Ulas family : నేటికి నాలుగు కాళ్లతో నడుస్తున్న కుటుంబం.. అచ్చం ఆదిమానవుల్లా.. శాస్త్రవేత్తలకే షాక్..!

ఆధునిక దశ నుంచి వచ్చిన మానవుడు మళ్లీ జంతు స్థితికి వస్తాడని తాను ఎప్పుడూ అనుకోలేదన్నారు.  మానవ జాతి నాగరికత సాధించినా వీరు మాత్రం ఈనాటికి నాలుగు కాళ్లమీదనే నడుస్తున్నారు. వీరిని చూసిన శాస్త్రవేత్తలు సైతం ఆశ్చర్యపోయారు. వీళ్ల పరిస్థితికి కారణం ఏంటనే దానిపై శాస్త్రవేత్తలు పలు పరిశోధనలు చేశారు. ఈ కుటుంబంలో నివసిస్తున్న ఐదుగురు తోబుట్టువుల గురించి 2000 సంవత్సరంలో ఒక శాస్త్రీయ కథనం వెలుగులోకి వచ్చింది.

Ulas family : నేటికి నాలుగు కాళ్లతో నడుస్తున్న కుటుంబం.. అచ్చం ఆదిమానవుల్లా.. శాస్త్రవేత్తలకే షాక్..!
Ulas Family In Turkey
Follow us

|

Updated on: Sep 02, 2023 | 6:58 PM

ప్రపంచవ్యాప్తంగా అనేక రకాల మనుషులు ఉన్నారు. ఇందులో కొందరు చాలా విచిత్రంగా ఉంటారు. వారు చేసే చిత్ర విచిత్రమైన పనులు, చేష్టల కారణంగా వారు వార్తల్లో నిలుస్తుంటారు. ఇదిలా ఉంటే మనుషుల్లా రెండు కాళ్లతో కాకుండా జంతువులలాగా నాలుగు కాళ్లతో నడిచే కుటుంబం గురించి ఎప్పుడైన విన్నారా..? సోషల్ మీడియా వేదికగా ఇప్పుడు ఇలాంటి మనుషులపై తీవ్ర చర్చ జరుగుతోంది. వారు రెండు కాళ్లతో పాటుగా రెండు చేతులను కూడా కాళ్లుగా వాడుకుంటారు. ఇలాంటి కుటుంబం టర్కియేలోని మారుమూల గ్రామంలో నివసిస్తుంది. ఈ కుటుంబంలో నివసిస్తున్న ఐదుగురు తోబుట్టువుల గురించి 2000 సంవత్సరంలో ఒక శాస్త్రీయ కథనం వెలుగులోకి వచ్చింది. ఇందులో వారు నడుస్తున్న తీరును కూలంకషంగా వివరించారు.

వార్తల్లో ఈ విషయం వెల్లడైన కొన్ని సంవత్సరాల తర్వాత.. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ (LSE)లో మనస్తత్వవేత్త అయిన ప్రొఫెసర్ నికోలస్ హంఫ్రీ వీరి కుటుంబాన్ని కలవడానికి టర్కీకి వెళ్లారు. ఉలాస్ కుటుంబంలోని ఆ దంపతులకు 18 మంది పిల్లలు ఉన్నారు. అయితే, వారిలో ఆరుగురు మాత్రం జంతువులలా నడుస్తున్నారు. ఇది మునుపెన్నడూ చూడని విషయం. ఈ కుటుంబంపై ఓ డాక్యుమెంటరీ కూడా తీశారు. టర్కీలోని ఈ ఉలాస్ కుటుంబం గురించి ఆస్ట్రేలియా 60 నిమిషాలు డాక్యుమెంటరీలో ప్రదర్శించింది. ఈ అసాధారణ లక్షణం ఇంతకు ముందు ‘ ది ఫామిలి దట్ వాక్స్ ఆన్ ఆల్ ఫోర్స్’లో నమోదు చేయబడింది. ఇందులో హంఫ్రీ మాట్లాడుతూ.. ఆధునిక దశ నుంచి వచ్చిన మానవుడు మళ్లీ జంతు స్థితికి వస్తాడని తాను ఎప్పుడూ అనుకోలేదన్నారు.  మానవ జాతి నాగరికత సాధించినా వీరు మాత్రం ఈనాటికి నాలుగు కాళ్లమీదనే నడుస్తున్నారు. వీరిని చూసిన శాస్త్రవేత్తలు సైతం ఆశ్చర్యపోయారు. వీళ్ల పరిస్థితికి కారణం ఏంటనే దానిపై శాస్త్రవేత్తలు పలు పరిశోధనలు చేశారు.

శాస్త్రవేత్తల పరిశోధన అనంతరం.. వీరిలో ఏదో జన్యుపరమైన సమస్య వల్ల ఇలా జరిగి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఈ ఆరుగురు తోబుట్టువులలో ఐదుగురు ఇప్పటికీ జీవించి ఉన్నారు. వీరి వయస్సు 22 నుంచి 38 సంవత్సరాల మధ్య ఉంటుంది. వీరందరిలో మెదడు సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారని కూడా చెప్పారు. డాక్టర్ డాక్యుమెంటరీలో MRI స్కాన్‌లను కూడా చూపించాడు. అందులో ప్రతి ఒక్కరి మెదడులోని సెరెబెల్లార్ వెర్మిస్ అని పిలువబడే ఒక భాగం కుంచించుకుపోయిందని చూపిస్తుంది.

ఇవి కూడా చదవండి

దీంతో ప్రజలు జంతువుల మాదిరి నాలుగు కాళ్లపై నడుస్తారని చెప్పలేమన్నారు.. ఎందుకంటే సెరెబెల్లార్ వర్మిస్ ఉన్న ఇతర వ్యక్తులు మనుషుల మాదిరిగానే రెండు కాళ్లపై నడుస్తారు. దీనికి విరుద్ధంగా ఈ కుటుంబంలోని వ్యక్తులు తమ రెండు చేతులను పాదాల వలె ఉపయోగిస్తారు. ఈ కుటుంబంపై అనేక ఇతర డాక్యుమెంటరీలు కూడా రూపొందించబడ్డాయి.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

దసరా సెలవులు అప్పటినుంచే.. 2024-25 అకడమిక్ క్యాలెండర్ విడుదల
దసరా సెలవులు అప్పటినుంచే.. 2024-25 అకడమిక్ క్యాలెండర్ విడుదల
ఈ టిప్స్ ట్రై చేస్తే.. ఇంట్లో ఒక్క బల్లి కూడా ఉండదు..
ఈ టిప్స్ ట్రై చేస్తే.. ఇంట్లో ఒక్క బల్లి కూడా ఉండదు..
పోస్ట్ ఆఫీస్‌కు అరుదైన సెక్యూరిటీ గార్డు..!
పోస్ట్ ఆఫీస్‌కు అరుదైన సెక్యూరిటీ గార్డు..!
పేరుకే విడాకులు.. కానీ కలిసే ఉంటున్నారట.! పూజా ఖేద్కర్‌ మోసం.!
పేరుకే విడాకులు.. కానీ కలిసే ఉంటున్నారట.! పూజా ఖేద్కర్‌ మోసం.!
రేయ్ ఎవుర్రా మీరంతా.. ఏంట్రా ఇది..? గుండు చేయించుకునేది ఇలాగా..?
రేయ్ ఎవుర్రా మీరంతా.. ఏంట్రా ఇది..? గుండు చేయించుకునేది ఇలాగా..?
వైజాగ్ జంట వెడ్డింగ్ కార్డు ఐడియా అదుర్స్..అచ్చం ఐఫోన్ మాదిరుందే!
వైజాగ్ జంట వెడ్డింగ్ కార్డు ఐడియా అదుర్స్..అచ్చం ఐఫోన్ మాదిరుందే!
పదవుల కోసం కోటి ఆశలతో ఎదురుచూస్తున్న కొత్త ఎమ్మెల్యేలు..!
పదవుల కోసం కోటి ఆశలతో ఎదురుచూస్తున్న కొత్త ఎమ్మెల్యేలు..!
అమెజాన్‌లో కళ్లు చెదిరే ఆఫర్స్‌-80 శాతం డిస్కౌంట్..ఎప్పుడో తెలుసా
అమెజాన్‌లో కళ్లు చెదిరే ఆఫర్స్‌-80 శాతం డిస్కౌంట్..ఎప్పుడో తెలుసా
ముచ్చటగా మూడో పతకంపై మను బాకర్ కన్ను... తదుపరి ఈవెంట్ ఎప్పుడంటే?
ముచ్చటగా మూడో పతకంపై మను బాకర్ కన్ను... తదుపరి ఈవెంట్ ఎప్పుడంటే?
రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం.. విద్యుత్ కమిషన్ చైర్మన్‌గా లోకూర్
రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం.. విద్యుత్ కమిషన్ చైర్మన్‌గా లోకూర్