Elon Musk: ఎలాన్‌ మస్క్‌ మరో సంచనలం.. గంటకు 27వేల కిలోమీటర్ల వేగంతో వెళ్లేలా..

ప్రపంచ దిగ్గజం ఎలాన్‌ మస్క్‌ మరో అద్భుతాన్ని నిజం చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. కేవలం అంతరిక్ష ప్రయాణాలకే పరిమితమైన వ్యోమనౌకలను భూమిపై నడిపే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. స్టార్‌ఫిప్‌ పేరుతో సూపర్ ఫాస్ట్‌ విమాలను అందుబాటులోకి తీసుకొచ్చే దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది..

Elon Musk: ఎలాన్‌ మస్క్‌ మరో సంచనలం.. గంటకు 27వేల కిలోమీటర్ల వేగంతో వెళ్లేలా..
Elon Musk
Follow us
Narender Vaitla

|

Updated on: Nov 16, 2024 | 11:09 AM

ఎలాన్‌ మస్క్‌.. ఈ ప్రపంచ కుబేరుడి పేరు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మారుమోగుతోంది. మరీ ముఖ్యంగా అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్‌ ట్రంప్‌ విజయం సాధించిన తర్వాత ట్రంప్‌ పేరు ఎక్కువగా వినిపిస్తోంది. ఈ బిజినెస్‌ టైకూన్‌ ఇప్పుడు ఏకంగా అమెరికా ప్రభుత్వంలో భాగస్వామ్యం కానున్నాడన్న విషయం తెలిసిందే.

ఇదిలా ఉంటే వ్యాపార రంగంలో సంచలనాలు సృష్టించే మస్క్‌ తాజాగా మరో అద్భుతాన్ని సాకారం చేసే దిశగా అడుగు వేస్తున్నాడు. సాధారణంగా వ్యోమనౌక అనగానే అంతరిక్షంలోకి తీసుకెళ్లే వాహం అని అనుకుంటాం. అయితే ఇప్పుడు దీని అర్థాన్నే మార్చేందుకు మస్క్‌ ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. వ్యోమనౌకను సూపర్ ఫాస్ట్‌ విమానంగా మార్చేందుకు సన్నాహాలు చేస్తున్నాడు.

స్పేస్‌ ఎక్స్‌ కంపెనీ నుంచి ఈ సూపర్‌ ఫాస్ట్‌ విమానాలు త్వరలోనే అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది. ప్రపంచ దేశాల నగరాలమ మధ్య ప్రయాణ సమయాన్ని వీలైనంత వరకు తగ్గించాలనే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. స్టార్‌షిప్‌ ద్వారా సాధారణ విమాన ప్రయాణ దూరాన్ని దాదాపు 2,200 శాతం తగ్గించొచ్చని మస్క్‌ భావిస్తున్నట్టు ‘యూనిలాడ్‌ టెక్‌’ వార్తాసంస్థ పేర్కొంది.

ఈ స్టార్‌షిప్‌ను మొదట న్యూయార్క్‌, షాంఘై పట్టణాల మధ్య నడిపించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సదరు వార్తా సంస్థ ప్రచురించింది. అమెరికా, చైనాల మధ్య ప్రయాణ సమయాన్ని భారీగా తగ్గనుంది. ఈ రెండు నగరాల మధ్య విమానంలో ప్రయాణించడానికి సుమారు 14 గంటల 50 నిమిషాలు పడుతుంది. అయితే స్టార్‌షిప్‌తో ఈ రెండు నగరాల మధ్య ప్రయాణ సమయం కేవలం 39 నిమిషాలే పట్టనుంది.

గంటకు 27 వేల కిలోమీటర్ల గరిష్ఠ వేగంతో ప్రయాణించేలా ఈ స్టార్‌షిప్‌ను రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్‌ నిజంగానే విజయవంతమైతే.. ఢిల్లీ నుంచి శాన్‌ఫ్రాన్సిస్కోకు కేవలం 40 నిమిషాల్లోనే చేరుకోవచ్చన్నామాట. రెండో దిశలో ఈ స్టార్‌షిప్‌ను లండన్‌ నుంచి న్యూయార్క్‌కు, పారిస్‌ నుంచి న్యూయార్క్‌కు, ఢిల్లీ నుంచి శాన్‌ ఫ్రాన్సిస్కోకు నడిపించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..