ఆఫ్ఘన్ దేశస్థులకు ఆశ్రయం కల్పించే యోచనలో భారత్..? అదే బాటలో అమెరికా, కెనడా..?

ఆఫ్గనిస్తాన్ లో అనేక ప్రాంతాలను తాలిబన్లు వశపరచుకొంటుండగా అక్కడి పరిస్థితులు రోజురోజుకీ దిగజారుతుండడంతో ఆఫ్ఘన్లకు రక్షణ కరువవుతోంది.. ఆఫ్ఘన్ ప్రభుత్వం దాదాపు చేతులెత్తేయడంతో వీరి భవితవ్యం అగమ్యగోచరంగా మారింది.

ఆఫ్ఘన్ దేశస్థులకు ఆశ్రయం కల్పించే యోచనలో భారత్..? అదే బాటలో అమెరికా, కెనడా..?
India May Provide Refuge To Afghans
Follow us
Umakanth Rao

| Edited By: Phani CH

Updated on: Aug 15, 2021 | 12:58 PM

ఆఫ్గనిస్తాన్ లో అనేక ప్రాంతాలను తాలిబన్లు వశపరచుకొంటుండగా అక్కడి పరిస్థితులు రోజురోజుకీ దిగజారుతుండడంతో ఆఫ్ఘన్లకు రక్షణ కరువవుతోంది.. ఆఫ్ఘన్ ప్రభుత్వం దాదాపు చేతులెత్తేయడంతో వీరి భవితవ్యం అగమ్యగోచరంగా మారింది. ఈ పరిస్థితుల్లో వీరిని ఆదుకోవాలని భారత ప్రభుత్వం యోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఆఫ్ఘన్లకు ఆశ్రయం కల్పించాలన్న ప్రతిపాదనను ప్రభుత్వం చురుకుగా పరిశీలిస్తోందని అంటున్నారు. ఆ దేశానికి చెందిన పలువురు జర్నలిస్టులు, యాక్టివిస్టులు, రైటర్లు, ఇతర మైనారిటీలు ఇండియాతో పరోక్షంగా సంబంధాలను కలిగి ఉన్నారు. ఈ దేశంలో ఉంటున్న ఆఫ్ఘన్ విద్యార్థులకు ప్రభుత్వం స్కాలర్ షిప్ లు కూడా ఇస్తున్న విషయం గమనార్హం. ఆఫ్ఘన్ దేశస్థులు ఏ మతానికి చెందినవారైనా వారికి వీసాలు ఇవ్వాలని సర్కార్ ఆలోచిస్తోందని తెలిసింది. అమెరికా సైతం అనేకమంది ఆఫ్ఘన్ల వీసాలను ప్రాసెస్ చేస్తోంది. కాబూల్ లోని హమీద్ కర్జాయ్ విమానాశ్రయంలో పలువురు ఆఫ్ఘన్లు తమ ప్రాసెసింగ్ సెంటర్ కి తమ తోడ్పాటునందించారు. అవకాశం ఇస్తే తాము అమెరికాలో సెటిల్ అయ్యేందుకు వారు తమ సంసిద్ధత వెలిబుచ్చారు.

ఇక కెనడా కూడా ఈ దేశానికి చెందిన మహిళా నేతలు, వర్కర్లు, రిపోర్టర్లతో సహా దాదాపు 20 వేలమందికి ఆశ్రయం కల్పించేందుకు రెడీ అయినట్టు తెలిసింది. మానవతా దృక్పథంతో ఈ దిశగా నిర్ణయం తీసుకోవాలని కెనడా అధికారులు యోచిస్తున్నారు. అటు ఆఫ్ఘనిస్తాన్ లోని పరిస్థితిని ఇండియా ఎప్పటికప్పుడు నిశితంగా పరిశీలిస్తోంది; మజారే షరీఫ్ అనంతరం తాలిబన్లు జలాలాబాద్ నగరాన్ని కూడా తమ హస్తగతం చేసుకున్నారు. ఇక కాబూల్ నగరం వారికి మరెంతో దూరంలో లేదు. ప్రస్తుతం కాందహార్, మజారే షరీఫ్ లలోని భారత దౌత్య కార్యాలయాల్లో సంబంధిత కార్యకలాపాలను స్థానికులే చూసుకుంటున్నారు. ఇప్పటికే ఈ కార్యాలయాల నుంచి అనేకమంది భారత సిబ్బంది స్వదేశానికి చేరుకున్నారు.

మరిన్ని ఇక్కడ చూడండి: భారత్ తో భాగస్వామ్యం మరింత బలోపేతం కావాలన్న అమెరికా అధ్యక్షుడు జోబైడెన్.. సాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు

Anantapur District: అనంతలో కీచకుడు.. ఏఎన్‌ఎమ్‌లను వేధిస్తున్న ఫార్మా అసిస్టెంట్‌.. తట్టుకోలేక తాటతీశారు