Natural Disasters: బంగ్లాదేశ్‌లో వరదాలు, స్పెయిన్‌లో కార్చిచ్చు.. వణికిస్తోన్న ప్రకృతి వైపరీత్యాలు..
Bangladesh: ప్రకృతి వైపరీత్యాలు జన జీవనాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. అటు బంగ్లాదేశ్‌లో వరదలు వణికిస్తుంటే, స్పెయిన్‌లో అడివి మంటలు వణికిస్తున్నాయి. దీంతో రెండు దేశాల్లో భారీగా నష్టం వాటిల్లింది..
Natural Disasters: ప్రకృతి వైపరీత్యాలు జన జీవనాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. అటు బంగ్లాదేశ్‌లో వరదలు వణికిస్తుంటే, స్పెయిన్‌లో అడివి మంటలు వణికిస్తున్నాయి. దీంతో రెండు దేశాల్లో భారీగా నష్టం వాటిల్లింది. బంగ్లాదేశ్‌లో భారీ వరదల కారణంగా నదులు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి. వరదల్లో చిక్కుకొని ఇప్పటి వరకూ 25 మంది వరకూ మరణించి ఉంటారని అంచనా వేస్తున్నాయి. దాదాపు 40 లక్షల మంది జనాభాపై వరదల ప్రభావం పడింది. అధికారులు లక్షన్నర మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. బంగ్లాదేశ్‌లోని లాల్‌మోనిర్‌హట్, కురిగ్రామ్, నిల్ఫమారి, రంగ్‌పూర్, గైబంద, బోగ్రా, జమాల్‌పూర్, సిరాజ్‌గంజ్ జిల్లాలు వరదల ధాటికి దెబ్బతిన్నాయి. చాలా చోట్ల ఇళ్లలోకి వరద నీరు చేయడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.. రోడ్లు దెబ్బతిని నదులను తలపిస్తున్నాయి.. విద్యుత్, కమ్యూనికేషన్ వ్యవస్థలు దెబ్బతినడంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడుతోంది.
స్పెయిన్‌లో అడివి మంటలు..
స్పెయిన్‌లో అడివి మంటలు అతలాకుతలం చేస్తున్నాయి.. కాటలోనియా ప్రాంతంలో మొదలైన కార్చిచ్చు వేగంగా వ్యాప్తి స్తోంది. మంటలను ఆర్పేందుకు ఎమర్జెన్సీ మిలిటరీ యూనిట్‌కు చెందిన సిబ్బంది చేస్తున్న ప్రయత్నాలు ఏమాత్రం ఫలిచడంలేదు. బల్డోమర్ సమీపంలో ఇప్పటికే 500 హెక్టర్ల అడవి పూర్తిగా కాలిపోయింది. నవార్రే రాష్ట్రంలోని అర్తజు పట్టణాన్ని కార్చిచ్చు చుట్టుముట్టింది. దీంతో అధికారులు ఇక్కడి ప్రజలను ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఈ తరహా కార్చిచ్చును గతంలో ఎన్నడూ చూడలేదని అక్కడి ప్రజలు చెబుతున్నారు.. గ్లోబల్ వార్మింగ్ కారణంగా దేశ వ్యాప్తంగా వాతావరణ పరిస్థితుల్లో అనూహ్య మార్చులు వచ్చాయని చెబుతున్నారు అక్కడి అధికారులు.
మరిన్నిఅంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..