5 అడుగులు ఉన్న భారీ నాగుపాముని చాకచక్యంగా పట్టి డబ్బాలో బంధించాడు..:Cobra Video Viral.

ఈ మధ్యకాలంలో నాగుపాములు తరచూ జనావాసాల్లోకి వస్తున్న సంగతి తెలిసిందే. పామును దూరం నుంచి చూస్తేనే భయంతో వణికిపోతాం. అలాంటిది మనకు దగ్గరలో ఉంటే ఇంకేమైనా ఉందా.? గుండె ఆగినంత పనవుతుంది. సరిగ్గా ఇదే పరిణామం కొంతమంది రైతులకు ఎదురైంది...

5 అడుగులు ఉన్న భారీ నాగుపాముని చాకచక్యంగా పట్టి డబ్బాలో బంధించాడు..:Cobra Video Viral.

|

Updated on: Aug 26, 2021 | 9:32 AM

సోషల్ మీడియాలో అనేక వైరల్ వీడియోలను మనం చూస్తూనే ఉంటాం. అందులో కొన్ని క్యూట్‌గా ఉంటే.. మరికొన్ని ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. ఇంకొన్ని ఒళ్లు గగుర్పొడిచేలా ఉంటాయి. ఇలాంటి కోవకు చెందిన ఓ వీడియో గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం.ఈ మధ్యకాలంలో నాగుపాములు తరచూ జనావాసాల్లోకి వస్తున్న సంగతి తెలిసిందే. పామును దూరం నుంచి చూస్తేనే భయంతో వణికిపోతాం. అలాంటిది మనకు దగ్గరలో ఉంటే ఇంకేమైనా ఉందా.? గుండె ఆగినంత పనవుతుంది. సరిగ్గా ఇదే పరిణామం కొంతమంది రైతులకు ఎదురైంది.

నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం నళేశ్వర్ గ్రామానికి చెందిన రైతైన పోశెట్టి పొలంలో రెండు రోజులుగా 5 అడుగుల భారీ నాగుపాము సంచరిస్తున్నట్లు కొంతమంది రైతులు గుర్తించారు. అందులో పని చేసేందుకు భయభ్రాంతులకు గురై.. నందిపేటకు చెందిన స్నేక్ క్యాచర్ సర్వర్ ఖాన్‌కి సమాచారం అందించారు. ఆయన పొలం వద్దకు వచ్చి సుమారు ఐదు అడుగుల నాగు పాముని చాకచక్యంగా పట్టి పాలిథిన్ డబ్బాలో బంధించారు. ఆ తర్వాత అటవిశాఖ అధికారులకు అందజేశారు. కాగా, పామును పట్టుకోవడంతో రైతులు ఊపిరి పీల్చుకున్నారు.

మరిన్ని ఇక్కడ చూడండి: ఇదే గోల్డెన్ ఛాన్స్..87 రూపాయలకే ఇళ్లు..!ఎలా అనుకుంటున్నారా..?: House 87 Rupees Video.

చింపాంజీతో మహిళ ఎఫైర్..! చేష్టలు హద్దు మీరడంతో ఎం చేసారంటే..?: Woman affair with chimpanzee Viral Video.

ప్రిన్స్‌ మహేష్‌ సంచలన నిర్ణయం..!ఇప్పుడు నానక్‌రామ్‌గూడ లో కూడా షురూ..:Mahesh Babu Video.

పీఎఫ్‌ ఖాతాదారులకు అలర్ట్‌..!ఇది తెలుసుకోండి లేదంటే నష్టపోతారు..:Alert EPFO Clients Video.

Follow us