AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: ఎల్‌నీనో ఎఫెక్ట్.. ఉపాధి హామీ పథకంపై ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇకపై..

ఎల్‌నినో పరిస్థితుల నేపథ్యంలో పేద ప్రజలకు అండగా ఉండేందుకు తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. కరువు పరిస్థితులను ఎదుర్కొనే చర్యల్లో భాగంగా గిరిజన ప్రాంతాల్లో 125 రోజుల ఉపాధి కల్పనకు సిద్ధమైంది. ఈ మేరకు గిరిజన ప్రాంతాల్లో జాబ్‌లేని ప్రజలను గుర్తించి వారికి కొత్త కార్డులు జారీ చేయాలని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది.

Telangana: ఎల్‌నీనో ఎఫెక్ట్.. ఉపాధి హామీ పథకంపై ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇకపై..
125 Days Wage Employment And Job Cards For Tribal Families
Anand T
|

Updated on: Oct 23, 2026 | 6:28 PM

Share

ఎల్‌నినో ప్రభావం వల్ల ఉత్పన్నమయ్యే పరిస్థితులు, కరువు ప్రభావాలను ఎదుర్కొనేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో కరువు పరిస్థితులను అధిగమించేందుకు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది.

ఈ మేరకు గిరిజన ప్రాంతాల్లో ఉపాధి కల్పనను వేగవంతం చేసేందుకు పలు కీలక మార్గదర్శకాలను జారీ చేసింది. ఇప్పటివరకు జాబ్ కార్డులు లేని గిరిజన కుటుంబాలను గుర్తించి, వారికి వెంటనే కొత్త జాబ్ కార్డులను మంజూరు చేయాలని అధికారులను ఆదేశించింది. అంతేకాకుండా, కుటుంబంలో 18 ఏళ్లు నిండిన అర్హులైన సభ్యుల పేర్లను కూడా జాబ్ కార్డుల్లో నమోదు చేయాలని స్పష్టం చేసింది.

గిరిజన కుటుంబాలకు అండగా నిలిచేలా ఏకంగా 125 రోజుల ఉపాధి కల్పనకు తగిన చర్యలు చేపట్టాలని ప్రభుత్వం సూచించింది. కరువు పరిస్థితుల నేపథ్యంలో ఈ నిర్ణయాలను క్షేత్రస్థాయిలో వేగంగా అమలు చేసేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లకు ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us