America: ఒకే ఇంట్లో ఎనిమిది డెడ్ బాడీస్.. మృతుల్లో ఆరుగులు చిన్నారులే.. హత్యా లేక ఆత్మహత్యా..

అమెరికాలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఒకే ఇంట్లో ఎనిమిది మృతదేహాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వారిలో ఆరుగురు చిన్నారులు ఉండటం తీవ్ర విషాదం కలిగించింది. ఒక్లహామా రాష్ట్రంలోని బ్రోకెన్‌..

America: ఒకే ఇంట్లో ఎనిమిది డెడ్ బాడీస్.. మృతుల్లో ఆరుగులు చిన్నారులే.. హత్యా లేక ఆత్మహత్యా..
Dead Bodies In House
Follow us
Ganesh Mudavath

|

Updated on: Oct 29, 2022 | 8:29 AM

అమెరికాలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఒకే ఇంట్లో ఎనిమిది మృతదేహాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వారిలో ఆరుగురు చిన్నారులు ఉండటం తీవ్ర విషాదం కలిగించింది. ఒక్లహామా రాష్ట్రంలోని బ్రోకెన్‌ యారో పట్టణంలో ఈ దుర్ఘటన జరిగింది. గురువారం సాయంత్రం ఈ ఇంట్లో అగ్నిప్రమాదం జరిగింది. ఆ సమయంలో ఇద్దరు పెద్దలు ఆరుగురు చిన్నారులతో కలిసి ఇంట్లో ఉన్నారు. అదే సమయంలో ఓ వ్యక్తి కారులో వెళ్తుండగా ఆ ఇంటి నుంచి దట్టమైన పొగలు వస్తున్న విషయాన్ని గుర్తించారు. అప్పుడే ఇంటి ముందు ఓ వ్యక్తి స్పృహలో లేని ఒక మహిళను ఈడ్చుకెళ్తూ కనిపించాడని చెప్పారు. మంటల్లో తగలబడిపోతున్న ఇంట్లో ఉన్న ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. వారు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాలను పరిశీలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. అయితే ఇంట్లో ఉన్న ఇద్దరు పెద్దలు మొదట పిల్లలను చంపి ఆత్మహత్య చేసుకున్నారా? లేదా వీరందరినీ ఇంకెవరైనా హత్య చేసి ఆత్మహత్య చేసుకున్నట్లు నమ్మించేందుకు ఇంటికి నిప్పు పెట్టారా అన్న విషయాలపై దర్యాప్తు చేస్తున్నారు.

ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన చిన్నారులందరూ 1 నుంచి 13 ఏళ్ల లోపు వారే కావడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఆ ఇంట్లో నుంచి పోలీసులు తుపాకీలను స్వాధీనం చేసుకున్నారు. అయితే మృతుల వివరాలను మాత్రం వెల్లడించలేదు. అగ్ని ప్రమాదం కారణంగా మరణించినట్లు కనిపించడం లేదని అగ్నిమాపక శాఖ అధికారులు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి