Pop Star Aryana Sayeed: అవును ! వచ్చేశా ! అఫ్గానిస్తాన్ నుంచి పారిపోయిన పాప్ స్టార్ ఆర్యానా సయీద్
ఆఫ్ఘనిస్తాన్ నుంచి తాను పారిపోయిన విషయం నిజమేనని పాప్ స్టార్ ఆర్యానా సయీద్ ధృవీకరించింది. కాబూల్ నగరాన్ని తాలిబన్లు ఆక్రమించుకున్న అనంతరం రెండు మూడు రోజులకే ఈమె అమెరికా వెళ్లే విమానం ఎక్కేసింది. తాను బాగానే...

ఆఫ్ఘనిస్తాన్ నుంచి తాను పారిపోయిన విషయం నిజమేనని పాప్ స్టార్ ఆర్యానా సయీద్ ధృవీకరించింది. కాబూల్ నగరాన్ని తాలిబన్లు ఆక్రమించుకున్న అనంతరం రెండు మూడు రోజులకే ఈమె అమెరికా వెళ్లే విమానం ఎక్కేసింది. తాను బాగానే..సజీవంగా ఉన్నానని..మరచిపోలేని రెండు (దారుణ) రాత్రులు గడచిన అనంతరం దోహా, ఖతార్ చేరుకున్నానని ఆమె తెలిపింది. ఇక తన సొంత నగరమైన ఇస్తాంబుల్ (టర్కీ రాజధాని) వెళ్లే విమానం ఎక్కబోతున్నట్టు పేర్కొంది. సింగర్, సాంగ్ రైటర్ కూడా అయిన ఆర్యానా సయీద్.. ఇటీవలివరకు ఆఫ్ఘానిస్తాన్ టీవీలో నిర్వహించే పాటల పోటీలకు న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తూ వచ్చింది. అయితే ముఖ్యంగా కాబూల్ నగరం తాలిబన్ల వశమయ్యాక ఇక అలాంటి కార్యక్రమాలకు కాలం చెల్లిపోయింది. టర్కీలో సయీద్ తన భర్త..మ్యూజిక్ ప్రొడ్యూసర్ అయిన హసీబ్ సయీద్ తో కలిసి పాప్ షోలను నిర్వహించవచ్చు. షాకింగ్ ప్రపంచం (ఆఫ్ఘనిస్థాన్) నుంచి మళ్ళీ సాధారణ ప్రపంచంలోకి అడుగు పెడుగుతున్నానని,, కాస్త కోలుకున్నాక అక్కడి దారుణ ఘటనలను మీతో షేర్ చేసుకుంటానని ఆమె ట్వీట్ చేసినట్టు న్యూయార్క్ పోస్ట్ పత్రిక తెలిపింది. 2015 లో ఓ స్టేడియంలో పర్ఫామెన్స్ ఇచ్చినప్పుడు ఈమె మూడు ఆంక్షలను ఉల్లంఘించిందట. మహిళగా పాడడం, హిజాబ్ ధరించకపోవడం, మహిళగా స్టేడియంలో అడుగు పెట్టడం.. ఈ మూడూ తాలిబన్ల చట్టాల ప్రకారం నిషిద్ధం.
కాగా దేశంలో మహిళల హక్కులను గౌరవిస్తామని, పని ప్రదేశాలకు వెళ్ళనిచ్చేందుకు వారిని అనుమతిస్తామని తాలిబన్ నేతలు ప్రకటిస్తున్నప్పటికీ.. వీటిని అమలు పరచాలని ఆఫ్ఘన్ మహిళలు కోరుతున్నారు. షరియా చట్ట నిబంధనలను కొంతలో కొంతయినా సడలించాలని అభ్యర్థిస్తున్నారు. కానీ చాలా చోట్ల మహిళా జర్నలిస్టులను తాలిబన్లు అడ్డుకుంటున్నారు. వారి విధి నిర్వహణకు అడ్డంకులు సృష్టిస్తున్నారు. ఇటీవల ఓఅమెరికాకు చెందిన ఓ మహిళా జర్నలిస్టుపై దాడి చేయబోయారు.
మరిన్ని ఇక్కడ చూడండి: 300 మంది తాలిబన్ల హతం..! పంజ్‌షీర్ లోయపై తాలిబన్లు కన్ను..:Afghanistan Crisis Live Video.