AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

South Africa: ఆదేశంలో భారీగా కరోనా ఒమిక్రాన్ కేసులు.. టీకాలు తీసుకోకుంటే ఆ పరిస్థితి తప్పదంటున్న ప్రభుత్వం

South Africa: దక్షిణాఫ్రికాలో కోవిడ్ -19  కొత్త ఒమిక్రాన్ వేరియంట్ వెలుగులోకి రావడంతో తమ దేశంలో భారీగా కేసులు పెరుగుతున్నాయని ఆ దేశ అధ్యక్షుడు సిరిల్ రామఫోసా అన్నారు. గత మూడు..

South Africa: ఆదేశంలో భారీగా కరోనా ఒమిక్రాన్ కేసులు.. టీకాలు తీసుకోకుంటే ఆ పరిస్థితి తప్పదంటున్న ప్రభుత్వం
South Africa President
Follow us
Surya Kala

|

Updated on: Dec 08, 2021 | 8:32 PM

South Africa: దక్షిణాఫ్రికాలో కోవిడ్ -19  కొత్త ఒమిక్రాన్ వేరియంట్ వెలుగులోకి రావడంతో తమ దేశంలో భారీగా కేసులు పెరుగుతున్నాయని ఆ దేశ అధ్యక్షుడు సిరిల్ రామఫోసా అన్నారు. గత మూడు వారాలుగా రోజు రోజుకీ కొత్త కేసులు భారీగా నమోదవుతున్నాయని.. ఇది కరోనా ఫోర్త్ వేవ్ వస్తుందేమో అనిపిస్తుందన్నారు. ఒమిక్రాన్‌ వేరియంట్‌ కేసుల పెరుగుదలతో తమ దేశంలోని ప్రజలు తప్పని సరిగా వ్యాక్సిన్ తీసుకోవాలని.. కరోనా నిబంధనలు పాటించాలని రామఫోసా కోరారు. దక్షిణాఫ్రికా సహా ప్రపంచవ్యాప్తంగా ఉన్న శాస్త్రవేత్తలు కొత్త ఒమిక్రాన్ వేరియంట్ గురించి.. దానిపై వ్యాక్సిన్ ఏ విధంగా పనిచేస్తుందని తెలుసుకొనే ప్రయత్నాలు చేస్తున్నారు. దేశ ప్రజలు కఠినమైన లాక్‌డౌన్ నిబంధనల కోసం ఎదురుచూడకుండా టీకాలు తీసుకోవాలని, సామూహిక భద్రత, కరోనా నివారణ చర్యలు తీసుకోవాలని రమాఫోసా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మరికొన్ని రోజుల్లోనే ఈ వేరియంట్‌కు సంబంధించి అదనపు సమాచారం తెలుస్తుందని దక్షిణాఫ్రికా అధ్యక్షుడు ఆశాభావం వ్యక్తం చేశారు.

రోజు రోజుకీ దేశంలో కేసుల సంఖ్య పెరుగుతోంది.. మరోవైపు ప్రజలు పండుగల సీజన్‌కు సన్నద్ధమవుతున్నందున, ఎక్కువ మందికి టీకాలు తమ ప్రాధాన్యతని చెప్పారు. అంటువ్యాధుల వ్యాప్తిని నిరోధించడానికి టీకాలు వేయడం అత్యంత ప్రభావవంతమైన సాధనమని శాస్త్రీయ ఆధారాలు చూపిస్తున్నాయి. టీకా తీసుకోవడం వలన తీవ్రమైన అనారోగ్యం, ఆసుపత్రిలో చేరడం, మరణాలను తగ్గిస్తాయని ఆయన చెప్పారు.

దేశంలో గడచిన ఏడు రోజుల్లోనే కొత్త కేసుల సంఖ్య 5 రేట్లు పెరిగాయి. అంతేకాదు 15 రోజుల క్రితం పాజిటివ్ రేటు 2 శాతం ఉండగా.. తాజాగా 25శాతానికి చేరుకొని ఆందోళన కలిగిస్తోంది. ఈ పాజిటివ్ రేటు మరింతగా పెరుగుతుందని ఆరోగ్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో దేశ ప్రజలను అప్రమత్తం చేస్తూ దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్‌ రామఫోసా ఓ ప్రకటన రిలీజ్ చేశారు. కరోనా నివారణ ఆంక్షలను మరింత కఠినతరం చేసే అంశంపై  జాతీయ స్థాయిలో ఏర్పాటు చేసిన నేషనల్‌ కరోనావైరస్‌ కమాండ్‌ కౌన్సిల్‌ త్వరలోనే సమావేశమవుతుందని చెప్పారు.

Also Read:  వివాహం ఆలస్యం అవుతుందా. అయితే గురువారం ఇలా చేయండి అద్భుత ఫలితం మీ సొంతం