AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అమెరికాలో కార్గో స్కామ్.. ట్రక్కింగ్ కంపెనీలను అడ్డుపెట్టుకుని చోరీకి పాల్పడ్డ ఇద్దరు భారతీయులు!

దక్షిణ కాలిఫోర్నియా, టెక్సాస్ ప్రాంతాల్లో చట్టబద్ధమైన ట్రక్కింగ్ కంపెనీలను అడ్డుపెట్టుకుని కోట్లాది రూపాయల విలువైన సరుకును దొంగిలించిన కేసులో ఇద్దరు భారతీయ పౌరులను అమెరికా జ్యూరీ దోషులుగా నిర్ధారించింది. కాలిఫోర్నియాలోని శాక్రమెంటోకు చెందిన 28 ఏళ్ల అర్ష్‌ప్రీత్ సింగ్, ఫాంటానాకు చెందిన 31 ఏళ్ల విక్రమ్‌జీత్ సింగ్ ఈ కేసులో దోషులుగా తేలారు. ఏడు రోజుల పాటు సాగిన విచారణ అనంతరం సెప్టెంబర్ 29న జ్యూరీ ఈ తీర్పు ఇచ్చింది.

అమెరికాలో కార్గో స్కామ్.. ట్రక్కింగ్ కంపెనీలను అడ్డుపెట్టుకుని చోరీకి పాల్పడ్డ ఇద్దరు భారతీయులు!
Us Cargo Theft Case
Balaraju Goud
|

Updated on: Oct 01, 2026 | 12:43 PM

Share

అమెరికా: దక్షిణ కాలిఫోర్నియా, టెక్సాస్ ప్రాంతాల్లో చట్టబద్ధమైన ట్రక్కింగ్ కంపెనీలను అడ్డుపెట్టుకుని కోట్లాది రూపాయల విలువైన సరుకును దొంగిలించిన కేసులో ఇద్దరు భారతీయ పౌరులను అమెరికా జ్యూరీ దోషులుగా నిర్ధారించింది. కాలిఫోర్నియాలోని శాక్రమెంటోకు చెందిన 28 ఏళ్ల అర్ష్‌ప్రీత్ సింగ్, ఫాంటానాకు చెందిన 31 ఏళ్ల విక్రమ్‌జీత్ సింగ్ ఈ కేసులో దోషులుగా తేలారు. ఏడు రోజుల పాటు సాగిన విచారణ అనంతరం సెప్టెంబర్ 29న జ్యూరీ ఈ తీర్పు ఇచ్చింది.

మార్చి 2024 నుంచి జూన్ 2025 వరకు ఈ వ్యవహారం కొనసాగింది. నిందితులు ఇప్పటికే ఉన్న ట్రక్కింగ్ కంపెనీలను కొనుగోలు చేయడం, వాటి పేర్లను మోసపూరితంగా ఉపయోగించడం ద్వారా అసలైన షిప్పింగ్ కాంట్రాక్టులు పొందేవారు. అనంతరం గిడ్డంగుల నుంచి సరుకును తీసుకుని, ఒప్పందంలో పేర్కొన్న గమ్యస్థానాలకు చేరవేయకుండా దారి మళ్లించి దొంగిలించేవారు. ఈ పథకం ద్వారా జరిగిన నష్టం కనీసం 2 మిలియన్ డాలర్లుగా అధికారులు అంచనా వేశారు.

దొంగిలించిన వస్తువుల్లో టెలివిజన్లు, ల్యాప్‌టాప్‌లు, గృహోపకరణాలు, సోలార్ ప్యానెళ్లు, వాక్యూమ్ క్లీనర్లు, ఎల్‌ఈడీ లైట్లు, బూట్లు, టైర్లు తదితరాలు ఉన్నాయి. ఫొంటానా, వెర్నాన్, శాంటా ఫే స్ప్రింగ్స్, పెర్రిస్, లాంగ్ బీచ్, కాంప్టన్, చినో, మోరెనో వ్యాలీ సహా దక్షిణ కాలిఫోర్నియాలోని పలు ప్రాంతాలతో పాటు టెక్సాస్‌లోని గ్రాండ్ ప్రైరీలోనూ సరుకు చోరీలు జరిగినట్లు దర్యాప్తులో వెల్లడైంది.

2024 మార్చిలో అర్ష్‌ప్రీత్ సింగ్ టెక్సాస్‌కు చెందిన Z&F Transportation LLCని సుమారు 22 వేల డాలర్లకు కొనుగోలు చేసినట్లు విచారణలో సాక్ష్యాలు సమర్పించారు. అదే నెలలో ఆ కంపెనీ పేరుతో ఫొంటానాలో టెలివిజన్ల లోడ్‌ను తీసుకుని ఫ్లోరిడాకు తరలించాల్సి ఉండగా, అది గమ్యస్థానానికి చేరలేదు. అలాగే 2024 మేలో Skyways Trucking LLCని స్వాధీనం చేసుకుని, బ్రోకర్ల ద్వారా పొందిన ల్యాప్‌టాప్‌లు, టీవీలు, సోలార్ ప్యానెళ్ల లోడ్లను తీసుకున్న తర్వాత డెలివరీ చేయకుండా దారి మళ్లించినట్లు ప్రాసిక్యూషన్ తెలిపింది.

ఇద్దరినీ అంతర్రాష్ట్ర లేదా అంతర్జాతీయ రవాణాలోని సరుకును దొంగిలించేందుకు కుట్ర పన్నిన కేసులో దోషులుగా నిర్ధారించారు. అర్ష్‌ప్రీత్ సింగ్ వైర్ ఫ్రాడ్ కుట్రలోనూ దోషిగా తేలగా, విక్రమ్‌జీత్ సింగ్‌పై ఉన్న మరో వైర్ ఫ్రాడ్ కుట్ర ఆరోపణలో మాత్రం నిర్దోషిగా విడుదలయ్యాడు. ఇద్దరికీ శిక్షను 2027 జనవరి 20న ఖరారు చేయనున్నారు. అర్ష్‌ప్రీత్‌కు చట్టప్రకారం గరిష్ఠంగా 20 ఏళ్ల ఫెడరల్ జైలు శిక్ష, విక్రమ్‌జీత్‌కు గరిష్ఠంగా ఐదేళ్ల శిక్ష పడే అవకాశం ఉందని అమెరికా న్యాయశాఖ తెలిపింది.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us