Pig Heart Transplant: ప్రపంచ వైద్య చరిత్రలోనే తొలి ప్రయోగం విఫలం.. మనిషికి పంది గుండె అమర్చిన వ్యక్తి మృతి
Pig Heart Transplant: ప్రపంచ వైద్య చరిత్రలోనే అమెరికా వైద్యులు(American Doctors) చేసిన ఓ అరుదైన ఆపరేషన్.. తాజాగా విఫలం అయింది. ప్రపంచంలోనే మొదటి సారిగా ఓ వ్యక్తికి పంది గుండెను అమర్చారు. ఈ ఆపరేషన్..

Pig Heart Transplant: ప్రపంచ వైద్య చరిత్రలోనే అమెరికా వైద్యులు(American Doctors) చేసిన ఓ అరుదైన ఆపరేషన్.. తాజాగా విఫలం అయింది. ప్రపంచంలోనే మొదటి సారిగా ఓ వ్యక్తికి పంది గుండెను అమర్చారు. ఈ ఆపరేషన్(heart operation) చేసి సక్సెస్ అయ్యామని ప్రచారం చేసుకున్నారు. అయితే సరిగ్గా రెండు నెలల క్రితం రెండు నెలల క్రితం అమెరికాలోని హార్ట్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయించున్న రోగి తాజాగా చనిపోయాడు. మేరీల్యాండ్‌కు చెందిన డేవిడ్ బెన్నెట్(57)కు రెండు నెలల క్రితం అమెరికాలోని మేరీల్యాండ్ ఆసుపత్రిలో గుండెమార్పిడి శస్త్రచికిత్స చేశారు. ప్రపంచ వైద్య చరిత్రలోనే తొలిసారిగా జన్యుమార్పిడి చేసిన పంది నుంచి సేకరించిన గుండెను ఆయనకు విజయవంతంగా అమర్చారు. దీంతో దీనిని అవయవాల మార్పిడిలో కీలకమైన ముందడుగుగా భావించారు. కొన్ని రోజులుగా బెన్నెట్ ఆరోగ్యం క్షీణిస్తూ వస్తుండడంతో ఆయనను బతికించేందుకు వైద్యులు తీవ్రంగా కృషి చేశారు. అయితే, ఆ ప్రయత్నాలు విఫలమయ్యాయి. తాజాగా బెన్నెట్ మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు. తండ్రి మృతి విషయాన్ని బెన్నెట్ కుమారుడు బెన్నెట్ జూనియర్ నిర్ధారించారు. అయితే బెన్నెట్ మరణానికి గల కారణాలను ఆస్పత్రి వర్గాలు వివరించలేదు. తన తండ్రిని బతికించడం కోసం ఆస్పత్రి సిబ్బంది తీవ్ర కృషి చేశారని బెన్నెట్ కుమారుడు చెప్పాడు. అయినా డాక్టర్ల ప్రయత్నాలు ఫలించలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
అయితే ఇలా గతంలో కూడా మనిషికి జంవుతువు అవయవాలను అమర్చిన సంఘటలున్నాయి.. 1984లో ఒక రకం కోతి గుండెను బేబీ ఫే అనే వ్యక్తికి అమర్చగా 21 రోజులు మాత్రమే జీవించారు.అప్పుడు కూడా ఈ ఆపరేషన్ సక్సెస్ కాలేదు. అప్పటితో పోలిస్తే.. ఇప్పుడు కొంతమేర సక్సెస్ అయ్యామని వైద్య నిపుణులు చెబుతున్నారు.
Also Read:
పెద్ద పులి, ఎలుగుబంటి ముఖాముఖి.. జంగిల్ బుక్‌లో దృశ్యం అంటూ నెట్టింట్లో వీడియో వైరల్
ఫేక్ న్యూస్‌కు చెక్ పెట్టేందుకు వాట్సాప్ కొత్త ఫీచర్.. ఇకపై ఎలా పడితే అలా కుదరదు..
