Telangana: తెలంగాణ బాలిక అరుదైన ఘనత.. కిలిమంజారో అధిరోహించిన బానోతు వెన్నెల
బానోత్ వెన్నెల 2023 జనవరి 26న కిలిమంజారో పర్వత శిఖరానికి చేరుకుంది. 5895 మీటర్ల పర్వతాన్ని అధిరోహించింది. తన కలను సాకారం చేసుకునేందుకు రూ.3 లక్షల ఆర్థిక సహాయం చేసి సహకరించిన ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్‌కు వెన్నెల కృతజ్ఞతలు తెలిపింది.
దక్షిణాఫ్రికాలో తెలంగాణ గిరిజన బాలిక.. రాష్ట్ర కీర్తి పతాకను ఎగురవేసింది. టాంజానియాలోని కిలిమంజారో పర్వతాన్ని గిరిజన విద్యార్థి బానోతు వెన్నెల అధిరోహించింది. కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం సోమవరం పేట గ్రామానికి చెందిన బానోత్ వెన్నెల 2023 జనవరి 26న కిలిమంజారో పర్వత శిఖరానికి చేరుకుంది. 5895 మీటర్ల పర్వతాన్ని అధిరోహించింది. తన కలను సాకారం చేసుకునేందుకు రూ.3 లక్షల ఆర్థిక సహాయం చేసి సహకరించిన ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్‌కు వెన్నెల కృతజ్ఞతలు తెలిపింది.
కిలిమంజారో పర్వత శిఖరాన్నీ అధిరోహించిన అనంతరం వెన్నెల సీఎం కేసీఆర్ , గ్రీన్ ఇండియా ఛాలెంజ్ నిర్వాహకులకు కృతజ్ఞతలు చెప్పింది. గిరిజన కుటుంబం నుంచి వెన్నెలకు చిన్నతనం నుండి పర్వత అధిరోహణ చేయడం ఇష్టం. ప్రపంచంలోనే అతి పెద్దదైన మౌంట్ ఎవరెస్ట్ (8840) మీటర్ల పర్వతాన్ని కూడా అధిరోహిస్తానని బానోతు వెన్నెల చెబుతోంది.
వెన్నెల పర్వతాన్ని అధిరోహించిన సందర్భంగా ఎంపీ సంతోష్ కుమార్.. పర్వతారోహకురాలైన వెన్నెలను అభినందించారు. అంతేకాదు వెన్నెల తనకు.. తన కుటుంబానికి మాత్రమే కాదని.. మొత్తం తెలంగాణ రాష్ట్రానికి కూడా కీర్తిని తెచ్చిపెట్టిందని పేర్కొన్నారు. భవిష్యత్ చేయనున్న ప్రయత్నాలు సక్సెస్ అవ్వాలని ఎంపీ సంతోష్ కోరుకున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..