Holi in US: అమెరికాలో ఘనంగా హొలీ సంబరాలు.. రంగుల్లో మునిగితేలిన జనం
Holi in US: రంగుల కేళి హొలీ సంబరాల(Holi Festival) ను భారతదేశంలోని ప్రజలే కాదు.. విదేశాల్లో ఉన్న భారతీయులు అక్కడ స్నేహితులు, స్థానికులతో కలిసి ఘనంగా జరుపుకున్నారు. జనం రంగుల్లో మునిగితేలారు..
Holi in US: రంగుల కేళి హొలీ సంబరాల(Holi Festival) ను భారతదేశంలోని ప్రజలే కాదు.. విదేశాల్లో ఉన్న భారతీయులు అక్కడ స్నేహితులు, స్థానికులతో కలిసి ఘనంగా జరుపుకున్నారు. జనం రంగుల్లో మునిగితేలారు. అమెరికా(America) లో హొలీ పండగ అంటే మొదటి స్థానంలో ఉండేది అట్లాంటా. స్థానిక కమ్మింగ్ ఫేర్ గ్రౌండ్లో Sewa International స్వచ్చంద సంస్థ ఆధ్వర్యంలో జరుపుకునే వేడుకల్లో ప్రతిసంవత్సరం వేలాది మంది పాల్గొనటం విశేషం. కోవిడ్ తదనంతరం జరుపుకున్న ఈ వేడుకల్లో 5 వేలకు పైగా పాల్గొని ఉత్సాహంగా, ఉల్లాసంగా డాన్స్ లు, పాటలు, కేరింతలతో గడిపి ఆనందంగా తిరిగి వెళ్లారు.
ఈ హొలీ వేడుకలను నిర్వాహకులు సమకూర్చిన వివిధ ఆర్గానిక్ రంగులు మాత్రమే ఉపయోగించారు. వేడుకలలో బయటినుండి, తెచ్చే ఏ వస్తువుని అనుమతించలేదు. సంస్థ కు చెందిన వాలంటీర్లు పెద్ద ఎత్తున మంచినీళ్ళు, భోజన సౌకర్యం కలిపించారు. ఫోర్సైత్ కౌంటీ పోలీసులు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. స్థానిక అగ్నిమాపక సిబ్బంది కూడా ఎటువంటి ఇబ్బంది కలిగినా సహాయపడడానికి సిద్ధంగా ఉన్నారు. హొలీ వేడుకలను సక్సెస్ చేసిన ప్రతి ఒక్కరికీ ఈ సంస్థ ధన్యవాదాలు తెలిపారు.
AP News: పన్ను కట్టలేదని ఇళ్లకు తాళం.. పిఠాపురంలో మున్సిపల్ అధికారుల నిర్వాకం