Jupiter Remedies: వివాహం ఆలస్యం అవుతుందా. అయితే గురువారం ఇలా చేయండి అద్భుత ఫలితం మీ సొంతం
Jupiter Remedies: కొంతమందికి అందం, ఐశ్వర్యం, చదువు, మంచి ఉద్యోగం ఉన్నా వివాహం ఆలస్యం అవుతుంది. ఎన్ని పెళ్లి సంబంధాలు చూసినా పెళ్ళికి కుదరదు. దీనికి కారణం జాతకంలో..
Jupiter Remedies: కొంతమందికి అందం, ఐశ్వర్యం, చదువు, మంచి ఉద్యోగం ఉన్నా వివాహం ఆలస్యం అవుతుంది. ఎన్ని పెళ్లి సంబంధాలు చూసినా పెళ్ళికి కుదరదు. దీనికి కారణం జాతకంలో బృహస్పతి బలహీన స్థానంలో ఉండడమే. అలా బృహస్పతి స్థానం బలహీనంగా ఉన్నవారు.. గురువు బలపడేందుకు మీరు కొన్ని జ్యోతిష్య పరిహారాలు తీసుకోవాలి. అప్పుడు ఉపశమనం కలిగించవచ్చు. ఈరోజు బృహస్పతి బలపడేందుకు గురువారం చేయాల్సిన పరిహారాలు గురించి తెలుసుకుందాం..
బృహస్పతిని దేవతలకు గురువు. అంతేకాదు బృహస్పతి తొమ్మిది గ్రహాలలో ఒకటి. అయితే ఎవరికైనా వివాహానికి తరచుగా ఆటంకాలు ఎదురవుతున్నా, ధన సంక్షోభం వేధిస్తున్నా, చదువుకు ఆటంకం కలిగినా, ఎన్ని ప్రయత్నాలు చేసినా విజయం సాధించలేకపోయినా.. అటువంటివారు వెంటనే జాతకంలో బృహస్పతి స్థానం గురించి తెలుసుకోవాలి. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం.. బృహస్పతి చాలా శక్తివంతమైన గ్రహంగా పరిగణించబడుతుంది. గురువు బలహీనంగా ఉంటే, వ్యక్తి జీవితంలో గందరగోళం ఏర్పడుతుంది. ఎవరైనా పైన పేర్కొన్న ఏవైనా సమస్యలను ఎదుర్కొంటున్నట్లయితే, వెంటనే గురువారం రోజున బృహస్పతికి సంబంధించిన కొన్ని పూజలను చేయాల్సి ఉంటుంది.
గురువారం శ్రీవిష్ణు, లక్ష్మీదేవి ప్రీతికరమైన రోజు. కనుక ఎవరికైతే గురు స్థానం బలహీనంగా ఉంటే వారు గురువారం నాడు లక్ష్మీదేవితో పాటు నారాయణుడిని పూజించాలి. పూజ చేసే సమయంలో పసుపు బట్టలు ధరించి నారాయణునికి బెల్లం, శనగలను నైవేద్యంగా సమర్పించాల్సి ఉంది. పసుపు పుష్పాలు, పసుపు బట్టలు , పసుపు, చందనం సమర్పించండి. వీలైతే ఉపవాసం ఉండి సాయంత్రం పూట మిఠాయిలు తిని ఉపవాసాన్ని విరమించండి. ఉపవాసం చేయలేనివారు గురువారం రోజున ఉపవాస కథను చదవాలి లేదా వినాలి. అరటి చెట్టుకు పూజ చేసి నీరు పోయాలి. ఇలా చేయడం వల్ల గురుస్థానం బలపడుతుందని, వివాహానికి సంబంధించిన అడ్డంకులు తొలగిపోతాయని నమ్మకం. అంతేకాదు గురుగ్రహానికి సంబంధించిన ఇతర సమస్యలు కూడా తొలగి శుభ ఫలితాలు కలుగుతాయి.
పూజ చేసే విధానం:
*ప్రతి గురువారం స్నానం చేసే ముందు నీటిలో పసుపును కలుపుకోండి. స్నానం తర్వాత ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అనే మంత్రాన్ని జపించండి.
*గురువారం సూర్యోదయానికి ముందే లేవండి. స్నానం చేసిన తరువాత, విష్ణువు ముందు నెయ్యి దీపం వెలిగించి, విష్ణు సహస్రనామాన్ని పఠించండి. శనగ పిండితో చేసిన ఏదైనా స్వీట్‌ను నైవేద్యంగా పెట్టండి.
*గురువారంనాడు పసుపు, పిండి, బంగారం మొదలైనవి దానం చేయండి. అలాగే, ప్రతి గురువారం ఆవుకు పిండిలో బెల్లం , శనగలను కలిపి తినిపించండి.
*గురువారం రోజు జుట్టు కత్తిరించవద్దు. గోర్లు కత్తిరించవద్దు.
*గురువారం రోజున మీరు గురు మంత్రం పఠించండి. ఇక్కడ పేర్కొన్న కొన్ని మంత్రాల నుండి ఏదైనా మంత్రాన్ని ఎంచుకోవచ్చు –
ఓం బృహస్పతయే నమః
గ్రామ్, గ్రీన్, గ్రామ్ : గురువే నమః:
ఓం శ్రీ బృహస్పతియే నమః
ఓం గురవే నమః: