సముద్ర తీరంలో కాలిబూడిదైన నౌక.. 23 మంది భారతీయులు సేఫ్, ఇద్దరు గల్లంతు!
యెమెన్‌లోని ఆడెన్ సముద్ర తీరంలో భారీ ప్రమాదం జరిగింది. ఈ భయంకరమైన సంఘటనలో, కామెరూన్ జెండా కలిగిన ఓడ MV ఫాల్కన్‌లో భారీ పేలుడు సంభవించింది. దీంతో భారీగా మంటలు చెలరేగాయి. ఆ ఓడ యెమెన్‌లోని ఆడెన్ ఓడరేవు నుండి జిబౌటి వైపు ఆగ్నేయంగా LPGని తీసుకెళ్తుంది. ఓడలో భారీ పేలుడు కారణంగా మంటలు నౌక అంతటా వ్యాపించాయి.

యెమెన్‌లోని ఆడెన్ సముద్ర తీరంలో భారీ ప్రమాదం జరిగింది. ఈ భయంకరమైన సంఘటనలో, కామెరూన్ జెండా కలిగిన ఓడ MV ఫాల్కన్‌లో భారీ పేలుడు సంభవించింది. దీంతో భారీగా మంటలు చెలరేగాయి. ఆ ఓడ యెమెన్‌లోని ఆడెన్ ఓడరేవు నుండి జిబౌటి వైపు ఆగ్నేయంగా LPGని తీసుకెళ్తుంది. ఓడలో భారీ పేలుడు కారణంగా మంటలు నౌక అంతటా వ్యాపించాయి. అయితే, అందులో ఉన్న 24 మంది సిబ్బందిని రక్షించి జిబౌటి కోస్ట్ గార్డ్‌కు అప్పగించారు. శనివారం (అక్టోబర్ 18, 2025) జరిగిన ఈ ఘటన అలస్యంగా వెలుగులోకి వచ్చింది.
నౌకలో ఉన్న సిబ్బందిలో ఎక్కువ మంది భారత సంతతికి చెందినవారని అధికారులు గుర్తించారు. అగ్నిప్రమాదం తరువాత, 23 మంది భారతీయ సిబ్బందిని MV ఫాల్కన్ నుండి రక్షించారు. అయితే, ఇద్దరు సిబ్బంది ఇప్పటికీ కనిపించడం లేదు. నౌకలో పేలుడు, మంటలు సంభవించిన తరువాత, కెప్టెన్ సహాయం కోసం అత్యవసర కాల్ పంపాడు. దీని తరువాత EUNAVFOR Aspide వెంటనే సిబ్బంది కోసం సెర్చ్, రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించింది. MV ఫాల్కన్‌లో మొత్తం 26 మంది సిబ్బంది ఉన్నారు. ఇద్దరు తప్పిపోయారని అధికారులు ప్రకటించారు.
ఈ సంఘటనకు సంబంధించి EUNAVFOR Aspides ఒక అధికారిక ప్రకటన విడుదల చేసింది. MV ఫాల్కన్ నౌకలో 26 మంది సిబ్బంది ఉన్నారు. వారిలో 24 మందిని సురక్షితంగా కాపాడగలిగాము. మరో ఇద్దరు ఇప్పటికీ కనిపించడం లేదు. రక్షించిన సిబ్బందిలో 23 మంది భారతీయ సంతతికి చెందినవారు. ఒకరు ఉక్రేనియన్ దేశానికి చెందినవ్యక్తి. నౌక నుండి రక్షించిన సిబ్బందిని జిబౌటి ఓడరేవులో కోస్ట్ గార్డ్‌కు అప్పగించారు. ఈ భయంకరమైన సముద్ర ప్రమాదంలో గాయపడిన నావికులు వైద్య చికిత్స పొందుతున్నారని EUNAVFOR Aspides ఒక ప్రకటనలో తెలిపింది.
సముద్రంలో జరిగిన ప్రమాదంలో, కామెరూన్ జెండా కలిగిన MV ఫాల్కన్ నౌకలో దాదాపు 15 శాతం మంటల్లో చిక్కుకుంది. భారీగా నష్టం వాటిల్లిందని అధికారులు భావిస్తున్నారు. అయితే, ఈ విషాదకరమైన ప్రమాదానికి కారణం ఇంకా తెలియరాలేదు. దర్యాప్తు జరుగుతోంది. తప్పిపోయిన వారి కోసం గాలింపు కొనసాగుతోంది.
Gulf of Aden, October 19, 2025. Fire onboard LPG Tanker MV FALCON – SAR Operations Underway. THIRD UPDATE
Read more: https://t.co/Xhi7I9H6n6 pic.twitter.com/VI5pyif0oT
— EUNAVFOR ASPIDES (@EUNAVFORASPIDES) October 19, 2025
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
