Afghanistan Crisis: తాలిబన్లతో దౌత్య చర్చలు మొదలు పెట్టిన చైనా..కొత్త ఆఫ్ఘనిస్తాన్ సృష్టిస్తామంటూ ప్రకటన!

చైనా తాలిబాన్ పాలనను గుర్తించిన తర్వాత దానితో సన్నిహిత సంబంధాలను పెంచుకోవడం ప్రారంభించింది. కాబూల్‌లో ఉన్న చైనా రాయబారి తాలిబాన్ రాజకీయ విభాగం చీఫ్ అబ్దుల్ సలాం హనాఫీని కలిసినట్లు చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వాంగ్ వెన్బిన్ వెల్లడించారు.

Afghanistan Crisis: తాలిబన్లతో దౌత్య చర్చలు మొదలు పెట్టిన చైనా..కొత్త ఆఫ్ఘనిస్తాన్ సృష్టిస్తామంటూ ప్రకటన!
Afghanistan Crisis
Follow us
KVD Varma

|

Updated on: Aug 26, 2021 | 8:41 AM

Afghanistan Crisis:  చైనా తాలిబాన్ పాలనను గుర్తించిన తర్వాత దానితో సన్నిహిత సంబంధాలను పెంచుకోవడం ప్రారంభించింది. కాబూల్‌లో ఉన్న చైనా రాయబారి తాలిబాన్ రాజకీయ విభాగం చీఫ్ అబ్దుల్ సలాం హనాఫీని కలిసినట్లు చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వాంగ్ వెన్బిన్ వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన  చైనా.. ఆఫ్ఘనిస్తాన్, దాని ప్రజలను గౌరవిస్తుంది అని చెప్పారు. వారితో బలమైన స్నేహపూర్వక సంబంధాలను కోరుకుంటుందని పేర్కొన్నారు. అయితే, సలామ్, చైనా రాయబారి మధ్య చర్చలు ఎంతసేపు సాగాయి? చర్చల్లో ఏ అంశాలు ప్రస్తావనకు వచ్చాయి? అనే విషయాలను మాత్రం ఆయన వెల్లడించలేదు.

మెరుగైన కనెక్టివిటీ అవసరం

తాలిబాన్లు.. చైనా రాయబారి మధ్య సమావేశం గురించి అడిగిన ప్రశ్నకు వాంగ్, “ఆఫ్ఘనిస్తాన్ కొత్త పాలనతో మాకు ఎలాంటి ఆటంకం లేకుండా సమర్థవంతమైన సంబంధాలు కావాలి.” ఇరు దేశాలు అనేక అంశాలపై చర్చలు, సంప్రదింపులు జరుపుతున్నాయి. వాంగ్ యు కాబూల్‌లో చైనా రాయబారి. తాలిబాన్ తరపున, దాని రాజకీయ విభాగం చీఫ్ అబ్దుల్ సలాం హనాఫీ చర్చలు జరుపుతున్నారు. అతను ఇతర దౌత్యవేత్తలను కలిసినట్లు కూడా వార్తలు వచ్చాయి.

చైనా రాయబారి..హనాఫీ ఎంత సేపు మాట్లాడుకున్నారు అనేదానిపై ఆయన సమాచారం ఇవ్వడానికి నిరాకరించినప్పటికీ వాంగ్‌ని ఇచ్చిన సమాచారం ప్రకారం,  సమస్యలపై చర్చలు జరిపారని తెలుస్తోంది.  అంతేకాకుండా, ”కాబూల్ ఒక ముఖ్యమైన వేదిక, ఛానెల్. అక్కడ మేము అవసరమైన అన్ని సమస్యల గురించి మాట్లాడుతున్నాము. ఆఫ్ఘనిస్తాన్ ప్రజల మనోభావాలను చైనా గౌరవిస్తుంది. వారు స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకోవాలని, వారి భవిష్యత్తును నిర్ణయించుకోవాలని మేము కోరుకుంటున్నాము. ఆఫ్ఘనిస్తాన్‌లో శాంతి, అభివృద్ధి మార్గాన్ని తెరవగలిగేలా మేము వారికి మంచి పొరుగువారిలా సహాయం చేయాలనుకుంటున్నాము. కొత్త ఆఫ్ఘనిస్తాన్‌ను సృష్టించడంలో వారికి మేము సహకరిస్తాం.” అని వాంగ్  స్పష్టం చేశారు.

తెరచి ఉన్న చైనా రష్యా రాయాబారా కార్యాలయాలు..

భారత్, యుఎస్ కాబూల్‌లోని తమ రాయబార కార్యాలయాలను మూసివేసాయి. మరోవైపు, చైనా కాకుండా, పాకిస్తాన్, రష్యా తమ రాయబార కార్యాలయాలు తెరిచి ఉంచాయి. వారి ఉద్యోగులు కూడా ఇక్కడ ఉన్నారు. గత నెలలో ముల్లా బరదార్ నేతృత్వంలోని తాలిబాన్ ప్రతినిధి బృందం బీజింగ్ వెళ్లి అక్కడ చైనా విదేశాంగ మంత్రిని కలిసింది. ఈ సమావేశంలో, ముల్లా బరదార్ చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యికి హామీ ఇచ్చినట్లు భావిస్తున్నారు, తైబాన్లు ఉయిఘూర్ ముస్లింల ఉద్యమానికి మద్దతు ఇవ్వవని ఈ సందర్భంగా బరదార్ చైనాకు హామీ ఇచ్చినట్టు ప్రచారం జరిగింది.

గత నెలలో, చైనా ప్రత్యేక అధికారి (ఆఫ్ఘనిస్తాన్ వ్యవహారాలపై) లియు జియాన్ ఖతార్, జోర్డాన్ మరియు ఐర్లాండ్‌లలో కూడా పర్యటించారు. అతను ఆఫ్ఘనిస్తాన్ సమస్యపై ఈ దేశాల నాయకులతో మాట్లాడాడు.

మరోవైపు యుఎస్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ సిఐఎ చీఫ్ విలియం బర్న్స్ కూడా  తాలిబన్లతో రహస్య చర్చలు జరుపుతున్నట్టు వార్తలు వచ్చాయి.  సోమవారం అకస్మాత్తుగా కాబూల్‌కు రహస్య మిషన్ కింద ఆయన వెళ్లారని వార్తా సంస్థలు పేర్కొన్నాయి. ఇక్కడ ఆయన  తాలిబాన్ నాయకుడు ముల్లా అబ్దుల్ ఘనీ బరదార్‌ను కలిశారని అమెరికన్ వార్తాపత్రిక ‘వాషింగ్టన్ పోస్ట్’ వెల్లడించింది. అయితే, అమెరికా విదేశాంగ శాఖ లేదా వైట్ హౌస్ దీని గురించి ఏమీ చెప్పలేదు.  కాబూల్‌లో తాలిబాన్ ఆక్రమణ తర్వాత అమెరికాలోని అత్యున్నత దౌత్యవేత్త ఉగ్రవాద సంస్థ అగ్ర నాయకుడితో సమావేశం కావడం ఇదే మొదటిసారి. ఈ అజ్ఞాత పరిస్థితిపై యుఎస్ అధికారులు జరిగిన సమావేశాన్ని ధృవీకరించారు. ఈ సందర్భంగా అధికారులు, ”ఇది చాలా సున్నితమైన విషయం. బర్న్స్ అమెరికా అగ్రశ్రేణి, ఇంటెలిజెన్స్,  సైనిక వ్యవహారాలపై సీనియర్ నిపుణుడు మాత్రమే కాదు, అతను అనుభవజ్ఞుడైన దౌత్యవేత్త కూడా.” అని చెప్పారు.

Also Read: Afghan – India: తాలిబాన్ల రాకతో అఫ్గనిస్థాన్‌లో భారత్‌కు చిక్కులు తప్పవా? ఇప్పుడు మనముందున్న ఆప్షన్స్ ఇవేనా?

Afghanistan Crisis: పంజ్‌షీర్‌లో తీవ్ర పోరాటం..50 మంది తాలిబన్ సైనికుల హతం..బందీలుగా 20 మంది!