AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Happiest Country: ఆ దేశంలో అందరూ హ్యాపీనే.. వరసగా ఐదోసారి ఘనత.. పూర్తి వివరాలివే

ఫిన్లాండ్ (Finland) మరో ఘనత సాధించింది. ప్రపంచంలోనే అత్యంత సంతోషకరమైన దేశంగా మరోసారి టాప్ ర్యాంక్ కొట్టేసింది. మార్చి 20న ‘అంతర్జాతీయ ఆనంద దినోత్సవాన్ని’ పురస్కరించుకుని ఐక్యరాజ్యసమితి...

Happiest Country: ఆ దేశంలో అందరూ హ్యాపీనే.. వరసగా ఐదోసారి ఘనత.. పూర్తి వివరాలివే
Finland
Ganesh Mudavath
|

Updated on: Mar 18, 2022 | 7:02 PM

Share

ఫిన్లాండ్ (Finland) మరో ఘనత సాధించింది. ప్రపంచంలోనే అత్యంత సంతోషకరమైన దేశంగా మరోసారి టాప్ ర్యాంక్ కొట్టేసింది. మార్చి 20న ‘అంతర్జాతీయ ఆనంద దినోత్సవాన్ని’ పురస్కరించుకుని ఐక్యరాజ్యసమితి శుక్రవారం ‘హ్యాపీనెస్ ఇండెక్స్ రిపోర్ట్ – 2022’ ను రిలీజ్ చేసింది. మొత్తం 146 దేశాలతో ఈ జాబితా రూపొందించగా.. భారత్‌ 136వ స్థానంలో ఉంది. అయితే గతేడాదితో పోలిస్తే భారత్ (India) మూడు స్థానాలు మెరుగుపరుచుకోవడం కొసమెరుపు. ఈ జాబితాలో ఫిన్లాండ్‌ ప్రథమ స్థానంలో నిలవడం వరుసగా ఇది ఐదోసారి కావడం విశేషం. ఫిన్లాండ్ తర్వాతి స్థానాల్లో డెన్మార్క్‌, ఐస్‌ల్యాండ్‌, స్విట్జర్లాండ్‌, నెదర్లాండ్స్‌ టాప్‌-5 ర్యాంకులు సాధించాయి. అమెరికా గతేడాదితో పోలిస్తే ఈ సారి మూడు స్థానాలు మెరుగుపర్చుకుని 16వ స్థానాన్ని కైవసం చేసుకుంది. గతేడాది 19 స్థానంలో నిలిచిన చైనా (China).. ఈ సారి ఏకంగా 72వ ర్యాంక్‌కు పడిపోయింది. ఈ జాబితాలో అఫ్గానిస్థాన్‌ అట్టడుగున ఉండగా.. లెబనాన్‌, జింబాబ్వే, రువాండాలో అల్ప సంతోషకర దేశాలుగా ఐరాస ప్రకటించింది.

ప్రపంచ ఆనంద నివేదిక అంటే..

2012 నుంచి ఐక్యరాజ్య సమితి ఈ ఆనంద సూచీలను విడుదల చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా వలసదారుల పరిస్థితి ఎలా ఉంది? ఏ దేశంలో ప్రవాసులు సంతోషంగా గడుపుతున్నారు? అనే అంశాల ఆధారంగా ర్యాంకులు ఇస్తారు. దేశ స్థూల తలసరి ఆదాయం, సామాజిక మద్దతు, ఆరోగ్యం, సామాజిక స్వేచ్ఛ, ఉదారత, అవినీతి అనే ఆరు ప్రధాన అంశాలను ఆధారంగా ఈ నివేదిక రూపొందిస్తారు. ఆయా దేశాల్లో పుట్టిపెరిగిన వారితో పాటు, ఇతర దేశాల నుంచి వలస వచ్చిన వారి పరిస్థితి ఎలా ఉంది? ఎంత సంతోషంగా ఉన్నారు? వసతులు కల్పన, సామాజిక బాంధవ్యాలు ఎలా ఉన్నాయి? వంటి విషయాలపై అధ్యయనం చేసి తుది ఫలితాలు వెల్లడిస్తారు.

ప్రపంచంలోనే అత్యంత సంతోషంగా ఉన్న దేశంగా ఘనత సాధించిన ఫిన్లాండ్‌.. దేశ అవసరాలకు సరిపడా జనాభా లేక సతమతమవుతోంది. ఈ నేపథ్యంలో పని చేసేవారి సంఖ్యను పెంచుకునేందుకు ఫిన్లాండ్‌ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దేశంలో కార్యకలాపాలకు ఎలాంటి ఆటంకం లేకుండా సాగాలంటే ఏడాదికి కనీసం 10-30 వేల మంది వలస రావాలని గ్రహించి ఆ దిశగా ప్రయత్నాలు ప్రారంభించింది. ‘ఫిన్‌లాండ్‌లో భవిష్యత్తును రూపుదించుకోండి’ అనే నినాదంతో విదేశీయులను ఆకర్షించేలా క్యాంపెయిన్ చేపట్టింది. ఇతర దేశాల నుంచి వచ్చి స్థిరపడేందుకు ఆసక్తి చూపించిన వారికి ఫిన్లాండ్‌ పౌరసత్వం ఇచ్చి ఆహ్వానిస్తోంది. లేదంటే అక్కడ పని చేసేందుకైనా ఇమ్మిగ్రేషన్‌ సదుపాయం కల్పిస్తోంది.

Also Read

Cherry-Tarak: ప్రపంచానికి తెలియని స్నేహం మాది.. మేము భిన్న ధ్రువాలం.. అందుకే చెర్రీ అంటే ఇష్టం అంటున్న తారక్

Chinna Jeeyar Swamy Press Meet: సమ్మక్క సారక్కల వివాదంపై చిన జీయర్ స్వామి వివరణ

Telangana: వెంటాడిన విధి.. ట్రాక్టర్​ నడుపుతుండగా డ్రైవర్‌కు గుండెపోటు.. ముగ్గురు దుర్మరణం