విషాదం: బస్సును ఢీకొట్టిన రైలు…30 మంది మృతి
పాకిస్తాన్ లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. హింద్ రాష్ట్రంలో జరిగిన రైలు ప్రమాదంలో 30 మంది మృత్యువాతపడ్డారు. 60 మందికి పైగా గాయపడ్డారు. క్షతగాత్రులను హుటాహుటినా స్థానిక ఆస్పత్రులకు తరలించి చికిత్స అందజేస్తున్నారు.
పాకిస్తాన్ లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. హింద్ రాష్ట్రంలో జరిగిన రైలు ప్రమాదంలో 30 మంది మృత్యువాతపడ్డారు. 60 మందికి పైగా గాయపడ్డారు. క్షతగాత్రులను హుటాహుటినా స్థానిక ఆస్పత్రులకు తరలించి చికిత్స అందజేస్తున్నారు. రోహ్రిప్రాంతంలో రైల్వే గేటు వద్ద ఈ ప్రమాదం జరిగింది. బస్సు పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొట్టింది. అదే సమయంలో మరో బైక్ లను రైలు ఢీకొట్టింది. బస్సు కరాచీ నుంచి సర్గోదాకు వెళ్తుండగా, రోహ్రిప్రాంతంలో పట్టాలు దాటుతుండగా ప్రమాదం జరిగింది. ఘటనా స్థలానికి చేరుకున్న రెస్క్యూ టీం సహాయక చర్యలు చేపట్టింది. రైల్వే గేటు దగ్గర సిబ్బంది లేకపోవడం వల్లే ప్రమాదం జరిగినట్లుగా భావిస్తున్నారు.