Imran Khan: పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ను ఓ రేంజ్‌లో ఆడుకుంటున్న నెటిజన్లు.. ఇకలేరంటూ..

Imran Khan: పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ను ఓ రేంజ్‌లో ఆడుకుంటున్న నెటిజన్లు.. ఇకలేరంటూ..
Ripimrankhan

సోషల్ మీడియాలో ఈ రోజు ఓ యాష్ ట్యాగ్ ట్రెండింగ్ అవుతోంది. ఇందులో పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ చనిపోయాడంటూ సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతోంది. ఇమ్రాన్ ఖాన్ ఆసుపత్రిలో ఉన్నట్లు కొన్ని ఫోటోలు...

Sanjay Kasula

|

Aug 19, 2021 | 2:44 PM

సోషల్ మీడియాలో ఈ రోజు ఓ యాష్ ట్యాగ్ ట్రెండింగ్ అవుతోంది. ఇందులో పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ చనిపోయాడంటూ సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతోంది. ఇమ్రాన్ ఖాన్ ఆసుపత్రిలో ఉన్నట్లు కొన్ని ఫోటోలు, వీడియోలు కూడా నెట్టింట వైరల్ అవుతోంది. దీంతో ఆయన నిజంగానే చనిపోయాడనుకుని సోషల్ మీడియాలో ఆయనకు శ్రద్ధాంజలి మెసేజ్‌లు పెడుతున్నారు. ప్రధానంగా ట్విటర్‌లో #RIPImranKhan హ్యాష్ ట్యాగ్‌ను టాప్‌లో ట్రెండ్ చేసి మరీ ట్వీట్‌లు చేశారు. అయితే ఆ పోస్ట్‌లో నిజం లేదని తేలడంతో ఆదేశంలోని జనం అంతా ఊపిరి పీల్చుకున్నారు.

మంగళవారం రాత్రి పాక్ పీఎం ఇమ్రాన్ ఖాన్‌ ఆసుపత్రి బెడ్‌పై పడుకుని మీడియాతో మాట్లాడుతున్న ఓ సోషల్ మీడియాలో కనిపించింది. మీడియాతో మాట్లాడిన తర్వాత ఇమ్రాన్ ఖాన్ చనిపోయాడని.. ఇక పాక్ ప్రధాని లేరని రూమర్లు చక్కర్లు కొడుతున్నాయి.

ఇదంతా నిజమని నమ్మిన పాకిస్తాన్ జనం ఆయన మృతి పట్ల తమ సంతాపం తెలుపుతూ సోషల్ మీడియాలో పోస్టుల వర్షం కురిపిస్తున్నారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ట్విటర్లో ట్వీట్లు చేయడం మొదలు పెట్టారు.

ఇక కొంతమంది ఏకంగా ఇమ్రాన్ ఎలా చనిపోయారో కూడా వివరించే ప్రయత్నం చేశారు. కరాచీలో జరిగిన ఓ బాంబ్ బ్లాస్ట్‌లో ఆయన మరణించారని సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. అయితే ఆ వార్త ఫేక్ అని.. అలాగే ఈ వీడియో ఇప్పటిది కాదని.. ఇంతకుముందు ఎప్పుడో ఆయన అనారోగ్యంతో ఉన్న సమయంలోదని తేలడంతో అంతా సర్దుమణిగింది.

ఆఫ్ఘనిస్తాన్‌ను కాలకేయులు ఆక్రమించడంతో ఇటు పాకిస్తాన్‌లోని సమాన్య ప్రజలకు కొంత భయంలో ఉన్నారు. తాలిబన్లు నెక్స్ట్ పాకిస్తాన్‌ను టార్గెట్ చేస్తారు అంటూ సోషల్ మీడియాలో  ప్రచారం సాగుతుండంతో ఇది నిజమైన వార్తే అనుకుని నమ్మేశారు. తీరా అందా ఫేక్ అని తేలడంతో ఊపిరి పీల్చుకున్నారు.

ఇవి కూడా చదవండి:  Success Story: మేడపై మల్లె పూల సాగు.. లక్షల్లో సంపాదన.. లాక్‌డౌన్ సమయంలో ఓ మహిళ విజయ గాథ..

Women Should be Careful: మీ పక్కనే మృగాళ్లుంటారు.. మహిళలు బీ కేర్ ఫుల్.. సో.. బీ అలర్ట్ లేడీస్..

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu