పాకిస్తాన్ లో పేలుడు ఘటన..ఉగ్రవాది హఫీజ్ సయీద్ టార్గెట్.. జర్నలిస్ట్ వెల్లడి…

పాకిస్తాన్ లోని లాహోర్ లో ఇటీవల జరిగిన పవర్ ఫుల్ బ్లాస్ట్ లో ముగ్గురు మరణించగా..ఓ పోలీసు కానిస్టేబుల్ సహా 24 మంది గాయపడ్డారు. అయితే ఈ పేలుడు కరడు గట్టిన ఉగ్రవాది జమాత్-ఉద్ దవా చీఫ్ హఫీజ్ సయీద్ ఇంటి సమీపంలోనే జరిగింది.

పాకిస్తాన్ లో పేలుడు ఘటన..ఉగ్రవాది హఫీజ్ సయీద్ టార్గెట్.. జర్నలిస్ట్ వెల్లడి...
Terrorist Hafiz Saeed
Follow us
Umakanth Rao

| Edited By: Phani CH

Updated on: Jun 29, 2021 | 4:21 PM

పాకిస్తాన్ లోని లాహోర్ లో ఇటీవల జరిగిన పవర్ ఫుల్ బ్లాస్ట్ లో ముగ్గురు మరణించగా..ఓ పోలీసు కానిస్టేబుల్ సహా 24 మంది గాయపడ్డారు. అయితే ఈ పేలుడు కరడు గట్టిన ఉగ్రవాది జమాత్-ఉద్ దవా చీఫ్ హఫీజ్ సయీద్ ఇంటి సమీపంలోనే జరిగింది. 15 కేజీల పేలుడు వస్తువులతో కూడిన కారును ఈ ఇంటి సమీపంలో ఉంచి పేల్చివేశారు. నిజానికి హఫీజ్ సయీద్ ని టార్గెట్ చేసుకునే ఈ దాడి జరిపారని, ఆ సమయంలో హఫీజ్ తన ఇంటిలోనే ఉన్నాడని అంజాద్ సయీద్ సహానీ అనే జర్నలిస్టు తెలిపాడు. అతనిపైనే ప్రధానంగా గురి పెట్టారని, జైలు అధికారులు ఇతని లొకేషన్ ని ఎప్పుడూ మానిటర్ చేస్తుంటారని ఆయన చెప్పాడు. ఈఘటన జరిగినప్పుడు సయీద్ తమ ఇంట్లో లేడని అతని కుటుంబం చెపుతున్నా అది అబద్దమని ఆయన పేర్కొన్నాడు. లష్కరే తోయిబా చీఫ్ గా కూడా చెప్పుకుంటున్న హఫీజ్..ని గ్లోబల్ టెర్రరిస్టుగా ఐక్యరాజ్యసమితి, అమెరికా ఇదివరకే పేర్కొన్నాయి. ఇతని తలపై అమెరికా 10 మిలియన్ డాలర్ల రివార్డును ప్రకటించింది.

2008 లో ముంబైలో జరిగిన ఉగ్రదాడులకు ఇతడే సూత్రధారి అని ఇండియా పలుమార్లు ఆరోపించింది. ఆ దాడుల్లో 161 మంది మరణించగా వేలమంది గాయపడ్డారు. హఫీజ్ సయీద్ కి పాకిస్తాన్ లో రెండుసార్లు జైలు శిక్ష విధించారు. అయితే ఇతడిని జైల్లో పెట్టకపోవడంతో లాహోర్ లోని తన ఇంటి నుంచే ఉగ్రవాద కార్యకలాపాలను నిర్వహిస్తున్నాడు. కాగా ఇతడిని ఎవరు టార్గెట్ చేశారన్నది ఇంకా ఇదమిథంగా తెలియలేదు.

మరిన్ని ఇక్కడ చూడండి: IPL 2022: కొత్త ఫ్రాంచైజీల కనీస విలువ రూ.2000 కోట్లు..! జులైలో విక్రయానికి రెడీ?

Moderna vaccine: ఇక త్వరలో దేశంలోకి మోడెర్నా వ్యాక్సిన్.. డీజీసీఐ అనుమతే తరువాయి… అమెరికా ఓకె…

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే