Pakistan Floods: పాక్‌లో వర్షాలు, వరదల బీభత్సం.. 30 ఏళ్ల రికార్డ్ బద్దలు.. ఏడుగురు మృతి
పంజాబ్ లో కురుస్తున్న వర్షాల కారణంగా ఏడుగురికి గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రిలో చేర్చినట్లు ప్రావిన్షియల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ డైరెక్టర్ జనరల్ ఇమ్రాన్ ఖురేషీ తెలిపారు. పాకిస్తాన్‌లోని వాతావరణ శాఖ మరికొన్ని రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది.

పాకిస్థాన్‌లోని లాహోర్‌లో భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. అనేక ప్రాంతాల్లో ఇళ్లు దెబ్బతినగా రహదారులు చెరువులుగా మారాయి. బుధవారం కురిసిన భారీ వర్షం గత 30 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టింది. కేవలం 10 గంటల్లోనే 290 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. 7 మంది చనిపోయారు. మృతుల్లో చిన్నారి కూడా ఉండడం విషాదం. విద్యుత్ షాక్‌తో ముగ్గురు, ఇంటి పైకప్పు పడిపోవడంతో ఇద్దరు మృతి చెందారు.
పంజాబ్ లో కురుస్తున్న వర్షాల కారణంగా ఏడుగురికి గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రిలో చేర్చినట్లు ప్రావిన్షియల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ డైరెక్టర్ జనరల్ ఇమ్రాన్ ఖురేషీ తెలిపారు. పాకిస్తాన్‌లోని వాతావరణ శాఖ మరికొన్ని రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. దీంతో ఇప్పటికే దేశం ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న నేపథ్యంలో పాకిస్తాన్‌లో గత సంవత్సరం మాదిరిగానే ఈసారి కూడా పరిస్థితి ఉంటుందా అనే ప్రశ్న తలెత్తింది.
గతేడాది 1700 మంది చనిపోయారు పాకిస్థాన్ లో లాస్ట్ ఇయర్ కూడా భారీ వర్షాలు, వరదలు విధ్వంసాన్ని సృష్టించాయి. అప్పుడు పాకిస్తాన్‌లో మూడింట ఒక వంతు నీటిలో మునిగిపోయింది. ఈ సమయంలో, 1700 మంది మరణించారు, చాలా మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. అంతే కాదు, 10 లక్షలకు పైగా ఇళ్లు కొట్టుకుపోగా, దాదాపు 90 లక్షల పశువులు కూడా ప్రాణాలు కోల్పోయాయి.




గత ఏడాది అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని ఇప్పటికే ముందస్తు చర్యలు చేపట్టారు. భారీ వర్షాలు, వరదల వలన ఎటువంటి దారుణమైన పరిస్థితులు ఏర్పడకుండా అధికారులు అప్రమత్తం అయ్యారు. ఇప్పటికే పరిస్థితిని పర్యవేక్షించడానికి కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేశామని, ప్రజలకు సహాయం చేయడానికి ఎమర్జెన్సీ నంబర్లు జారీ చేశామని ఇమ్రాన్ ఖురేషీ చెప్పారు. అత్యవసర పరిస్థితుల్లో యంత్రాలు, భద్రతా సిబ్బందిని అప్రమత్తంగా ఉంచారు. ప్రధాని షాబాజ్ షరీఫ్ కూడా పరిస్థితిని గమనిస్తున్నారు. సహాయక బృందాలను వెంటనే సమీకరించాలని పంజాబ్ తాత్కాలిక ముఖ్యమంత్రిని ఆయన ఆదేశించారు. ప్రజల ప్రాణ, ఆస్తుల భద్రతకు అన్ని రకాల చర్యలు తీసుకోవాలని కోరారు.
ఈ ప్రాంతాల్లో ప్రమాదకర పరిస్థితులు భారీ వర్షాల కారణంగా లాహోర్, రావల్పిండి, ఇస్లామాబాద్, పెషావర్‌లకు భారీ ముప్పు పొంచి ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. ప్రపంచంలో అత్యధిక ప్రకృతి వైపరీత్యాలు సంభవించే దేశాల్లో పాకిస్థాన్ 8వ స్థానంలో ఉంది.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
