Xi Jinping : ఆఫ్ఘన్ లో ఉగ్రవాద బృందాలకు ప్రాతినిధ్యం లేకుండా కొత్త ప్రభుత్వం..చైనా ఆకాంక్ష..
ఆఫ్ఘనిస్థాన్ లో ఏర్పడే కొత్త ప్రభుత్వంలో ఉగ్రవాద బృందాలకు ప్రాతినిధ్యం ఉండరాదని చైనా కోరింది. ఈ మేరకు తన అభిప్రాయాన్ని రష్యాకు వెల్లడించింది. టెర్రరిస్టు గ్రూపులకు దూరంగా..
ఆఫ్ఘనిస్థాన్ లో ఏర్పడే కొత్త ప్రభుత్వంలో ఉగ్రవాద బృందాలకు ప్రాతినిధ్యం ఉండరాదని చైనా కోరింది. ఈ మేరకు తన అభిప్రాయాన్ని రష్యాకు వెల్లడించింది. టెర్రరిస్టు గ్రూపులకు దూరంగా.. అన్ని రాజకీయ పక్షాలతో కూడిన ప్రభుత్వం ఏర్పడాలని తాము కోరుతున్నట్టు చైనా అధ్యక్షుడు జీజిన్ పింగ్..రష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్ కి స్పష్టం చేశారు. ఆఫ్ఘన్ సమస్యపై రష్యతోను, ఇతర అంతర్జాతీయ దేశాలతోనూ కమ్యూనికేషన్ ని బలోపేతం చేసేందుకు, ఆఫ్ఘానిస్తాన్ లో శాంతి నెలకొనేలా చూడడానికి తాము యత్నిస్తామని ఆయన చెప్పారు. ఆఫ్ఘన్ లోని తాజా పరిణామాలపై ఆయన పుతిన్ తో ఫోన్ లో మాట్లాడారు. పుతిన్ తో భారత ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడిన మరుసటి రోజే జీ జిన్ పింగ్ కూడా ఈ మేరకు చర్చించారు. ఆఫ్ఘన్ లో అన్ని పక్షాలూ అరమరికలు లేకుండా సంప్రదింపుల ద్వారా రాజకీయ ఒడంబడికకు రావాలని ఆయన అన్నారు. ఉగ్రవాద బృందాలకు దూరంగా ఈ ఒప్పందం కుదరాలన్నారు. ముఖ్యంగా పొరుగు దేశాలతో స్నేహ సంబంధాలు ఏర్పరచుకునే దిశలో నూతన ప్రభుత్వం ఏర్పడాలి.. అని ఆయన సూచించారు.
రష్యా అధ్యక్షుడు పుతిన్ కూడా ఇందుకు అంగీకరిస్తూ.. ఆఫ్ఘన్ పరిస్థితిలోని కొన్ని మార్పులు చూస్తే..బయటి శక్తులు కొన్ని వీటిని ప్రమోట్ చేస్తున్నట్టు కనిపిస్తోందని.. ఇది కొన్ని దేశాలకు మంచిది కాదని పేర్కొన్నారు. బహుశా ఇది ఇండియాను ఉద్దేశించి ఆయన పరోక్షంగా ఈ వ్యాఖ్య చేసినట్టు కనిపిస్తోంది. అటు-ఆఫ్ఘన్ లో చైనా రాయబారి వాంగ్ యూ నిన్న తాలిబన్ రాజకీయ కార్యాలయ నేత అబ్దుల్ సలామ్ హనాఫీతో చర్చించారు. ఆఫ్ఘన్ల అభిమతాన్ని గౌరవించాలని ఆయన కోరారు. అయితే ఆగస్టు 31 డెడ్ లైన్ గురించి మాత్రం ఆయన చర్చించలేదు.
మరిన్ని ఇక్కడ చూడండి: సమంత, విజయ్ సేతుపతి, నయన తార ఒకే ఫ్రేమ్ లో ఫుట్ బోర్డు ప్రయాణం.. వైరల్ వీడియో..:Stars Viral Video.
మగాడికి గర్భం వస్తే ఎలా ఉంటుందో చూడాలనుకున్నాడు..!కానీ అంతలోనే..! (వైరల్ వీడియో):Viral Video.
5 అడుగులు ఉన్న భారీ నాగుపాముని చాకచక్యంగా పట్టి డబ్బాలో బంధించాడు..:Cobra Video Viral.