Covid-19 Vaccine: నెలనెలా రూ.15వేలు చెల్లించండి.. వ్యాక్సిన్ తీసుకోని ఉద్యోగులకు షాక్ ఇచ్చిన ఆ సంస్థ
కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోకుండా తాత్సారం చేస్తున్న తమ ఉద్యోగుల విషయంలో ఆ ఎయిర్‌లైన్స్ కఠిన నిర్ణయం తీసుకుంది. వ్యాక్సిన్ తీసుకోని ఉద్యోగుల నుంచి కంపెనీ ప్రతి నెలా 200 డాలర్లు (రూ.14,831) సర్‌ఛార్జి వసూలు చేయాలని నిర్ణయించింది.
Covid-19 Vaccine – Delta Airlines: కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోకుండా తాత్సారం చేస్తున్న తమ ఉద్యోగుల విషయంలో డెల్టా ఎయిర్‌లైన్స్ సంస్థ కఠిన నిర్ణయం తీసుకుంది. వ్యాక్సిన్ తీసుకోని ఉద్యోగుల నుంచి కంపెనీ హెల్త్ ప్లాన్ కోసం ప్రతి నెలా 200 డాలర్లు (రూ.14,831) సర్‌ఛార్జి వసూలు చేయాలని నిర్ణయించింది. ఉద్యోగులకు పంపిన ఈ-మెయిల్స్‌లో తమ నిర్ణయాన్ని సమర్థించుకున్న అమెరికాకు చెందిన ఆ సంస్థ సీఈవో బాస్టియన్.. గత కొన్ని వారాలుగా కోవిడ్ కారణంగా ఆస్పత్రిలో చేరి చికిత్స పొందిన ఉద్యోగుల్లో దాదాపు అందరూ వ్యాక్సిన్లు తీసుకోని వారే ఉన్నట్లు చెప్పారు. కరోనా వైరస్ బారినపడి ఆస్పత్రిలో చేరితే దాదాపు 50వేల డాలర్లు వెచ్చించాల్సి వస్తోందని వివరించారు. అందుకే ఆ స్థాయిలో హెల్త్ ఇన్‌స్యూరెన్స్ పాలసీ తీసుకునేందుకు వ్యాక్సిన్ తీసుకోని ఉద్యోగుల నుంచి ప్రతి నెలా 200 డాలర్లు వసూలు చేయాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు. అలాగే వ్యాక్సిన్ తీసుకోని ఉద్యోగులు కరోనా బారినపడితే వారిని పే ప్రొటెక్షన్ ఉండబోదని ఆయన స్పష్టంచేశారు. వ్యాక్సిన్ తీసుకుని కరోనా బారినపడిన వారికి మాత్రమే పే ప్రొటెక్షన్ ఉంటుందని వివరించారు.
తమ సంస్థలో 75శాతం ఉద్యోగులు ఇప్పటికే కోవిడ్ టీకాలు తీసుకున్నట్లు బాస్టియన్ వెల్లడించారు. 100 శాతం వ్యాక్సినేషన్ లక్ష్యాన్ని త్వరలోనే చేరుకుంటామని చెప్పారు. వ్యాక్సిన్ విషయంలో కొందరు ఉద్యోగులు వేచిచూసే ధోరణి అవలంభిస్తున్నారని.. తక్షణమే వారు వ్యాక్సిన్లు తీసుకోవాలని సూచించారు.
కోవిడ్ వ్యాక్సిన్లు తీసుకోని ఉద్యోగుల విషయంలో యునైటెడ్ ఎయిర్‌లైన్స్ ఇప్పటికే సంచలన నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్ 27నాటికల్లా వ్యాక్సిన్ తీసుకోని ఉద్యోగుల సర్వీస్‌ను టెర్మినేట్ చేయనున్నట్లు తెలిపింది. ఇప్పుడు డెల్టా ఎయిర్‌లైన్స్ కూడా కాస్త కఠినంగానే వ్యాక్సిన్ తీసుకోని ఉద్యోగుల నుంచి నెలనెలా 200 డాలర్ల సర్‌ఛార్జి వసూలు చేయాలని నిర్ణయించింది. డెల్టా వేరియంట్‌లో అమెరికాలో శరవేగంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో ఆ సంస్థ ఈ నిర్ణయం తీసుకుంది.
Also Read..
ఏటీఎంల విషయంలో ఆర్బీఐ కీలక నిర్ణయం.. అక్టోబర్ 1 నుంచి కొత్త నిబంధనలు అమలు.. అదేంటంటే..
వాట్సాప్ కాల్‌ను ఎలా రికార్డు చేసుకోవాలో తెలియటం లేదా..? ఈ సింపుల్ ట్రిక్ ఫాలో అవ్వండి.