AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nijjar Murder Case: ఖలిస్థాన్ వేర్పాటువాది నిజ్జర్‌ హత్య కేసులో ముగ్గరు భారత పౌరుల అరెస్ట్..!

ఖలిస్థాన్‌ వేర్పాటువాది హర్దీప్‌ సింగ్‌ నిజ్జర్‌ హత్య కేసులో ముగ్గురు భారత పౌరులను కెనడా పోలీసులు అరెస్ట్‌ చేశారు. కరణ్‌ప్రీత్‌ సింగ్‌, కమల్‌ప్రీత్‌ సింగ్‌, కరణ్‌ బ్రార్‌గా గుర్తించారు. గత ఏడాది జూన్‌ 18న సర్రేలోని సిక్కు గురుద్వార్‌లో ప్రార్థనలు చేసి వస్తున్న నిజ్జర్‌ను కొందరు గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు. దీంతో దర్యాప్తు చేపట్టిన కెనడా పోలీసులు ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు.

Nijjar Murder Case: ఖలిస్థాన్ వేర్పాటువాది నిజ్జర్‌ హత్య కేసులో ముగ్గరు భారత పౌరుల అరెస్ట్..!
Nijjar Murder Case Arrest
Balaraju Goud
|

Updated on: May 04, 2024 | 11:19 AM

Share

ఖలిస్థాన్‌ వేర్పాటువాది హర్దీప్‌ సింగ్‌ నిజ్జర్‌ హత్య కేసులో ముగ్గురు భారత పౌరులను కెనడా పోలీసులు అరెస్ట్‌ చేశారు. కరణ్‌ప్రీత్‌ సింగ్‌, కమల్‌ప్రీత్‌ సింగ్‌, కరణ్‌ బ్రార్‌గా గుర్తించారు. గత ఏడాది జూన్‌ 18న సర్రేలోని సిక్కు గురుద్వార్‌లో ప్రార్థనలు చేసి వస్తున్న నిజ్జర్‌ను కొందరు గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు. దీంతో దర్యాప్తు చేపట్టిన కెనడా పోలీసులు ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు.

గత ఏడాది ఖలిస్తాన్ వేర్పాటువాది హర్దీప్ సింగ్ నిజ్జార్‌ను హత్య చేసేందుకు భారత ప్రభుత్వం నియమించిన ‘హిట్ స్క్వాడ్’లో సభ్యులుగా పరిశోధకులు భావిస్తున్న ముగ్గురు భారతీయులను కెనడా పోలీసులు అరెస్టు చేశారు. గత ఏడాది సెప్టెంబరులో జరిగిన నిజ్జర్ హత్యలో భారతీయ ఏజెంట్ల ప్రమేయం ఉన్నట్లు కెనడా ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడో చేసిన ఆరోపణల నేపథ్యంలో భారతదేశం – కెనడా మధ్య దౌత్య సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. అయితే కెనడా ఆరోపణలు అర్థం లేనివని భారత్‌ ఖండించింది.

నిజ్జర్‌ హత్య కేసు దర్యాప్తు చేస్తున్న రాయల్‌ కెనడియన్‌ మౌంటెడ్‌ పోలీసులు, నిజ్జర్‌ హత్యకు కుట్ర పన్నిన హిట్‌ స్కాడ్‌ సభ్యులను గుర్తించి అరెస్ట్‌ చేసినట్టు ప్రకటించారు. నిందితులను కొన్ని నెలల క్రితమే గుర్తించినా వారి కదలికలపై నిఘా ఉంచి పూర్తి ఆధారాలు సేకరించామన్నారు. హత్య కేసుతో పాటు, భారత ప్రభుత్వానికి గల సంబంధాలపై కూడా ప్రత్యేక దర్యాప్తులు జరుగుతున్నాయని టొరంటో స్టార్ వార్తాపత్రిక పేర్కొంది. నిజ్జర్ హత్య కేసులో అరెస్టయిన ముగ్గురు నిందితుల ఛాయాచిత్రాలను కెనడా పోలీసులు విడుదల చేశారు.

రాయల్ కెనడియన్ మౌంటెడ్ పోలీసులు ఈ ముగ్గురు నిందితులను కమల్‌ప్రీత్ సింగ్, కరణ్‌ప్రీత్ సింగ్ మరియు కరణ్ బ్రార్‌గా గుర్తించారు. నిజ్జార్‌ను హత్య జరిగి దాదాపు ఏడాది తర్వాత శుక్రవారం ఉదయం కెనడియన్ పోలీసులు భారతీయ పౌరులను అదుపులోకి తీసుకున్నారు. నిందితులు స్టూడెంట్ వీసాలపై కెనడాలోకి ప్రవేశించారని, గత మూడు నుంచి ఐదు సంవత్సరాలుగా కెనడాలో నివాసం ఉంటున్నట్లు పోలీసులు తెలిపారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…