చారిత్రక నగరాలు నేలమట్టం.. ఎటుచూసినా కాంక్రీట్ దిబ్బలు.. ఇంకెన్నాళ్లీ విధ్వంసం!
తాగడానికి నీళ్లు లేక మంచును కరిగించుకుని తాగడం, వంట చేసుకునేందుకు కట్టెలు పోగుచేసుకోవడం, కరెంట్ లేని ఇంట్లో నెలల తరబడి ఉండడం.. ఇవన్నీ విన్నాక ఇవి కూడా పెద్ద సమస్యలేనా అనిపిస్తుంది. కాని, పెద్దపెద్ద నగరాల్లో, దేశ ఆర్థికవ్యవస్థకే ఆయువులాంటి సిటీల్లో ఇలాంటి పరిస్థితి రావడం అంటే ఆ దేశ ఎకానమీ కుప్పకూలినట్టే లెక్క. ఎగ్జాక్ట్‌గా అదే జరిగింది కూడా. ఈమధ్య జరిగిన యుద్ధాల్లో కొన్ని నగరాలను నేలమట్టం చేశాక ఆ దేశాల ఆర్థికవ్యవస్థలే కుప్పకూలిపోయాయి.

గాజా ఆల్‌మోస్ట్ నేలమట్టం అయిపోయింది. ఆ ప్రాంతంపై ఇజ్రాయెల్ ఎలా విరుచుకుపడిందంటే.. కాసేపట్లో అక్కడి విజువల్స్ చూద్దురుగానీ.. అక్కడ నేలకూలిన బిల్డింగుల శిథిలాలు తీయడానికే కనీసం 15 ఏళ్లు పడుతుంది. ఐక్యరాజ్య సమితి స్వయంగా పరిశీలించి చెప్పిన విషయం ఇది. ఆ భవనాల శిథిలాల కింద ఇప్పటికీ 10వేల మృతదేహాలు ఉండొచ్చని అంచనా. UNO రిపోర్ట్స్ ప్రకారమే 19 లక్షల మందికి గూడు లేకుండా పోయింది. గాజాను తిరిగి నిర్మించాలంటే దశాబ్దాల సమయం పడుతుంది. ఈమధ్యకాలంలో.. యుద్ధం కారణంగా నష్టపోయింది ఒక్క గాజా మాత్రమే కాదుగా. రష్యా, ఉక్రెయిన్, సిరియా, ఇరాన్, ఇజ్రాయిల్, ఇరాక్… ఈ దేశాల్లోని ప్రధాన నగరాలు ధ్వంసం అయ్యాయి. కొన్ని నామరూపాల్లేకుండా పోయాయి. యుద్ధాల్లో శత్రు దేశాల మెయిన్ టార్గెట్ సిటీలే అవుతున్నాయి. అక్కడ దెబ్బ కొడితే, ఆర్థికంగా కోలుకోనీయకుండా చేస్తే, ఇక ఆ దేశం తమ జోలికి రాదు అని భావిస్తుంటాయి. మరి… ఆ నగరాల్లోని ప్రజల పరిస్థితేంటి? 2005 నాటికే ప్రపంచ జనాభాలో 320 కోట్ల మంది నగరాలకు వచ్చేశారు. మరో ఐదేళ్లలో 500 కోట్ల మంది సిటీల్లోనే జీవిస్తారు. ఓవైపు నగరాలు నిర్మిస్తూ, నగరాలను విస్తరిస్తూ పోతుంటే.. ఒక యుద్ధం వచ్చేసి వాటిని నేటమట్టం చేసేస్తోంది. ఇవాళ్టి బర్నింగ్ టాపిక్ కూడా ఇదే. దశాబ్దాల కఠోర శ్రమతో నగరాలను నిర్మించుకుంటుంటే… వాటిని క్షణాల్లో కూల్చేస్తే ఎలా? అసలు ఏయే నగరాల్లో ఎంత విధ్వంసం జరిగిందో...