- Telugu News Photo Gallery America California Village Where every person has their Private jet and the poor own luxurious Car
Private Jet: ఈ గ్రామంలోని ప్రతి ఇంటికి ఓ ప్రైవేట్ విమానం.. పేదలకు లగ్జరీ కార్లు!
Private Jet at California: ఈ రోజుల్లో అందరికి బైక్‌లు, కార్లు ఉండటం చూసే ఉంటాము. కొందరికైతే లగ్జరీ కార్లు ఉండటం చూస్తుంటాము. కానీ ఈ దేశంలోని ఓ గ్రామంలో ఇక్కడి వారందరికి ఏకంగా ప్రైవేట్ జెట్ విమానాలే ఉంటాయి. ప్రతి చిన్న అవసరానికైనా విమానంలోనే వెళ్తారు. అలాగే లగ్జరీ కార్లు కూడా ఉంటాయి. ఈ దేశంలోని ఈ గ్రామంలో చాలా మందికి సొంత విమానం ఉంది. పేదల దగ్గర లగ్జరీ కార్లు ఉన్నాయి..
Updated on: Feb 09, 2025 | 7:24 PM

Private Jet at California: ప్రపంచంలోని ఈ ప్రత్యేకమైన గ్రామంలో మీరు పార్కింగ్ స్థలంలో కార్లు, బైక్‌లను కాదు, విమానాలను చూస్తారు. వారి ఇంటి ప్రాంగణంలో ఒక ప్రైవేట్ విమానం కనిపిస్తుంది.

అంతే కాదు, కిరాణా సామాను షాపింగ్ అయినా, వారి స్వంత వ్యక్తిగత పని అయినా, అల్పాహారం తీసుకున్నా, లేదా స్నేహితులతో కలిసి తినడానికి ఎక్కడికైనా వెళ్ళినా, వారు విమానంలో వెళతారు. ఎందుకంటే వారికి ప్రైవేట్ విమానం ఉంటుంది కాబట్టి.

ఈ గ్రామం పేరు కామెరాన్ ఎయిర్ పార్క్. ఈ గ్రామం అమెరికాలోని కాలిఫోర్నియాలోని ఎల్ డొరాడో కౌంటీలో ఉంది. ఈ గ్రామం 1963 లో నిర్మాణం జరిగింది. ఇక్కడ దాదాపు 124 ఇళ్ళు ఉన్నాయి.

రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో అమెరికా పెద్ద సంఖ్యలో పైలట్లను తయారు చేసింది. త్వరిత విమానాల కోసం దేశంలోని అనేక ప్రాంతాలలో ఎయిర్‌ఫీల్డ్‌లను నిర్మించారు. కానీ యుద్ధం ముగిసిన తర్వాత ఈ వైమానిక స్థావరం మూసివేయలేదు. అక్కడ మానవ నివాసం ఏర్పడింది. దాని నుండే ఈ గ్రామం ఏర్పడింది.

పదవీ విరమణ చేసిన పైలట్లకు ఇక్కడ ఇళ్ళు ఇచ్చారు. వాటిలో కామెరాన్ ఎయిర్ పార్క్ ఒకటి. ఈ గ్రామంలో ఎక్కువ మంది పైలట్లు. ఇక్కడి ఇళ్ల ప్రాంగణాల్లో ప్రైవేట్ విమానాలు తరచుగా కనిపిస్తాయి. అలాగే కొంత పేదలుగా ఉన్నా వారికి లగ్జరీ కార్లు ఉండటం ఇక్కడ చూడవచ్చు.





























