AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral: ఓ వరుడు..గూగుల్ మ్యాప్..మారిపోయిన వధువు..పెళ్లిచూపులు మూవీ పార్ట్ 2

మీరు పెళ్లిచూపులు సినిమా చూశారా? అందులో హీరో పెళ్లిచూపుల కోసం బయలుదేరి.. ఒక అమ్మాయి ఇంటికి వెళ్ల బోయి ఇంకో ఇంటికి వెళతాడు. తరువాత కథంతా ఫన్నీగా ఉంటుంది. సరిగ్గా ఇటువంటి సంఘటన నిజ జీవితంలో కూడా జరిగితే ఎలా ఉంటుంది?

Viral: ఓ వరుడు..గూగుల్ మ్యాప్..మారిపోయిన వధువు..పెళ్లిచూపులు మూవీ పార్ట్ 2
Viral
KVD Varma
|

Updated on: Apr 11, 2021 | 12:40 PM

Share

మీరు పెళ్లిచూపులు సినిమా చూశారా? అందులో హీరో పెళ్లిచూపుల కోసం బయలుదేరి.. ఒక అమ్మాయి ఇంటికి వెళ్ల బోయి ఇంకో ఇంటికి వెళతాడు. తరువాత కథంతా ఫన్నీగా ఉంటుంది. సరిగ్గా ఇటువంటి సంఘటన నిజ జీవితంలో కూడా జరిగితే ఎలా ఉంటుంది? అదే జరిగింది ఇండోనేషియాలో.. కాకపొతే పెళ్లి చూపులు కాదు ఏకంగా పెళ్లి కోసమే ఇలా ఎడ్రస్ మారిపోయాడు పెళ్లి కొడుకు.. సినిమాలో ఎడ్రస్ చెప్పడంలో కన్ఫ్యూజన్ వల్ల అలా జరుగుతుంది. కానీ, ఇక్కడ గూగుల్ మ్యాప్స్ ని నమ్ముకోవడంతో ఇలా జరిగింది. పెళ్లి చేసుకోవడం కోసం బంధుమిత్ర సపరివారంగా బయలుదేరిన పెళ్ళికొడుకు.. తాను పెళ్లాడబోయే వధువు ఇంటికి కాకుండా వేరే పెళ్లి కూతురు వద్దకు వెళ్ళాడు.. అసలేం జరిగిందంటే..

ఇండోనేషియాలోని సెంట్రల్ జావాలో ‘లోసారి హామ్లెట్ ‘లో పెళ్లి చేసుకోవడానికి ఒక యువకుడు బయలు దేరి వెళ్ళాడు. పెళ్లి జరగాల్సిన ఊరి పేరు గూగుల్ లో కొట్టి.. అందులో కనిపించిన రూటు ప్రకారం జాగ్రత్తగా బాంధవులతో కలిసి వెళ్ళాడు. అయితే, పొరపాటున గూగుల్ లో ‘లోసారి హామ్లెట్’ ప్రాంతానికి బదులుగా ‘జెంగ్ కోల్ హామ్లెట్’ అనే ఊరికి దారి కనిపించింది. ఇది గమనించని ఈ పెళ్ళికొడుకు నేరుగా గూగుల్ మీ డెస్టినేషన్ వచ్చింది అని చెప్పే ప్రాంతానికి వెళ్ళిపోయాడు. పాపం..ఇక్కడ గూగుల్ మిస్టేక్ కూడా ఏమీలేదు.. రెండిటిలో హామ్లెట్ ఉందిగా అందుకే అలా చూపించేసింది.

సరిగ్గా ఇదే సమయానికి అక్కడ మారియా అనే అమ్మాయికి బుర్హాన్ అనే యువకుడితో నిశ్చితార్థం జరుగాల్సి ఉంది. ఇక మన గూగుల్ హీరో తిన్నగా మారియా ఇంటి ముందు వాలిపోయాడు. అక్కడివారు వీరిని బుర్హాన్ అనే పెళ్ళికొడుకు.. అతని బంధువులు అనుకూలం స్వాగత కార్యక్రమాలు కానిచ్చేశారు. అంతా సెట్ అవుతున్న సమయంలో అక్కడి పెళ్లికూతురు మారియాకు డౌట్ వచ్చింది. తనకు నిశ్చితార్థం జరగాలి కదా.. మరి ఈ హీరో ఏంటి పెళ్లిబట్టల్లో వచ్చేశాడు.. అని. అంతే విషయం ఏమిటని ఆరాతీస్తే ఈ ఆరాటపు పెళ్ళికొడుకు వ్యవహారం అర్ధం అయింది. దీంతో సదరు మారిపోయిన పెళ్ళికొడుకు.. నాలిక్కరుచుకుని గూగుల్ లో అడ్రస్ సరిగా సెట్ చేసుకుని.. అసలు పెళ్లి మండపానికి వెళ్ళాడు..

అదండీ విషయం.. గూగుల్ మ్యాప్ లోకేషన్ సెట్ చేసుకుని సరిచూసుకోకపోతే ఇలానే జరుగుతుంది.. అందుకని గూగుల్ మ్యాప్స్ విషయంలో ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకోండి. ప్రస్తుతానికి ఈ పెళ్ళికొడుకు సంఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Also Read: హడలెత్తిస్తున్న మిడతల దండు.. క్షణాల్లో చేతికొచ్చిన పంటలు మాయం.. గాలి ఎటు వీస్తే అటు ప్రయాణం

Indonesia Earthquake: ఇండోనేషియాను వణికిస్తున్న విపత్తులు.. భారీ భూకంపం.. ఆరుగురు మృతి