Bank Account: బ్యాంక్ ఖాతాదారుడు మరణిస్తే.. అతడి అకౌంట్లో సొమ్ము అలాగే ఉంటుందా..? బ్యాంకింగ్ రూల్స్ ఇవే..
ఖాతాదారుడు మరణిస్తే అతడి బ్యాంక్ అకౌంట్లోని సొమ్ము అలాగే ఉండిపోతుందని చాలామంది అనుకుంటారు. కానీ అది సరికాదు. నామినీలు, చట్టబద్దమైన వారసులు ఈ సొమ్మును తీసకోవచ్చు. మరణించిన వ్యక్తి బ్యాంక్ అకౌంట్ వివరాలను సులవుగా పోర్టల్ ద్వారా తెలుసకోవచ్చు. అతడి పేరు, ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తే సరిపోతుంది.

ఒక వ్యక్తి మరణిస్తే అతడి బ్యాంక్ అకౌంట్‌ను కుటుంబసభ్యులు సులువుగా గుర్తించవచ్చు. అతడి బ్యాంక్ అకౌంట్లోని నగదును సులభంగా నామినీలు, చట్టబద్ద వారసులు క్లెయిమ్ చేసుకోవచ్చు. ఒక వ్యక్తి మరణిస్తే అతడి బ్యాంక్ అకౌంట్ వివరాలు తెలుసుకోవడం నామినీలకు కష్టతరమవుతుంది. దీని వల్ల మరణించిన వ్యక్తి బ్యాంక్ అకౌంట్లో నగదు అలాగే ఉండిపోతుంది. దీనిని గుర్తించిన ఆర్బీఐ ఇందుకోసం ఒక ప్రత్యేక పోర్టల్ తీసుకొచ్చింది. అదే UDGAM పోర్టల్. ఈ వెబ్‌సైట్ ద్వారా ఆధార్, మొబైల్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఆధారంగా వివరాలను తెలుసుకోవచ్చు. బ్యాంక్ వివరాలను ఇతరులు ఎలా కనుగొనాలి..? ఆ అకౌంట్లోని నగదును ఎలా తీసుకోవాలి? అనే విషయాలు ఇప్పుడు చూద్దాం.
బ్యాంక్ అకౌంట్ వివరాలు ఎలా తెలుసుకోవాలి..?
-UDGAM పోర్టల్ ఓపెన్ చేయండి
-మరణించిన వ్యక్తి పేరు, మొబైల్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ లాంటివి నమోదు చేయండి
-అనంతరం పూర్తి పేరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది
-పాన్, ఆధార్, ఓటర్ ఐడీ, పాస్ పోర్ట్, డేట్ ఆఫ్ బర్త్ డాక్యుమెంట్లలో ఏదైనా ఒకటి సమర్పించండి
-అనంతరం సదరు వ్యక్తి బ్యాంక్ వివరాలతో పాటు క్లెయిమ్ చేయని సొమ్ము వివరాలు స్క్రీన్‌పై కనిపిస్తాయి
-ఆ వివరాలతో పాటు UDRN కోడ్ స్క్రీన్‌షాట్ తీసుకోండి
-డెట్ సర్టిఫికేట్, వారసుల పత్రాలు, కేవైసీ లేఖను బ్యాంక్ సిబ్బందికి సమర్పించండి
-క్లెయిమ్ కోసం దరఖాస్తు చేసుకోండి
-వివరాలు పరీశీలించి సిబ్బంది మీకు ఆ వ్యక్తి అకౌంట్లోని డబ్బులను అందిస్తారు.
డబ్బులు ఎవరు తీసుకోవచ్చు..?
నామినీ లేదా చట్టబద్దమైన వారసులు ఎవరైనా డబ్బులు తీసుకోవచ్చు. డెట్ సర్టిఫికేట్, ఆధార్, పాన్ కార్డు లాంటివి అందించి డబ్బులు విత్ డ్రా చేసుకోవచ్చు. అయితే వ్యక్తి మరణించినా కొన్నేళ్ల పాటు ఆ అకౌంట్‌లోని సొమ్మును విత్ డ్రా చేసుకోకపోతే అకౌంట్ ఇనాక్టివ్ అవుతుంది. ఇనాక్టివ్ అయిన అకౌంట్లలోని సొమ్మును 10 ఏళ్ల పాటు క్లెయిమ్ చేసుకోకపోతే అన్‌క్లెయిమ్డ్ సొమ్ముగా భావిస్తారు. ఈ సొమ్ము ఆర్బీఐ ఏర్పాటు చేసి ప్రత్యేక ఫండ్‌కు వెళుతుంది. ఆ తర్వాత అయినా ఈ డబ్బును నామినీలు తీసుకోవచ్చు. జస్ట్ బ్యాంక్‌కు వెళ్లి కేవైసీ పూర్తి చేస్తే అకౌంట్ యాక్టివ్ అవుతుంది. అనంతరం అకౌంట్లోని సొమ్మును తీసుకోవచ్చు.
