భారత్‌లో 30 చోట్ల బాంబ్ బ్లాస్ట్‌కి.. జైషే మహమ్మద్ ప్లాన్..!
భారత్‌లో ఉగ్రవాదులు భారీ కుట్రకు ప్లాన్ చేశారు. ఇప్పటికే దేశ వ్యాప్తంగా.. పలు ప్రాంతాల్లో.. హై అలెర్ట్ ప్రకటించినా.. వారి ప్లాన్స్ మాత్రం ఆగడం లేదు. తాజాగా.. ఇంటెలిజెన్స్ తెలిపిన సమాచారం ప్రకారం.. టెర్రరిస్టులు.. భారత్‌లో దాదాపు 30కి పైగా ప్రాంతాల్లో బాంబ్ బ్లాస్ట్‌కి ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. దీంతో.. భారత్‌లో మరింతగా భద్రతను కట్టుదిట్టం చేసింది ప్రభుత్వం. ఇప్పటికే.. భారత దేశ తీర ప్రాంతాల్లో.. ముఖ్యంగా.. విశాఖ, శ్రీకాకుళాల్లో మరింతగా.. భద్రతను కట్టుదిట్టం చేశారు పోలీసులు. […]
భారత్‌లో ఉగ్రవాదులు భారీ కుట్రకు ప్లాన్ చేశారు. ఇప్పటికే దేశ వ్యాప్తంగా.. పలు ప్రాంతాల్లో.. హై అలెర్ట్ ప్రకటించినా.. వారి ప్లాన్స్ మాత్రం ఆగడం లేదు. తాజాగా.. ఇంటెలిజెన్స్ తెలిపిన సమాచారం ప్రకారం.. టెర్రరిస్టులు.. భారత్‌లో దాదాపు 30కి పైగా ప్రాంతాల్లో బాంబ్ బ్లాస్ట్‌కి ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. దీంతో.. భారత్‌లో మరింతగా భద్రతను కట్టుదిట్టం చేసింది ప్రభుత్వం. ఇప్పటికే.. భారత దేశ తీర ప్రాంతాల్లో.. ముఖ్యంగా.. విశాఖ, శ్రీకాకుళాల్లో మరింతగా.. భద్రతను కట్టుదిట్టం చేశారు పోలీసులు. అలాగే.. సముద్ర మార్గం ద్వారా కూడా.. ఉగ్రవాదులు చొరబడే అవకాశమున్నందున్న.. కోస్ట్‌గార్డ్స్ ముమ్మర తనిఖీలు చేపడుతున్నారు. అనుమానమొచ్చిన ప్రతీ వ్యక్తిని ఆరా తీస్తున్నారు.
ఆర్టికట్స్ 370 రద్దు తర్వాత.. భారత్‌పై పాకిస్తాన్ కడుపు మంటతో ఉంది. ఇప్పుడున్న పరిస్థితి ప్రకారం.. కశ్మీర్‌లో.. పాకిస్తాన్ పప్పులుడికేలా కనిపించడం లేదు. దీంతో.. ఏం చేయాలో తెలియని పాకిస్తాన్.. ముష్కరులను రెచ్చగొట్టి.. ఈ విధమైన విధ్వంసకర ప్లాన్స్ వేస్తుంది. ఐబీ కనిపెట్టిన జైషే మహమ్మద్ లేఖలో అనేక ఉగ్రకుట్రకు సంబంధించిన లింక్స్ ఉన్నాయి. దేశంలో ముప్పై చోట్ల పేలుళ్లకు వేసిన ప్లాన్‌లో గాంధీనగర్, కాన్పూర్, లక్నో ఎయిర్‌పోర్ట్‌లు కూడా ఉన్నాయి. ఈ మూడు ఎయిర్‌పోర్టులను పేల్చేయాలని.. టెర్రరిస్టులు.. పన్నాగం పన్నినట్టు సమాచారం.