భారత్ తో భాగస్వామ్యం మరింత బలోపేతం కావాలన్న అమెరికా అధ్యక్షుడు జోబైడెన్.. సాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు
భారత 75 వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ భారతీయులకు శుభాకాంక్షలు తెలిపారు. ఇదివరకటికన్నా ఇండియాతో ఇప్పుడు అమెరికా బాగస్వామ్యం మరింత బలోపేతం కావాలన్నారు.
భారత 75 వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ భారతీయులకు శుభాకాంక్షలు తెలిపారు. ఇదివరకటికన్నా ఇండియాతో ఇప్పుడు అమెరికా బాగస్వామ్యం మరింత బలోపేతం కావాలన్నారు. అనేక దశాబ్దాలుగా భారత-అమెరికా దేశాల మధ్య సంబంధాలు చెక్కు చెదరలేదని, నలభై లక్షల మందికి పైగా ఇండియన్ అమెరికన్లు వీటిని ఇంకా పరిపుష్టం చేశారని ఆయన తన సందేశంలో పేర్కొన్నారు. 1947 ఆగస్టు 15 న ఇండియా తన సుదీర్ఘ జర్నీని ఆరంభించింది.. అహింస, శాంతియుత మార్గాలను ప్రబోధించిన మహాత్మా గాంధీ అడుగుజాడల్లో నడిచింది.. ప్రాజాస్వామ్యం ద్వారా ప్రజల అభిమతాన్ని గౌరవించాలన్న ఉదాత్త నిబద్ధత ప్రపంచానికే స్ఫూర్తిమంతంగా నిలిచింది అని బైడెన్ అన్నారు. ఇది భారత-అమెరికా ప్రజల మధ్య ప్రత్యేక బాండ్ గా,అనుబంధానికి ప్రతీకగా ఉంటూ వచ్చిందన్నారు.ఏడాది కాలంగా కోవిడ్ అదుపునకు ఉభయ దేశాలు.. జపాన్, ఆస్ట్రేలియా వంటి దేశాలతో కలిసి కృషి చేశాయని ఆయన అన్నారు.
సురక్షితమైన టీకామందులను మనం ఉత్పత్తి చేయగలుగుతున్నామని.. లక్షలాది ప్రజలను కోవిడ్ బారిన పడకుండా రక్షించగలుగుతున్నామని బైడెన్ పేర్కొన్నారు. ఈ సవాళ్ల సమయంలో మునుపటికన్నా మన ఉభయ దేశాల మధ్య సంబంధాలు మరింత బలపడగలవన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు.
మరిన్ని ఇక్కడ చూడండి: Anantapur District: అనంతలో కీచకుడు.. ఏఎన్‌ఎమ్‌లను వేధిస్తున్న ఫార్మా అసిస్టెంట్.. తట్టుకోలేక తాటతీశారు
Keerthy Suresh: స్టార్ హీరో బ్యానర్‌లో నటిస్తున్న కీర్తి సురేష్.. హీరో మాత్రం అతడుకాదంట..