UK General Election: యూకే సార్వత్రిక ఎన్నికలకు సర్వం సిద్ధం.. 650 పార్లమెంట్‌ స్థానాల్లో రేపే పోలింగ్‌

బ్రిటన్ సార్వత్రిక ఎన్నికలకు మరికొన్ని గంటల్లో పోలింగ్‌ స్టార్ట్‌ కానుంది. 650 పార్లమెంట్‌ స్థానాల్లో పోలింగ్‌ నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. ఈసారి లేబర్‌, కన్జర్వేటివ్‌ పార్టీల మధ్యే ప్రధాన పోటీ నెలకొంది. అయితే భారతీయుడు ప్రధానిగా ఉన్న రిషి సునాక్‌ కన్జర్వేటివ్‌ పార్టీకి ఈసారి ఓటమి తప్పదంటూ సర్వేలు చెబుతున్నాయి.

UK General Election: యూకే సార్వత్రిక ఎన్నికలకు సర్వం సిద్ధం.. 650 పార్లమెంట్‌ స్థానాల్లో రేపే పోలింగ్‌
Uk General Election 2024
Follow us

|

Updated on: Jul 03, 2024 | 6:12 PM

బ్రిటన్ సార్వత్రిక ఎన్నికలకు మరికొన్ని గంటల్లో పోలింగ్‌ స్టార్ట్‌ కానుంది. 650 పార్లమెంట్‌ స్థానాల్లో పోలింగ్‌ నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. ఈసారి లేబర్‌, కన్జర్వేటివ్‌ పార్టీల మధ్యే ప్రధాన పోటీ నెలకొంది. అయితే భారతీయుడు ప్రధానిగా ఉన్న రిషి సునాక్‌ కన్జర్వేటివ్‌ పార్టీకి ఈసారి ఓటమి తప్పదంటూ సర్వేలు చెబుతున్నాయి. అలాగే 14 ఏళ్లు ప్రతిపక్షంలోనే ఉన్న లేబర్‌ పార్టీ ఈసారి పక్కాగా అధికారంలోకి వస్తుందంటూ అక్కడ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.

అనూహ్య రాజకీయ పరిణామాల మధ్య యూకే ప్రధానిగా పగ్గాలు చేపట్టిన రిషి సునాక్‌ ఈ సార్వత్రిక ఎన్నికల్లో సొంత పార్టీని గెలిపించడం చాలా కష్టమనే వాదన వినిపిస్తోంది. గురువారం (జూలై 4) జరగనున్న బ్రిటిష్ పార్లమెంటు ఎన్నికల్లో అధికార కన్జర్వేటివ్‌లకు ఓటమి తప్పదని సర్వేలు వెల్లడిస్తున్నాయి. గత 14ఏళ్లుగా అధికారంలో ఉన్న కన్జర్వేటివ్ పార్టీపై యూకేలో తీవ్ర వ్యతిరేకత కనిపిస్తోంది. మార్పు నినాదంతో ప్రచారం చేసిన లేబర్ పార్టీ.. యూకేలో అధికారంలోకి వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయని ఓపీనియన్ పోల్స్‌ అంచనా వేస్తున్నాయి.

14ఏళ్లుగా యూకేలో కన్జర్వేటివ్‌ పార్టీనే అధికారంలో ఉంది. కానీ వారు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను పెద్దగా నెరవేర్చలేదు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలో ఉన్నప్పుడు అధికారం చేపట్టిన కన్జర్వేటివ్‌ పార్టీ మరో మూడు ఎన్నికల్లోనూ గెలిచింది. అయితే ఈ కాలంలో యూకే ఆర్థిక వ్యవస్థ నెమ్మదించడం, వరుస కుంభకోణాల విమర్శలకు తావిచ్చాయి. మరోవైపు జీవన ప్రమాణాలు చాలా కాస్టీగా మారడంతో కన్జర్వేటివ్‌ పార్టీపై తీవ్ర వ్యతిరేకత నెలకొంది.

మొత్తంగా… ప్రస్తుతం అధికారంలో ఉన్న సునక్ ఆధ్వర్యంలోని కన్జర్వేటివ్ పార్టీ, కీర్ స్టార్మర్ ఆధ్వర్యంలోని లేబర్ పార్టీ హోరాహోరీగా ప్రచారం ముగించాయి. గెలుపుపై ఎవరి ధీమా వారికే ఉన్నా.. లేబర్ పార్టీ బలంగా ఉందనే సంకేతాలు వెలువడుతున్నాయి.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

ఉభయ వేదాంత పీఠంకు అనుసంధానం ఈ స్వర్ణగిరి ఆలయం
ఉభయ వేదాంత పీఠంకు అనుసంధానం ఈ స్వర్ణగిరి ఆలయం
మహేష్‌ ఇలాకాలో.. ప్రభాస్‌ దిమ్మతిరిగే రికార్డ్.! అదిరిపోయింది గా!
మహేష్‌ ఇలాకాలో.. ప్రభాస్‌ దిమ్మతిరిగే రికార్డ్.! అదిరిపోయింది గా!
నాలుగేళ్ల తర్వాత ఆస్ట్రేలియా నుంచి బయల్దేరిన యువతి. అంతలోనే.?
నాలుగేళ్ల తర్వాత ఆస్ట్రేలియా నుంచి బయల్దేరిన యువతి. అంతలోనే.?
యూపీఐ యాప్‌లపై ఆన్‌లైన్‌లో కరెంట్‌ బిల్లుల చెల్లింపు బంద్‌.!
యూపీఐ యాప్‌లపై ఆన్‌లైన్‌లో కరెంట్‌ బిల్లుల చెల్లింపు బంద్‌.!
గత కొన్ని రోజులుగా స్థిరంగా ఉన్న పుత్తడి ధరలు..
గత కొన్ని రోజులుగా స్థిరంగా ఉన్న పుత్తడి ధరలు..
విజృంభిస్తున్న జికా వైరస్‌.. అప్రమత్తంగా లేకుంటే అంతే.!
విజృంభిస్తున్న జికా వైరస్‌.. అప్రమత్తంగా లేకుంటే అంతే.!
జియో, ఎయిర్‌టెల్ కొత్త చార్జీలు అమల్లోకి.. ఎప్పటి నుండి అంటే..
జియో, ఎయిర్‌టెల్ కొత్త చార్జీలు అమల్లోకి.. ఎప్పటి నుండి అంటే..
సారూ వదిలి వెళ్లొద్దు.. విద్యార్థుల ప్రేమకు టీచర్ భావోద్వేగం.!
సారూ వదిలి వెళ్లొద్దు.. విద్యార్థుల ప్రేమకు టీచర్ భావోద్వేగం.!
అర్ధరాత్రి ఇంట్లోకి చొరబడిన నాగుపాము.. బుసలు కొడుతూ.. వీడియో.
అర్ధరాత్రి ఇంట్లోకి చొరబడిన నాగుపాము.. బుసలు కొడుతూ.. వీడియో.
సల్మాన్‌ ఖాన్‌ హత్యకు పక్కా ప్లాన్‌.. ఛార్జిషీట్‌లో సంచలన విషయాలు
సల్మాన్‌ ఖాన్‌ హత్యకు పక్కా ప్లాన్‌.. ఛార్జిషీట్‌లో సంచలన విషయాలు