Chat GPT: చాట్‌జీపీటీని దుర్వినియోగం చేస్తున్నారా.. అయితే జాగ్రత్త
ఇటీవల వచ్చిన చాట్‌జీపీటీ తక్కువ సమయంలోనే ఎంతో ఆదరణ పొందింది. అయితే ఈ సాంకేతికతను అందిపుచ్చుకని కొంతమంది దుర్వినియోగం చేయడం కలకలం రేపుతోంది. ఇటీవల చైనాకు చెందిన హాంగ్ అనే ఓ వ్యక్తి రైలు ప్రమాదంపై తప్పుడు వార్తను సృష్టించి చాట్‌జీపీటీ సహాయంతో ఆన్లైన్లో పోస్టు చేయడంతో అతడ్ని పోలీసులు అరెస్టు చేశారు.
ఇటీవల వచ్చిన చాట్‌జీపీటీ తక్కువ సమయంలోనే ఎంతో ఆదరణ పొందింది. అయితే ఈ సాంకేతికతను అందిపుచ్చుకని కొంతమంది దుర్వినియోగం చేయడం కలకలం రేపుతోంది. ఇటీవల చైనాకు చెందిన హాంగ్ అనే ఓ వ్యక్తి రైలు ప్రమాదంపై తప్పుడు వార్తను సృష్టించి చాట్‌జీపీటీ సహాయంతో ఆన్లైన్లో పోస్టు చేయడంతో అతడ్ని పోలీసులు అరెస్టు చేశారు. అయితే ఈ చాట్‌జీపీటీని దుర్వినియోగం చేసినందుకు ఈ దేశంలో నమోదైన తొలి అరెస్టు ఇదేనంటూ అధికారులు తెలిపారు. వివరాల్లోకి వెళ్తే ఏప్రిల్ 25న ఓ లోకల్ రైలు ప్రమాదానికి గురైందని, అందులో 9 మంది చనిపోయారని హాంగ్ ఒక తప్పుడు వార్తను సృష్టించాడు. బైజియాహో అనే ఆన్లైన్ వేదికలో సుమారు 20 ఖాతాల ద్వారా ఈ కథనాన్ని పోస్ట్ చేశాడు.
ఈ కథనాన్ని సైబర్ విభాగం పోలీసులు గుర్తించినప్పటికీ.. అప్పటికే ఈ దీనికి 15వేల క్లిక్‌లు వచ్చాయి. బైజియాహోలోని డూప్లికేషన్ తనిఖీ వ్యవస్థను ఏమార్చి, బహుళ ఖాతాల ద్వారా తాను ఈ నకిలీ వార్తను వ్యాప్తి చేసినట్లు హాంగ్ ఒప్పుకున్నాడు. చాట్‌జీపీటీ సాయంతో ఒకే నకిలీ వార్తకు సంబంధించి భిన్న వెర్షన్లను అతడు సృష్టించినట్లు అధికారులు పేర్కొన్నారు. సమాజంలో ఇబ్బందులు కలిగించడానికి ప్రయత్నించాడనే అభియోగం కింద అతడిపై కేసు నమోదు చేశామని తెలిపారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.