- Telugu News Photo Gallery Cricket photos IND vs ENG: Rohit Sharma scores half century against England during 2nd ODI with 4 fours and 4 sixes
ఎన్నాళ్లకెన్నాళ్లకో.. 4 ఫోర్లు, 4 సిక్స్‌లతో తుఫాన్ హాఫ్ సెంచరీ.. కటక్‌లో పేలవ ఫాంకు గుడ్ బై చెప్పిన రోహిత్
Rohit Sharma Half Century: ఆదివారం కటక్‌లోని బారాబతి స్టేడియంలో ఇంగ్లాండ్‌తో జరుగుతోన్న రెండో వన్డేలో భారత కెప్టెన్ రోహిత్ శర్మ అర్ధ సెంచరీతో తన పేలవమైన ఫామ్‌కు ముగింపు పలికాడు. దీంతో గత కొన్నాళ్లుగా తనపై వస్తోన్న విమర్శలకు కటక్‌లో తన బ్యాట్‌తో స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు.. 4 ఫోర్లు, 4 సిక్సులతో రోహిత్ శర్మ హాఫ్ సెంచరీ చేసి, కెరీర్‌తో తక్కువ బంతుల్లో నాలుతో సారి హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు.
Updated on: Feb 09, 2025 | 7:21 PM

Rohit Sharma Half Century: నాగ్‌పూర్ వన్డేలో కేవలం 2 పరుగులు మాత్రమే చేసిన రోహిత్ శర్మ.. రెండో మ్యాచ్‌లో అర్ధశతకం సాధించాడు. ఇందుకోసం కేవలం 30 బంతులు మాత్రమే తీసుకున్నాడు. ఇది అతని వన్డే కెరీర్‌లో 58వ అర్ధశతకంగా నిలిచింది. అలాగే, రోహిత్ తన కెరీర్‌లో ఇప్పటి వరకు 31 సెంచరీలు కూడా చేశాడు.

అంతర్జాతీయ క్రికెట్‌లో వరుసగా 10 ఇన్నింగ్స్‌లలో అర్ధశతకం సాధించలేకపోయిన రోహిత్.. చివరికి 30 బంతుల్లోనే ఈ మార్కును చేరుకుని కటక్‌లో తన పేలవ ఫాంనకు ముగింపు పలికాడు.

7వ ఓవర్లో సాకిబ్ మహమూద్‌పై రోహిత్ శర్మ 2 పరుగులు తీసుకున్నాడు. దీనితో, అతను శుభ్‌మాన్ గిల్‌తో కలిసి 50 పరుగుల ఓపెనింగ్ భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. తొలి వన్డేలో రోహిత్, యశస్వి జైస్వాల్ 19 పరుగుల ఓపెనింగ్ భాగస్వామ్యాన్ని మాత్రమే చేయగలిగారు.

రెండో వన్డేలో ఇంగ్లాండ్ భారత్ కు 305 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. కటక్‌లోని బారాబాటి స్టేడియంలో జరుగుతోన్న ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఇంగ్లండ్ జట్టు 49.5 ఓవర్లలో 304 పరుగులకు ఆలౌట్ అయింది. జో రూట్ 69, బెన్ డకెట్ 65 పరుగులు చేశారు. భారత్ తరపున రవీంద్ర జడేజా 3 వికెట్లు పడగొట్టాడు.

వార్తలు రాసే సమయానికి భారత జట్టు 11 ఓవర్లు ముగిసేసరికి భారత్ వికెట్ నష్టపోకుండా 91 పరుగులు చేసింది. కెప్టెన్ రోహిత్ శర్మ 54, శుభ్‌మాన్ గిల్ 35 పరుగులతో అజేయంగా నిలిచారు. రోహిత్ తన వన్డే కెరీర్‌లో 30 బంతుల్లో 58వ అర్ధశతకం సాధించాడు.





























