Terrorist Attack In Kashmir: ఉగ్రవాదుల ఘాతుకం.. ప్రజా ప్రతినిధుల సమావేశంలో కాల్పులు..
Terrorist Attack In Kashmir: కశ్మీర్‌లో ఉగ్రవాదులు మరోసారి ఘాతుకానికి దెగబడ్డారు. ఘాతంలో చాలా సార్లు ఇండియన్ ఆర్మీని లక్ష్యంగా చేసుకొని దాడులు జరిపిన ఉగ్రవాదులు ఈసారి...
Terrorist Attack In Kashmir: కశ్మీర్‌లో ఉగ్రవాదులు మరోసారి ఘాతుకానికి తెగబడ్డారు. ఘతంలో చాలా సార్లు ఇండియన్ ఆర్మీని లక్ష్యంగా చేసుకొని దాడులు జరిపిన ఉగ్రవాదులు ఈసారి ఏకంగా ప్రజా ప్రతినిధుల సమావేశంలో కాల్పులు జరిపారు. సోపోర్‌లో నిర్వహిస్తోన్న ప్రజా ప్రతినిధుల సమావేశంలో కాల్పులకు దిగారు.
ఉగ్రవాదులు చేసిన ఈ దాడిలో మున్సిపల్ కౌన్సిలర్ రియాజ్, గన్‌మన్ అహ్మద్ మృతి చెందారు. వీరితో పాటు మరో కౌన్సిలర్ షమ్‌షుద్దీన్ పీర్‌కు గాయాలు, ఆస్పత్రికి తరలించారు. కౌన్సిలర్‌ల సమావేశంలో ఉగ్రవాదులు కాల్పులకు దిగారు. ఈ ఘాతుకానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Also Read: ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం ఇక నామమాత్రం, ఎన్సీటీ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం