AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మయన్మార్ లో రక్తపాతం చాలా దారుణం, టెరిబుల్, అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ ఆగ్రహం

మయన్మార్ లో జరుగుతున్న హింసాకాండపై అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ తీవ్ర ఆగ్రహాన్ని, విచారాన్ని వ్యక్తం చేశారు. ఆ దేశంలో హింస పెరిగిపోయిందని, దారుణమని, అత్యంత తీవ్రమైన పరిస్థితులు ఏర్పడ్డాయని ఆయన అన్నారు.

మయన్మార్ లో రక్తపాతం చాలా దారుణం, టెరిబుల్, అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ ఆగ్రహం
Joe Biden
Umakanth Rao
| Edited By: Phani CH|

Updated on: Mar 29, 2021 | 1:10 PM

Share

మయన్మార్ లో జరుగుతున్న హింసాకాండపై అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ తీవ్ర ఆగ్రహాన్ని, విచారాన్ని వ్యక్తం చేశారు. ఆ దేశంలో హింస పెరిగిపోయిందని, దారుణమని, అత్యంత తీవ్రమైన పరిస్థితులు ఏర్పడ్డాయని ఆయన అన్నారు. తనకు అందుతున్న సమాచారం ప్రకారం..  భద్రతా దళాల చేతిలో అనేకమంది మరణిస్తున్నారని, ఈ నరమేధానికి స్వస్తి చెప్పాల్సిందేనన్నారు.  ఏడుగురు పిల్లలతో  బాటు 100 మందికి పైగా మృతి చెందినట్టు తనకు తెలిసిందన్నారు. డెలావర్ లో మీడియాతో మాట్లాడిన ఆయన.. ఈ వయొలెన్స్ లో అమాయకులెంతోమంది అనవసరంగా ప్రాణాలు కోలోతున్నారని అన్నారు. శనివారం ఆ దేశంలో ఆందోళన చేస్తున్న నిరసనకారులపై సైన్యం, పోలీసులు జరిపిన కాల్పుల్లో కొందరు పిల్లలతో సహా 114 మంది మృహి చెందగా, అనేకమంది గాయపడ్డారు. సాయుధ దళాల దినోత్సవాన్ని పురస్కరించుకుని మయన్మార్ మిలిటరీ పాలకులు తమ సైన్యానికి విశేష అధికారాలు ఇఛ్చారు. దీంతో వారు విచక్షణా రహితంగా మూకుమ్మడిగా కాల్పులకు తెగబడ్డారు. ఇంటి బయట ఆడుకుంటున్న బాలురపై కూడా వారు కాల్పులకు తెగబడ్డారు .  మరణించిన తమవారిని అంత్య క్రియల కోసం తీసుకువెళ్తున్న కుటుంబాలమీద కూడా పోలీసులు తుపాకులు ఎత్తారు.

అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా సహా పలు దేశాలు మయన్మార్ లో హింసాకాండను ఖండించాయి. యూరోపియన్ యూనియన్.. ఆ దేశ సైనిక  పాలకుల తీరు ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదని తన నిరసనను వ్యక్తం చేసింది. ఇది అత్యంత శోచనీయ ఘటన, అమానవీయం అని ఈయూ పేర్కొంది. మయన్మార్ పాలకులు హింసాకాండకు స్వస్తి పలకాలని. ఎన్నికైన ప్రభుత్వానికి అధికారం అప్పగించాలని వివిధ దేశాలు కూడా కోరాయి. మయన్మార్ హింసాకాండలో మృతి చెందినవారి  సంఖ్య 423 కి పెరిగింది. ఇక్కడ సైనిక ప్రభుత్వాన్ని రద్దు చేయాలని, ప్రజానేత ఆంగ్ సాన్ సూకీని వెంటనే  విడుదల చేయాలనీ కోరుతూ ఆందోళనకారులు సుమారు నెల రోజులకు పైగా భారీ ర్యాలీలు నిర్వహిస్తున్నారు. ఫిబ్రవరి 1 న ఈ దేశంలో సైనిక  పాలన ప్రారంభమైంది. ఏడాది పాటు  ఎమర్జెన్సీ విధించారు.

మరిన్ని ఇక్కడ చదవండి:NIOS Admissions 2021: నేషనల్‌ ఇన్సిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఓపెన్‌ స్కూలింగ్‌ (NIOS)లో 10, 12వ తరగతిలో అడ్మిషన్స్‌

Driverless Tractor: అన్నదాత వ్యవసాయానికి సాయం చేసిన ఓ యువరైతు.. డ్రైవర్ లేకుండా నడిచే ట్రాక్టర్ సృష్టి..