Green Card: అమెరికాలో ఉన్న భారతీయులకు గుడ్‌ న్యూస్‌.. వేలాది మందికి మేలు చేయనున్న కొత్త చట్టం..

News For Indians In USA: అమెరికాలో నివసిస్తోన్న ప్రతీ భారతీయుడి అతి పెద్ద డ్రీమ్‌ గ్రీన్‌ కార్డు. అమెరికాలో పౌరసత్వం అందించే ఈ గ్రీన్‌కార్డు కోసం ఎంతో మంది..

Green Card: అమెరికాలో ఉన్న భారతీయులకు గుడ్‌ న్యూస్‌.. వేలాది మందికి మేలు చేయనున్న కొత్త చట్టం..
Follow us

|

Updated on: Feb 19, 2021 | 2:37 PM

News For Indians In USA: అమెరికాలో నివసిస్తోన్న ప్రతీ భారతీయుడి అతి పెద్ద డ్రీమ్‌ గ్రీన్‌ కార్డు. అమెరికాలో పౌరసత్వం అందించే ఈ గ్రీన్‌కార్డు కోసం ఎంతో మంది ఎదురుచూస్తుంటారు. అమెరికాలో నివసిస్తూ గ్రీన్‌ కార్డు కోసం ఎదురుచూస్తోన్న వారికి బైడెన్‌ ప్రభుత్వం శుభవార్త తెలిపింది. అమెరికాలో నివసిస్తున్న 11 మిలియన్ల మంది అక్రమ వలసదారులకు పౌరసత్వం, దేశాల వారీ గ్రీన్‌ కార్డు తొలగింపు, హెచ్‌1బీ వీసా దారుల భాగస్వాములు అగ్రరాజ్యంలో పని చేసుకోవడానికి వీలు కల్పించే ప్రతిపాదనల అమలు కోసం దేశ అధ్యక్షుడు జో బైడెన్‌ తీసుకొచ్చిన యూఎస్‌ సిటిజెన్‌షిప్‌ యాక్ట్‌ 2021ను తాజాగా అమెరికన్‌ కాంగ్రెస్‌లో ప్రవేశపెట్టారు. ఇక ఈ చట్టానికి ఆమోదం లభిస్తే.. లక్షల్లో ఉన్న అక్రమ వలసదారులతో పాటు చట్టబద్ధంగా అమెరికాలో ఉంటున్న వారికి పౌరసత్వం లభిస్తుంది. ఈ చట్టం వల్ల వేలాది మంది భారతీయ ఐటీ నిపుణులు, వారి కుటుంబ సభ్యులకు మేలు జరగనుంది. అంతేకాకుండా ఈ చట్టం కార్యరూపం దాల్చితే.. వార్షిక ఆధారిత గ్రీన్‌ కార్డు కోటా పెరగనుంది. ఈ చట్టంతో ఏడాదికి జారీ చేస్తున్న లక్ష 40 వేల గ్రీన్‌ కార్డులను లక్ష 70 వేలకు పెంచనున్నారు. ఇదిలా ఉంటే ఇప్పటికే సుమారు 8 లక్షల మంది ఎన్నారైలు గ్రీన్‌ కార్డుల కోసం క్యూలో ఉన్నారు.

Also Read: Vaccination: వేగవంతంగా కరోనా వ్యాక్సినేషన్.. ప్రపంచంలో మూడో స్థానంలో భారత్‌..