఎంతో అభివృద్ధి చేసింది. ముఖ్యంగా మనదేశం బౌద్ధ ఆరామాలు, మొగల్ చక్రవర్తులు, రాజపుత్ర వంశీయుల చారిత్రక సంపద, లెక్కలేనన్ని హిందూ దేవాలయాలు, నదులు, కొండలు, గుట్టలు, అడవులు, సముద్ర తీరాలు ఒకటా రెండా ఎన్నో ఎన్నెన్నో చారిత్రక ఆనవాళ్లకు ప్రసిద్ధిగా నిలిచింది. ఇప్పటికీ అజంతా,ఎల్లోరా గుహలు ఎంతో ప్రసిద్ధి. అలాగే రాజస్ధాన్ థార్ ఎడారి, తాజ్ మహల్, ఢిల్లీ గేట్, గేట్ వే ఆఫ్ ఇండియా […]

వరల్డ్ టూరిజం డే: తుర్‌తుక్.. కశ్మీర్ లోయలోని భూతల స్వర్గం!
Ravi Kiran
| Edited By: seoteam.veegam|

Updated on: Sep 27, 2019 | 3:50 PM

Share

దేశవిదేశాల నుంచి పర్యాటకులను ఆకర్షించడానికి కేంద్ర ప్రభుత్వం పర్యాటక శాఖను ఎంతో అభివృద్ధి చేసింది. ముఖ్యంగా మనదేశం బౌద్ధ ఆరామాలు, మొగల్ చక్రవర్తులు, రాజపుత్ర వంశీయుల చారిత్రక సంపద, లెక్కలేనన్ని హిందూ దేవాలయాలు, నదులు, కొండలు, గుట్టలు, అడవులు, సముద్ర తీరాలు ఒకటా రెండా ఎన్నో ఎన్నెన్నో చారిత్రక ఆనవాళ్లకు ప్రసిద్ధిగా నిలిచింది. ఇప్పటికీ అజంతా,ఎల్లోరా గుహలు ఎంతో ప్రసిద్ధి. అలాగే రాజస్ధాన్ థార్ ఎడారి, తాజ్ మహల్, ఢిల్లీ గేట్, గేట్ వే ఆఫ్ ఇండియా (ముంబై)… ఇలా మన దేశ నలుమూల్లో ఎన్నో రకాల టూరిస్ట్ స్పాట్స్ యువతను ఎంతగానో ఆకర్షిస్తున్నాయి. ఇప్పుడు వాటిల్లో ఒకటైన తుర్‌తుక్ గ్రామం గురించి తెలుసుకుందాం.

తుర్‌తుక్.. భారతదేశపు ఉత్తర అంచున లఢక్లోని నుబ్రా లోయకు చిట్టచివరన ఉన్న అందమైన చిన్న ఊరు. కారకోరం పర్వత శ్రేణుల్లో షియాక్ నదిని ఆనుకుని ఉన్న ఈ గ్రామం ప్రకృతి అందాలకు నెలవు. ఈ  చిన్న గ్రామం 1971 వరకు పాకిస్థాన్ నియంత్రణలో ఉండేది. అయితే 1971లో జరిగిన యుద్ధ తరుణంలో భారత్ ఈ గ్రామాన్ని స్వాధీనం చేసుకుంది. అప్పటి నుంచి ఈ గ్రామాన్ని భారత్.. పాకిస్థాన్‌కు తిరిగి ఇవ్వలేదు. దానితో దశాబ్ద కాలంగా ఈ ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం తగ్గు ముఖం పట్టింది. 2010వ సంవత్సరం నుంచి ఈ ప్రాంతానికి పర్యాటకులను అనుమతించారు. ఆ ఊరిలోని అన్ని ఇండ్లు పర్వతాల రాళ్లతోనే నిర్మితమై చూడ ముచ్చటగా ఉంటాయి.

ఆకుపచ్చని అందం ఈ ఊరు సొంతం…

తుర్‌తుక్ గ్రామంలో ఎక్కువగా జొన్నలు, ఓ రకం గోధుమలు, ఆప్రికాట్లు, వాల్‌నట్స్ పండిస్తారు. ఈ ఊరంతా పచ్చని పంటలతో కళకళలాడిపోతుంది. భారత్‌కు దాయాది పాకిస్థాన్‌కు మధ్య కశ్మీర్ వివాదం ఉన్నప్పటికీ ఈ గ్రామంలో ప్రజలు ప్రశాంతంగా జీవించారు. 1971లో గ్రామాన్ని స్వాధీనం చేసుకున్న భారత్.. గ్రామస్తులందరికి భారత పౌరసత్వంతో పాటు గుర్తింపు కార్డులు ఇచ్చింది. అంతేకాదు నుబ్రా లోయ ప్రాంత గ్రామాలన్నిటికీ మంచి రోడ్లు, మౌలిక వసతులు కల్పించింది.

వసంత శోభకు.. తుర్‌తుక్ మనోహరమైయే…

ప్రకృతి అందాలతో పర్యాటకులను అబ్బురపరిచే తుర్‌తుక్.. వసంతం వచ్చిందంటే చాలు మరింత మనోహరంగా మారిపోతుంది. కారకోరం పర్వత శ్రేణుల చుట్టూ ఆకుపచ్చ, పసుపు ఆకులతో నిండిన చెట్లు.. అంతేకాకుండా వాటికి పూసిన రంగురంగుల పూలు జనాలను చూపు తిప్పుకోనీకుండా చేస్తాయి. ఇక తుర్‌తుక్‌లోని రాతి నిర్మాణాలన్నీ తరచూ వచ్చే భూకంపాలనూ సైతం తట్టుకునే విధంగా ఉంటాయి.