యూరప్‌లో కుప్పకూలిన విద్యుత్ వ్యవస్థ.. అంధకారంలో స్పెయిన్, పోర్చుగల్ సహా అనేక దేశాలు!
యూరప్‌లోని అనేక దేశాలలో అకస్మాత్తుగా తీవ్రమైన విద్యుత్ సంక్షోభం తలెత్తింది. స్పెయిన్, పోర్చుగల్‌తో సహా అనేక ప్రాంతాలలో భారీగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది, ఇది విమాన సేవల నుండి మెట్రోల వరకు కార్యకలాపాలను ప్రభావితం చేసింది. సోమవారం(ఏప్రిల్ 28) మధ్యాహ్నం సమయంలో మాడ్రిడ్ నుండి లిస్బన్ వరకు ఉన్న ప్రధాన ప్రాంతాలు చీకటిలో మునిగిపోయాయి.

యూరప్‌లోని అనేక దేశాలలో అకస్మాత్తుగా తీవ్రమైన విద్యుత్ సంక్షోభం తలెత్తింది. స్పెయిన్, పోర్చుగల్‌తో సహా అనేక ప్రాంతాలలో భారీగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది, ఇది విమాన సేవల నుండి మెట్రోల వరకు కార్యకలాపాలను ప్రభావితం చేసింది. సోమవారం(ఏప్రిల్ 28) మధ్యాహ్నం సమయంలో మాడ్రిడ్ నుండి లిస్బన్ వరకు ఉన్న ప్రధాన ప్రాంతాలు చీకటిలో మునిగిపోయాయి. ఈ అత్యవసర పరిస్థితిని ఎదుర్కోవడానికి రెండు దేశాలు వెంటనే ప్రోటోకాల్‌లను అమలు చేశాయి. ప్రస్తుతం దీని వెనుక గల కారణాన్ని పరిశీలిస్తున్నారు. ఇది కూడా సైబర్ దాడి కావచ్చునని భావిస్తున్నారు.
స్పెయిన్, పోర్చుగల్‌లలో సోమవారం భారీ విద్యుత్ అంతరాయం ఏర్పడింది. ఇది ప్రజా రవాణా వ్యవస్థలు, ట్రాఫిక్ లైట్లు, ఆసుపత్రులపై తీవ్ర ప్రభావం పడింది. మాడ్రిడ్ నుండి లిస్బన్ వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడిందని, సోమవారం మధ్యాహ్నం ఐబీరియన్ ద్వీపకల్పంలోని చాలా ప్రాంతాలలో విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని మీడియా కథనాలు వెలువడ్డాయి. జాతీయ స్థాయిలో విద్యుత్ ప్రవాహాన్ని నిర్వహించే స్పానిష్ ట్రాన్స్మిషన్ సిస్టమ్ ఆపరేటర్ రెడ్ ఎలక్ట్రికా ఈ మేరకు సోషల్ మీడియి X పై ఒక ప్రకటనలో పేర్కొంది. “ద్వీపకల్ప వ్యవస్థలో సంభవించిన బ్లాక్అవుట్ తర్వాత అన్ని రంగాల సంస్థలతో కలిసి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించడానికి చర్యలు చేపట్టినట్లు పేర్కొంది. “కారణాలను విశ్లేషిస్తున్నామని, అన్ని విభాగాల నిపుణులు దీనిని పరిష్కరించడానికి పని చేస్తున్నారు” అని ఆపరేటర్ ఒకరు చెప్పారు.
స్పెయిన్, పోర్చుగల్‌లు అత్యంత సమగ్రమైన ఎనర్జీ గ్రిడ్‌ను కలిగి ఉన్నాయి. ఇది ఒక ఎనర్జీ ద్వీపంగా పనిచేస్తుంది. ఫ్రాన్స్‌తో తక్కువ సంఖ్యలో క్రాస్-బోర్డర్ ఇంటర్‌కనెక్షన్‌ల ద్వారా మిగిలిన యూరప్‌తో అనుసంధానించబడి ఉంది. స్పెయిన్, పోర్చుగల్ అంతటా ట్రాఫిక్ లైట్లు నిలిచిపోయాయి. మెట్రో వ్యవస్థలు నిలిచిపోయాయి. రెండు దేశాల ఆసుపత్రులలో జనరేటర్లుతో పని చేస్తున్నప్పటికీ, బ్లాక్అవుట్ ఎంతకాలం ఉంటుందో తెలియని కారణంగా కంప్యూటర్లను ఆపివేయాలని, విద్యుత్తును ఆదా చేయడానికి ఇతర చర్యలు తీసుకోవాలని సిబ్బందిని కోరినట్లు అధికారులు సూచించారు.
అయితే, సైబర్ దాడి జరిగే అవకాశం ఉందని అధికారులు దర్యాప్తు చేస్తుండగా, యూరోపియన్ గ్రిడ్‌లోని అంశాలకు స్వల్ప అంతరాయాలు ఏర్పడటం వల్ల గతంలోనూ విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. 2003లో స్విట్జర్లాండ్‌లోని విద్యుత్ లైన్ ఒక చెట్టు కారణంగా నిలిపివేయడం జరిగింది. ఆ తర్వాత ఇటలీ మొత్తం విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
