ఘోర రోడ్డు ప్రమాదం..బస్సులో ప్రయాణిస్తున్న 40 మంది సజీవ దహనం
48 మందితో ప్రయాణిస్తున్న బస్సును ఓ ట్రక్కు ఢీకొంది. దీంతో బస్సులో మంటలు చెలరేగి 40 మంది సజీవ దహనమయ్యారు. టబాస్కో రాష్ట్రంలో శనివారం తెల్లవారుజామున ఈఘటన చోటుచేసుకుంది. బస్సులో మంటలు వ్యాపించడంతో 38 మంది ప్రయాణికులతో పాటు ఇద్దరు డ్రైవర్లూ ప్రాణాలు కోల్పోయారు.

Fatal Road Accident
దక్షిణ మెక్సికోలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. 48 మందితో ప్రయాణిస్తున్న బస్సును ఓ ట్రక్కు ఢీకొంది. దీంతో బస్సులో మంటలు చెలరేగి 40 మంది సజీవ దహనమయ్యారు. టబాస్కో రాష్ట్రంలో శనివారం తెల్లవారుజామున ఈఘటన చోటుచేసుకుంది. బస్సులో మంటలు వ్యాపించడంతో 38 మంది ప్రయాణికులతో పాటు ఇద్దరు డ్రైవర్లూ ప్రాణాలు కోల్పోయారు.
ఘటనా స్థలంలో ఇప్పటి వరకు 30 మందికి చెందిన అవశేషాలను గుర్తించారు. ప్రమాదానికి గల కారణాలపై పూర్తి విచారణ చేపట్టినట్టుగా అధికారులు వెల్లడించారు.