AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కరోనాతో అల్లాడుతున్నాం, వ్యాక్సిన్లు ఇస్తే ఆయిల్ ఇస్తాం, వెనెజులా ప్రకటించిన తాయిలం,

కరోనా వైరస్ కేసులతో అల్లాడుతున్న తమ దేశానికి వ్యాక్సిన్లు ఇస్తే ఆయిల్ ఇస్తామని వెనెజులా ప్రకటించింది. ఈ దేశాధ్యక్షుడు నికోలస్ మదురో ఈ మేరకు వెల్లడిస్తూ.. తమ ఈ ప్రతిపాదన ఎంతవరకు వర్కౌట్ అవుతుందో తమకు తెలియదని, కానీ తాజాగా

కరోనాతో అల్లాడుతున్నాం,  వ్యాక్సిన్లు ఇస్తే ఆయిల్ ఇస్తాం, వెనెజులా ప్రకటించిన  తాయిలం,
Venezuela President Nicolas Maduro
Umakanth Rao
| Edited By: Phani CH|

Updated on: Mar 29, 2021 | 2:43 PM

Share

కరోనా వైరస్ కేసులతో అల్లాడుతున్న తమ దేశానికి వ్యాక్సిన్లు ఇస్తే ఆయిల్ ఇస్తామని వెనెజులా ప్రకటించింది. ఈ దేశాధ్యక్షుడు నికోలస్ మదురో ఈ మేరకు వెల్లడిస్తూ.. తమ ఈ ప్రతిపాదన ఎంతవరకు వర్కౌట్ అవుతుందో తమకు తెలియదని, కానీ తాజాగా ఈ ప్రకటన చేస్తున్నామని అన్నారు. కొన్ని దశాబ్దాలుగా ఇతర దేశాలకు  ఈ దేశ  క్రూడాయిల్ ఎగుమతులు చాలావరకు తగ్గిపోయాయి. పైగా 2019 లో వాషింగ్టన్ (అమెరికా) వెనెజులా ఆయిల్ కంపెనీ  నుంచి తమ దేశానికి దిగుమతులపై ఆంక్షలు విధించింది. అలాగే ఈ దేశం నుంచి చమురును ఇతర దేశాలు దిగుమతి చేసుకోకుండా చూసింది.  ప్రపంచ ఆరోగ్య సంస్థ తన కోవాక్స్ మెకానిజం ద్వారా  కరోనా వ్యాక్సిన్లను పేద దేశాలకు అందజేస్తోందని, ఈ నేపథ్యంలోనే తాము ఏ దేశమైనా టీకామందులను ఇవ్వజూపితే ఇందుకు బదులుగా ఆయిల్ ను ఇస్తామంటున్నామని వెనెజులా అధ్యక్షుడు మదురో పేర్కొన్నారు. ఆంక్షల కారణంగా తమ దేశం నిధుల కటకటను ఎదుర్కొంటోందన్నారు. దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగించిన ఆయన..  ‘వీ ఆర్ ప్రిపేర్డ్ ఫర్ ఆయిల్ ఫర్ వ్యాక్సిన్స్” అని ప్రకటించారు. అలా అని తాము ఎవరినీ అడుక్కోబోమన్నారు.

తన మిత్ర దేశాలైన రష్యా,  చైనా నుంచి వెనెజులా వ్యాక్సిన్స్ అందుకుంది. కానీ అవి సరిపోవడంలేదు. 2013 లో మదురో వెనెజులా అధ్యక్షునిగా పదవి చేపట్టినప్పటి నుంచి ఆ దేశ ఆర్ధిక సంక్షోభానికి అతడే కారణమని  అమెరికా ఆరోపిస్తోంది. అలాగే 2018 లోతాను మళ్ళీ అధ్యక్షుడయ్యేందుకు ఎన్నికను రిగ్గింగ్ చేశాడని, అసమ్మతిదారులను అణచివేసేందుకు మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడిన నియంత అని మదురోను అమెరికా దుయ్యబడుతోంది. అయితే తమ దేశ ఆయిల్ రిజర్వ్ లపై పట్టు సాధించి, తనను పదవి నుంచి తొలగించడానికి అమెరికా కుట్ర పన్నుతోందని మదురో ఆరోపిస్తున్నారు. ఏమైనా…. ఈ కరోనా సంక్షోభ సమయంలో మేం ఆయిల్ ఇస్తాం.. మీరు వ్యాక్సిన్లు పంపండి అని వెనెజులా  కోరుతోంది.

మరిన్ని ఇక్కడ చదవండి: Terrorist Attack In Kashmir: ఉగ్రవాదుల ఘాతుకం.. ప్రజా ప్రతినిధుల సమావేశంలో కాల్పులు..

రాత్రి మిగిలిపోయిన అన్నం తింటున్నారా ? ఇది ఆరోగ్యానికి మేలు చేస్తుందా లేదా అనేది తెలుసుకుందామా..