AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP News: పన్ను కట్టలేదని ఇళ్లకు తాళం.. పిఠాపురంలో మున్సిపల్ అధికారుల నిర్వాకం

తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం (Pithapuram) లో మున్సిపల్ అధికారుల నిర్వాకం బయటపడింది. పన్నులు చెల్లించలేదనే కారణంతో రెండు ఇళ్లకు తాళాలు వేశారు. మోహన్‌నగర్‌లోని సత్తిబాబు, రమణ ఇళ్లకు అధికారులు...

AP News: పన్ను కట్టలేదని ఇళ్లకు తాళం.. పిఠాపురంలో మున్సిపల్ అధికారుల నిర్వాకం
Pithapuram Lock
Ganesh Mudavath
|

Updated on: Mar 20, 2022 | 8:05 PM

Share

తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం (Pithapuram) లో మున్సిపల్ అధికారుల నిర్వాకం బయటపడింది. పన్నులు చెల్లించలేదనే కారణంతో రెండు ఇళ్లకు తాళాలు వేశారు. మోహన్‌నగర్‌లోని సత్తిబాబు, రమణ ఇళ్లకు అధికారులు తాళం (Lock) వేసి సీల్ చేశారు. ఇంట్లో మహిళలు ఉన్నా వారిని అలాగే ఉంచి, బయటి నుంచి తాళం వేశారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మున్సిపల్‌ అధికారుల తీరుపై మండిపడ్డారు. మోహన్‌ నగర్‌లో చాలా మంది వైసీపీ నేతల ఇళ్లకు రూ.లక్షల్లో పన్ను బకాయిలు ఉన్నా.. వారి జోలికి వెళ్లకుండా టీడీపీ (TDP) నేతలపై చర్యలు తీసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం తాగునీరు కూడా అందించలేని అధికారులు.. ప్రజలపై పన్నుల భారం వేయడమేంటని నిలదీశారు. స్థానికులు, టీడీపీ శ్రేణులు ఆందోళనకు దిగడంతో గొర్ల సత్తిబాబు ఇంటికి వేసిన తాళం, సీల్‌ను సిబ్బంది తొలగించారు. రమణ ఇంటికి మాత్రం నిన్న సాయంత్రం నుంచి తాళం, సీల్‌ అలాగే ఉంచారు. ప్రస్తుతం ఈ అంశం పిఠాపురంలో చర్చనీయాంశంగా మారింది.

గతంలో జరిగిన ఘటనలో చెత్త పన్ను చెల్లించలేదని.. కర్నూలు కార్పొరేషన్ అధికారులు షాపుల ముందు చెత్త వేశారు. నగరంలోని కొండారెడ్డి బురుజు (Kondareddy Buruzu) సమీపంలోని శ్రీనివాస క్లాత్ మార్కెట్ నుంచి అనంత కాంప్లెక్స్ వరకు చెత్త పన్ను వసూలు చేసేందుకు వార్డు సచివాలయ పారిశుద్ధ్య సిబ్బంది వెళ్లారు. ఆస్తి, నీటి పన్ను, దుకాణాలకు ట్రేడ్ లైసెన్సుల రుసుము చెల్లిస్తున్నామని దుకాణాదారులు చెప్పారు. మళ్లీ ఈ చెత్త పన్ను ఎందుకు చెల్లించాలని ప్రశ్నించారు. ఈ సమాధానంలో సహనం కోల్పోయిన నగరపాలక సంస్థ సిబ్బంది.. నగర వ్యాప్తంగా సేకరించిన చెత్తను ట్రాక్టర్​లో తీసుకొచ్చి దుకాణాల ముందు పడేసి వెళ్లారు. ఈ ఘటనతో సంబంధిత దుకాణాల యజమానులు అవాక్కయ్యారు. ఏ రాష్ట్రంలోనూ ఇలా చెత్త పన్ను వసూలు చేయడం లేదని, కేవలం ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే ఇలాంటి విచిత్రమైన పన్నులు వసూలు చేస్తున్నారని వాపోయారు.

Also Read

Viral Video: ఈ బుడ్డోడు చేసిన పని తెలిస్తే షాక్ అవుతారు.. క్షణం ఆలస్యం అయ్యిఉంటే ..

Russian Girl: ఆనారోగ్యాన్ని వరంగా మార్చుకున్న చిన్నారి.. ఏడేళ్ళకే ఏడాదికి కోట్లు సంపాదిస్తున్న బాలికగా రికార్డు

Shane Warne Funeral: షేన్ వార్న్‌కు తుది వీడ్కోలు పలికిన ఫ్యామిలీ.. క్లార్క్, సైమండ్స్ సహా 80 మంది హాజరు..

విశాఖలో హ్యాట్రిక్ రికార్డులు బ్రేక్ చేయనున్న కింగ్ కోహ్లీ
విశాఖలో హ్యాట్రిక్ రికార్డులు బ్రేక్ చేయనున్న కింగ్ కోహ్లీ
వెస్ట్రన్ టాయిలెట్ ఇంట్లో ఉందా?.. ఈ పొరపాట్లు చేయకండి..
వెస్ట్రన్ టాయిలెట్ ఇంట్లో ఉందా?.. ఈ పొరపాట్లు చేయకండి..
శుక్ర, బుధుల యుతి..ఆ రాశుల వారికి కష్టనష్టాలు.. జాగ్రత్త..!
శుక్ర, బుధుల యుతి..ఆ రాశుల వారికి కష్టనష్టాలు.. జాగ్రత్త..!
తన ఇంటిని తాకట్టు పెట్టిమరీ.. మేనమామ కష్టం తీర్చాడు.. చివరకు
తన ఇంటిని తాకట్టు పెట్టిమరీ.. మేనమామ కష్టం తీర్చాడు.. చివరకు
ఆ సినిమా కోసం రజనీ తో మోహన్‌లాల్‌ ములాఖత్‌.. అబ్బో ఇక సీన్ సితారే
ఆ సినిమా కోసం రజనీ తో మోహన్‌లాల్‌ ములాఖత్‌.. అబ్బో ఇక సీన్ సితారే
లెక్క తప్పితే డేంజరే.. మీ ఏజ్ ప్రకారం ఎంత సేపు నిద్రపోవాలో..
లెక్క తప్పితే డేంజరే.. మీ ఏజ్ ప్రకారం ఎంత సేపు నిద్రపోవాలో..
ఇక్కడ ఇలా చేయడం వల్ల అక్కడ హీరోలకు అక్కడ మర్యాద తగ్గుతోందా
ఇక్కడ ఇలా చేయడం వల్ల అక్కడ హీరోలకు అక్కడ మర్యాద తగ్గుతోందా
ఇక్కడైతే భారత బౌలర్లను చిత్తు చేయడం చాలా ఈజీ : సౌతాఫ్రికా
ఇక్కడైతే భారత బౌలర్లను చిత్తు చేయడం చాలా ఈజీ : సౌతాఫ్రికా
ప్రపంచంలో ధూమపానాన్ని నిషేధించిన మొట్టమొదటి దేశం ఇదేనట!
ప్రపంచంలో ధూమపానాన్ని నిషేధించిన మొట్టమొదటి దేశం ఇదేనట!
మళ్లీ ట్రెండింగ్ లోకి వచ్చిన దర్శకుల డ్రీమ్ ప్రాజెక్ట్స్..
మళ్లీ ట్రెండింగ్ లోకి వచ్చిన దర్శకుల డ్రీమ్ ప్రాజెక్ట్స్..