AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వ్యాక్సిన్ విరామ కాలాన్ని పొడిగించడం వల్ల ముప్పే….అమెరికా శాస్త్రజ్ఞుడు డా.ఫాసీ హెచ్చరిక

వ్యాక్సిన్ తీసుకునే విరామకాలాన్ని పొడిగించడం వల్ల ముప్పేనని అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ కి మెడికల్ అడ్వైజర్ అయిన..డా. ఆంథోనీ ఫాసీ అన్నారు...

వ్యాక్సిన్ విరామ కాలాన్ని పొడిగించడం వల్ల ముప్పే....అమెరికా శాస్త్రజ్ఞుడు డా.ఫాసీ హెచ్చరిక
Fauci
Umakanth Rao
| Edited By: Ravi Kiran|

Updated on: Jun 12, 2021 | 10:28 AM

Share

వ్యాక్సిన్ తీసుకునే విరామకాలాన్ని పొడిగించడం వల్ల ముప్పేనని అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ కి మెడికల్ అడ్వైజర్ అయిన..డా. ఆంథోనీ ఫాసీ అన్నారు. ప్రస్తుతమున్న కోవిద్ వేరియంట్లలో దేనికైనా ప్రజలు గురి కావచ్చునని ఆయన చెప్పారు. ఇండియాలో భారత ప్రభుత్వం ఈ విరామ కాలాన్ని పొడిగిస్తూ సవరించిన గైడ్ లైన్స్ ని గతనెలలో జారీ చేసింది. ఇదే విషయమై మీడియా ఆయనను ప్రశ్నించినప్పుడు…డెల్టా వేరియంట్ గురించి ప్రస్తావించారు. ఇతర స్ట్రెయిన్ల కన్నా ఇది ప్రమాదకరమైందన్న అంశాన్ని విస్మరించరాదన్నారు. ఫైజర్ వ్యాక్సిన్ కి విరామ కాలాన్ని మూడు వారాలు, మోడెర్నాకి నాలుగు వారాల గ్యాప్ ఇచ్చారని ఆయన చెప్పారు.

విరామకాలాన్ని పొడిగించడం వల్ల వివిధ వేరియంట్లకు ప్రజలు గురి అయ్యే ప్రమాదం ఉందన్నారు. ఉదాహరణకు బ్రిటన్ లో గ్యాప్ ని పొడిగించిన కారణంగా రకరకాల స్ట్రెయిన్లకు ప్రజలు గురైనట్టు ఫాసీ పేర్కొన్నారు. అందువల్ల నిర్ణీత షెద్యూల్ విధానాన్నే కొనసాగించడం మంచిదని అయన అభిప్రాయపడ్డారు. ఇండియాలో కోవీషీల్డ్ వ్యాక్సిన్ కి గ్యాప్ ను ప్రభుత్వం మొదట ఆరు నుంచి 8 వారాలకు.. ఆ తరువాత 12 నుంచి 16 వారాలకు పెంచింది. అంతకు ముందు మార్చి నెలలో అయితే 28 రోజులు ఉంటే సరిపోతుందని పేర్కొన్న సంగతి తెలిసిందే.. మూడు నెలల్లో విరామ కాలాన్ని రెండు సార్లు ప్రభుత్వం పొడిగించింది. అయితే టీకామందు ‘సత్తా’ పెరగడానికే ఈ నిర్ణయం తీసుకున్నామని వివరణ ఇచ్చింది.

అయితే వ్యాక్సిన్ కొరత వల్ల కూడా ఈ నిర్ణయం తీసుకున్నట్టు వార్తలు వచ్చాయి. ఏమైనా డెల్టా వేరియంట్ ఇన్ఫెక్షన్ ని దృష్టిలో ఉంచుకుంటే సాధ్యమైనంత త్వరగా ప్రజలకు వ్యాక్సిన్ ఇవ్వడం మంచిదని ఫాసీ అన్నారు. ఇండియాతో బాటు అనేక దేశాలలో ఈ వేరియంట్ బలంగా ఉందని ఆయన చెప్పారు.ఇలా ఉండగా ఈ గ్యాప్ ను పెంచినా పెద్ద ముప్పేమీ లేదని, ఆందోళన చెందాల్సిన పని లేదని భారత ప్రభుత్వం చెబుతోంది.