AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

హడలెత్తిస్తున్న మిడతల దండు.. క్షణాల్లో చేతికొచ్చిన పంటలు మాయం.. గాలి ఎటు వీస్తే అటు ప్రయాణం

ఆఫ్రికాలో మిడతల దండు స్థానికులను హడలెత్తిస్తోంది. కరవు, కరోనా కారణంగా ఇప్పటికే ఆ దేశం తీవ్రంగా నష్టపోగా.. ఇప్పుడు వీటి వ్యాప్తి కట్టడి చేయకపోతే..

హడలెత్తిస్తున్న మిడతల దండు.. క్షణాల్లో చేతికొచ్చిన పంటలు మాయం.. గాలి ఎటు వీస్తే అటు ప్రయాణం
Locust Invasion
Ram Naramaneni
|

Updated on: Apr 11, 2021 | 12:42 PM

Share

Locust Attack: ఆఫ్రికాలో మిడతల దండు స్థానికులను హడలెత్తిస్తోంది. కరవు, కరోనా కారణంగా ఇప్పటికే ఆ దేశం తీవ్రంగా నష్టపోగా.. ఇప్పుడు వీటి వ్యాప్తి కట్టడి చేయకపోతే భారీ నష్టం వాటిల్లుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అకస్మాత్తుగా రావడం.. పచ్చదనాన్ని నాశనం చేసి వెళ్లిపోవడం మిడతల దండు స్వభావం. గాలి ఎటు వీస్తే అటు ప్రయాణించి ఆ మార్గంలో ఉన్న పంట పొలాలు, చెట్లపై వాలిపోతాయి. పంటను తిని మరో ప్రాంతానికి దండెత్తుతాయి. వీటి ప్రభావం ఏ స్థాయిలో ఉంటుందో భారత్‌లోని పలు రాష్ట్రాలకు కూడా గతేడాది అనుభవమైంది. ఇప్పుడు ఇవే మిడతల దండు తూర్పు ఆఫ్రికాలోని కెన్యా, ఇథియోపియాను వణికిస్తోంది. ఈ రెండో దేశాల్లో మిడతల దాడులు ఎక్కువగా కెన్యాలోనే జరుగుతున్నాయి.

వాటిని తరమేందుకు సైనికులు కూడా రంగంలోకి దిగారంటే.. పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. అటవీ ప్రాంతాలు, జనావాసాలు కాస్త తక్కువగా ఉన్న ప్రాంతాల్లో పిచికారీ చేస్తూ… వాటిని కట్టడి చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. కెన్యాపై గతేడాది కూడా మిడతల దాడి జరిగితే… పిచికారీ ద్వారా వాటిని కట్టడి చేశారు. అప్పట్లో మిడతల కారణంగా ప్రభావితమైన ప్రాంతాలు జనావాసాలకు దూరంగా ఉండటం వల్ల… పెద్దగా పంటనష్టం జరగలేదు. కానీ, ఈసారి జన జీవనం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో దాడులు చేస్తుండడంతో… వీటిని పిచికారి చేసి కట్టడి చేయడం సవాల్‌గా మారుతోంది. కెమికల్స్‌ స్ప్రే ద్వారా నీరు కలుషితం కావడంతో పాటు ప్రజలు, మూగజీవాల ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయని అధికారులు భావిస్తున్నారు. ఇక… కెన్యాకి అన్నపూర్ణగా ఉన్న ఈ ప్రాంతంలో మిడతల దాడి.. ఆదేశాన్ని ఆందోళనకు గురిచేస్తోంది. కిలోమీటరుకు సుమారు 150 మిలియన్ మిడతలు ఉంటాయని.. 2,500 మంది తినే ఆహారాన్ని ఒక్కరోజులో ఇవి తింటాయని నిపుణులు చెప్తున్నారు. వీటికి రోజుకు 100 నుంచి 150 కిలోమీటర్లు ప్రయాణించే సామర్థ్యం ఉంటుందని వెల్లడిస్తున్నారు. అయితే… తక్కువ వర్షపాతం కారణంగా మిడతలు వృద్ధి చెందలేవన్న అంశం ఇప్పుడు అక్కడి ప్రభుత్వం, ప్రజలకు కాస్త ఊరట కల్పిస్తున్న అంశం.

Also Read:  భార్య ప్రేమతో లంచ్ చేస్తుంటే… ఆఫీసులో అమ్ముకుంటున్న భర్త.. రీజన్ చాలా సిల్లీ..!

57 ఏళ్ల మహిళ 62 ఏళ్ల తన భర్తను పక్కా స్కెచ్ వేసి హతమార్చింది.. షాకింగ్ రీజన్.. ఇలా కూడా ఆలోచిస్తారా..?

l