AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Save Beach:సేవ్‌ బీచ్‌…సేవ్‌ యానిమల్‌…కార్యక్రమానికి సాగరతీరంలో మాంచి స్పందన..

సేవ్‌ బీచ్‌...సేవ్‌ యానిమల్‌...కార్యక్రమానికి మాంచి స్పందన వచ్చింది. విశాఖ సాగరతీరంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి నగరవాసులు స్వచ్చంధంగా తరలివచ్చి తలో చేయి వేశారు. ప్లాస్టిక్‌ వ్యర్థాలతో నిండిపోయిన బీచ్‌ను..

Save Beach:సేవ్‌ బీచ్‌...సేవ్‌ యానిమల్‌...కార్యక్రమానికి సాగరతీరంలో మాంచి స్పందన..
Good Response To Save Beach
Sanjay Kasula
|

Updated on: Apr 11, 2021 | 9:36 PM

Share

సేవ్‌ బీచ్‌…సేవ్‌ యానిమల్‌…కార్యక్రమానికి మాంచి స్పందన వచ్చింది. విశాఖ సాగరతీరంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి నగరవాసులు స్వచ్చంధంగా తరలివచ్చి తలో చేయి వేశారు. ప్లాస్టిక్‌ వ్యర్థాలతో నిండిపోయిన బీచ్‌ను క్లీన్‌ చేశారు. విశాఖ అటవీశాఖ ఆధ్వర్యంలో చేపట్టిన బీచ్‌ క్లీనింగ్‌ కార్యక్రమానికి మంచి స్పందన లభించింది. తెన్నేటి పార్క్‌ దగ్గర నిర్వహించిన ఈ ప్రోగ్రామ్‌లో నగరవాసులు పెద్ద సంఖ్యలో స్వచ్చంధంగా తరలివచ్చారు. అటవీశాఖ అధికారులతో పాటు స్థానిక పోలీసులు, విద్యార్థులు, నగరవాసులు , బీచ్‌కు వచ్చిన ఇతర ప్రాంతాల వాసులు కూడా తలో చేయి వేశారు. సుమారు రెండు గంటలపాటు ప్లాస్టిక్‌తోపాటు ఇతర వ్యర్థాలను ఏరి వేశారు.

విశాఖ తెన్నేటి పార్క్‌ దగ్గర ఇటీవల ప్లాస్టిక్‌, ఇతర వ్యర్థ పదార్థాలు కిలోలకొద్దీ పేరుకుపోయాయి. బీచ్‌కు వచ్చిన సందర్శకులు ప్లాస్టిక్‌ బాటిల్స్‌, ప్లాస్టిక్‌ పేపర్లు, ఇతర వ్యర్థలా ను అక్కడే పడేసి వెళ్తిపోతున్నారు. దీంతో పెద్దయెత్తున బీచ్‌లో వ్యర్థాలు పేరుకుపోయాయి. దీనివల్ల పర్యావరణానికి హాని కలుగడంతో పాటు సముద్రజీవుల మనుగడకు ముప్పు వాటిల్లుతోందనే ఆందోళనలు వ్యక్తమయ్యాయి. దాంతో అటవీశాఖ సిబ్బంది బీచ్‌ క్లీనింగ్‌కి పూనుకుంది.

పర్యావరణానికి ముప్పు ఏర్పడకుండా ప్రజల్లో అవగాహన తెచ్చేందుకే తాము బీచ్‌ క్లీనింగ్‌ కార్యక్రమాన్ని చేపట్టామని అటవీశాఖ అధికారి చెప్పారు. పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని…బీచ్‌ క్లీనింగ్‌లో తాము స్వచ్చంధంగా పాల్గొన్నామని విద్యార్థులు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి :  భార్య కోసం సెల్ టవర్ ఎక్కాడు.. నాలుగు గంటలపాటు పోలీసులకు చుక్కలు చూపించాడు.. చివరికి ఏం చేశాడంటే..

కాబోయే వాడ్ని కలవడానికి రాత్రి పూట వెళ్లింది… గడ్డి కుప్పలో శవమై తేలింది.. అసలు ఏం జరిగిందంటే..