AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Russia: అమెరికా, ఈయూ దేశాలకంటే భారత్, చైనాలు మేటి.. రష్యా ప్రశంసల వర్షం

NATO , EUలను కలిగి ఉన్న సామూహిక పశ్చిమ దేశాలు  పూర్తిగా అమెరికా నియంత్రణలో ఉన్నాయని.. ఈ అభివృద్ధి ప్రక్రియను రివర్స్ చేయడానికి అగ్రరాజ్యం ప్రయత్నిస్తోందంటూ సంచలన ఆరోపణలు చేశారు లావ్‌రోవ్.

Russia: అమెరికా, ఈయూ దేశాలకంటే భారత్, చైనాలు మేటి.. రష్యా ప్రశంసల వర్షం
Russia President Putin
Surya Kala
|

Updated on: Jan 28, 2023 | 12:38 PM

Share

రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్‌రోవ్  మరోసారి భారత్ పై ప్రశంసల వర్షం కురిపించారు. ఎరిట్రియాలో సంయుక్త వార్తా సమావేశంలో మంత్రి సెర్గీ లావ్‌రోవ్ ఆర్థిక శక్తి, అభివృద్ధి, రాజకీయ ప్రభావంపై సుదీర్ఘంగా ప్రసంగించారు. ఈ సందర్భంగా పశ్చిమ దేశాలైన యునైటెడ్ స్టేట్స్ , యూఈల కంటే భారత్, చైనా దేశాలు అభివృద్ధి పథంలో ముందు వరసలో ఉన్నాయని పేర్కొన్నారు. బహుళ-ధృవ ప్రపంచం స్థాపన అనేది ఒక లక్ష్యమని ఇది నిరంతరం సాగే ప్రక్రియని .. అయితే ఇప్పుడు NATO , EUలను కలిగి ఉన్న సామూహిక పశ్చిమ దేశాలు  పూర్తిగా అమెరికా నియంత్రణలో ఉన్నాయని.. ఈ అభివృద్ధి ప్రక్రియను రివర్స్ చేయడానికి అగ్రరాజ్యం ప్రయత్నిస్తోందంటూ సంచలన ఆరోపణలు చేశారు లావ్‌రోవ్. అయితే ఈ ప్రక్రియను తిప్పికొట్టడానికి కొన్ని దేశాలు ప్రయత్నిస్తున్నాయి. కానీ ఈ ప్రయత్నాలు వ్యర్ధంగా మిగిలిపోతుందన్నారు.

పశ్చిమ దేశాల హైబ్రిడ్ యుద్ధాలు (ఉక్రెయిన్‌తో సహా) కొత్త ఆర్థిక శక్తి, ఆర్థిక, రాజకీయ ప్రభావాలు కొత్త దేశాల అభివృద్ధిని ఆపలేవన్నారు. ఇందుకు ఉదాహరణలు చైనా, భారత్ వంటి దేశాలని .. ఇప్పటికే ఈ దేశాలు అనేక అంశాల్లో అభివృద్ధిలో యునైటెడ్ స్టేట్స్ , EU దేశాల కంటే ముందున్నాయన్నారు.

టర్కీయే, ఈజిప్ట్, పెర్షియన్ గల్ఫ్ దేశాలు, బ్రెజిల్ సహా ఇతర లాటిన్ అమెరికా దేశాలను బహుళ-ధృవ భవిష్యత్తు కేంద్రాలుగా అభివర్ణించిన లావ్‌రోవ్.. ప్రస్తుత కాలంలో ఇవి ప్రభావవంతమైన..  స్వయం సమృద్ధిగల కేంద్రాలుగా అభివృద్ధి చెందుతున్నాయని అన్నారు.

ఇవి కూడా చదవండి

15వ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం ఈ ఏడాది ఆగస్టు చివరిలో దక్షిణాఫ్రికా ఆతిధ్యం ఇవ్వనుందని ప్రకటించారు. డర్బన్‌లో ఈ సమావేశాలను నిర్వహించనున్నామని మంత్రి సెర్జీ లవ్‌రోవ్‌ ప్రకటించారు. 2011, ఏప్రిల్‌లో చైనాలో జరిగిన బ్రిక్స్‌ సమావేశాల్లో దక్షిణాఫ్రికా తొలిసారిగా పాల్గొన్నది. కరోనా నేపథ్యంలో గత సమావేశాలకు చైనా వేదికగా జరిగినా వర్చువల్‌గా నిర్వహించారు.

బ్రిక్స్‌ కూటమి‌ని 2009లో స్థాపించారు.. మొదట బ్రిక్‌‌గా ఏర్పడింది. మొదటి సమావేశం అదే సంవత్సరం జూన్‌‌లో రష్యాలోని యెకటేరిన్ బర్గ్‌‌లో జరిగింది. అనంతరం 2010లో దక్షిణాఫ్రికా చేరడంతో బ్రిక్స్ కూటమిగా మార్చుకుంది. కూటమిలోని దేశాల మధ్య రాజకీయ, సాంస్కృతిక, ఆర్థిక, వైజ్ఞానిక తదితర రంగాల్లో పరస్పర సహాయ సహకారాలను ప్రోత్సహించడం లక్ష్యంగా ఏర్పాటైంది. ఇందులో బ్రెజిల్, రష్యా, భారతదేశం, చైనా, దక్షిణాఫ్రికా దేశాలు సభ్యులుగా ఉన్నాయి. ఈ సంస్థ ఐదు దేశాలను ఏకం చేస్తుంది. మరో 12 మందికి పైగా బ్రిక్స్ కూటమిలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారు

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
పాక్ ఆర్మీకి బిగ్ షాక్.. కుప్పకూలిన ఎంఐ-17 హెలికాప్టర్!
పాక్ ఆర్మీకి బిగ్ షాక్.. కుప్పకూలిన ఎంఐ-17 హెలికాప్టర్!
వాస్తు టిప్స్ : తామర పువ్వు ఉన్న పెయింటింగ్ ఫొటో ఇంట్లో ఉండొచ్చా?
వాస్తు టిప్స్ : తామర పువ్వు ఉన్న పెయింటింగ్ ఫొటో ఇంట్లో ఉండొచ్చా?
'తల్లికి వందనం' డబ్బులు అకౌంట్లోకి అప్పుడే..
'తల్లికి వందనం' డబ్బులు అకౌంట్లోకి అప్పుడే..
సీనియర్లను పట్టించుకోవడం లేదు.. బుడ్డోడి కోసం ఎగబడుతున్నారు
సీనియర్లను పట్టించుకోవడం లేదు.. బుడ్డోడి కోసం ఎగబడుతున్నారు
పురును ఏ రోజు కొనాలి.. ఇంట్లో ఏ దిక్కున ఉంచాలి..?
పురును ఏ రోజు కొనాలి.. ఇంట్లో ఏ దిక్కున ఉంచాలి..?
ప్రతి ఉద్యోగిని ఆలోచింపజేస్తున్న చిన్నారి ప్రశ్న!
ప్రతి ఉద్యోగిని ఆలోచింపజేస్తున్న చిన్నారి ప్రశ్న!
ఏసీ పనిచేట్లేదని టెక్నీషియన్‌ను పిలించిన ఓనర్.. ఓపెన్ చేసి చూడగా
ఏసీ పనిచేట్లేదని టెక్నీషియన్‌ను పిలించిన ఓనర్.. ఓపెన్ చేసి చూడగా
విద్యార్థులకు గుడ్‌న్యూస్.. ఒక్క అప్లికేషన్‌తో రూ.50 పొందే ఛాన్స్
విద్యార్థులకు గుడ్‌న్యూస్.. ఒక్క అప్లికేషన్‌తో రూ.50 పొందే ఛాన్స్
ఇంట్లో పరుగెడుతున్న గుర్రం విగ్రహం ఉందా? సరైన దిశలో పెడితే కెరీర్
ఇంట్లో పరుగెడుతున్న గుర్రం విగ్రహం ఉందా? సరైన దిశలో పెడితే కెరీర్
ఇల్లు కట్టేందుకు పునాది తవ్వుతుండగా.. కనిపించిన అద్భుత దృశ్యం
ఇల్లు కట్టేందుకు పునాది తవ్వుతుండగా.. కనిపించిన అద్భుత దృశ్యం