AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మానవుల ప్రాణాలు హరించే ప్రమాదకర జీవి ఏంటో తెలుసా?.. నిత్యం మీవెంటే ఉంటుంది.. తెలిస్తే షాక్ అవుతారు!

Human Killer Animals: ప్రపంచంలో ఏ జంతువులు మనుషుల ప్రాణాలకు ఎక్కువ హానీకరం అంటే ఏం సమాధానం చెబుతారు?. సాధారణంగా..

మానవుల ప్రాణాలు హరించే ప్రమాదకర జీవి ఏంటో తెలుసా?.. నిత్యం మీవెంటే ఉంటుంది.. తెలిస్తే షాక్ అవుతారు!
Human Killers
Shiva Prajapati
|

Updated on: Apr 11, 2021 | 9:45 PM

Share

Human Killer Animals: ప్రపంచంలో ఏ జంతువులు మనుషుల ప్రాణాలకు ఎక్కువ హానీకరం అంటే ఏం సమాధానం చెబుతారు?. సాధారణంగా ఎవరైనా సింహం, పులి, మొసలి, షార్క్, తేలు, పాము మరో క్రూర జంతువుల పేరు చెబుతారు. ఒకవేళ మీరు కూడా ఇదే భావిస్తున్నట్లయితే.. పప్పులో కాలేసినట్లే. అసలు విషయం తెలిస్తే షాక్ అవుతారు. భూమిపై మనుషుల ప్రాణాలకు ముప్పు తలపెట్టే ప్రమాదకరమైన జంతువుల లిస్ట్‌లను తాజాగా ఓ అంతర్జాతీయ సంస్థ విడుదల చేసింది. మరి మనుషుల ప్రాణాలను ఎక్కువగా బలిగొంటున్న జీవులు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం.

వాస్తవానికి మనుషులకు హానీ చేసే జీవుల్లో అత్యంత క్రూరమైన జంతువుగా సింహం పేరు టక్కున గుర్తుకు వస్తుంది. ఈ సింహం కారణంగా ప్రపంచ వ్యాప్తంగా ఏటా 200 మంది ప్రాణాలు కోల్పుతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. అయితే, సింహాల కంటే కూడా ఎక్కువ మొత్తంలో మానవులను చంపే మరికొన్ని జంతువులు కూడా ఉన్నాయి. జాబితాలో నీటి ఏనుగు తొమ్మిదవ స్థానంలో ఉంది. ఇవి ప్రతి ఏటా 500 మంది మరణానికి కారణమవుతున్నాయట. ఇక ఏనుగులు కూడా అంతేస్థాయిలో మనుషుల ప్రాణాలను తీస్తున్నాయని సదరు నివేదిక వెల్లడించింది. ఏనుగులు ప్రతి సంవత్సరం సగటున 600 మందిని చంపుతున్నాయట.

నివేదిక ఆధారంగా ఏ జీవి కారణంగా ఎంతమంది మనుషులు ప్రాణాలు కోల్పోతున్నారంటే.. 1. మొసళ్ల కారణంగా ప్రతి సంవత్సరం సగటున 1,000 మంది ప్రాణాలు కోల్పోతున్నారు. 2. తేళ్ల కారణంగా ప్రపంచ వ్యాప్తంగా ఏటా 3,300 మంది మృత్యువాత పడుతున్నారు. 3. కిల్లర్ బగ్ కారణంగా సంవత్సరానికి దాదాపు 10,000 మంది మరణిస్తున్నారు. 4. కుక్కుల కారణంగా ప్రతి సంవత్సరం సగటున 59,000 మంది ప్రాణాలు వదులుతున్నారు. 5. పాము కాటు కారణంగా ప్రపంచ వ్యాప్తంగా ఏటా 1,38,000 మంది మృత్యు ఒడికి చేరుతున్నారు. 6. మనుషుల కారణంగా చనిపోతున్న వారి సంఖ్య అధికంగా ఉంది. మనుషుల కారణంగా ఏటా 4,00,000 మంది హత్యకు గురవుతున్నారు. 7. ఒళ్లు గగుర్పొడిచే అంశం ఏంటంటే.. భారీ స్థాయిలో మనుషులు చనిపోవడానికి కారణమయ్యే ప్రధాన జీవి ‘దోమ’. దోమ కాటు కారణంగా ప్రపంచ వ్యాప్తంగా ఏటా 7,25,000 మరణిస్తున్నారు. దోమ కాటుతో మనుషులు మలేరియా, డెంగ్యూ, ఎల్లో ఫీవర్ వంటి రోగాలకు గురై ప్రాణాలు కోల్పోతున్నట్లు నివేదికలు వెల్లడించాయి.

Also read:

Rahul Dravid Video: రాహుల్ ద్రావిడ్ కోపం.. తెలివిగా వాడేసుకున్న సూరత్ పోలీసులు.. ఇంతకీ ఏం చేశారంటే..

Save Beach:సేవ్‌ బీచ్‌…సేవ్‌ యానిమల్‌…కార్యక్రమానికి సాగరతీరంలో మాంచి స్పందన..